గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పట్ల మెతక వైఖరి ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసిన తర్వాత కఠిన వైఖరి తీసుకున్నారు. న్యూజెర్సీలోని మోరిస్‌టౌన్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, ట్రంప్ రష్యా అధ్యక్షుడిపై తీవ్ర విమర్శలు చేస్తూ, “నేను పుతిన్ వ్యవహారం సరిగా లేదు. ఆయన పూర్తిగా పిచ్చివాడైపోయాడు. ఈ వ్యక్తికి ఏమైందో నాకు తెలియదు” అని అన్నారు.
Also Read:AP News : ఇద్దరు పిల్లల తల్లి(40)ని ప్రేమ వివాహం చేసుకున్న 25 ఏళ్ల యువకుడు.. చివరికీ..
“నాకు పుతిన్ చాలా కాలంగా తెలుసు, మా మధ్య మంచి సంబంధం ఉంది. కానీ ఇప్పుడు ఆయన బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. ఎటువంటి కారణం లేకుండా ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు మరియు డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. నగరాలపై దాడి చేస్తున్నాడు, ప్రజలను చంపుతున్నాడు. నాకు ఇది అస్సలు ఇష్టం లేదు. ఈ వ్యక్తికి ఏమైందో నాకు తెలియదు. నాకు ఇదంతా అస్సలు నచ్చదు.” అని తెలిపాడు.
Also Read:Vishnupriya : చీరకట్టులో నడుము అందాలు చూపిస్తున్న విష్ణుప్రియ
వారు ఉక్రెయిన్‌లోని ఒక భాగాన్ని మాత్రమే కాకుండా, మొత్తం ఉక్రెయిన్‌ను కోరుకుంటున్నారని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. బహుశా అది నిజమే కావచ్చు, కానీ అలా చేస్తే, అది రష్యా పతనానికి దారి తీస్తుంది అని ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు. అధ్యక్షుడు జెలెన్స్కీ తను మాట్లాడే విధానం ద్వారా తన దేశానికి ఎటువంటి మేలు చేయడం లేదు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట సమస్యలను సృష్టిస్తుంది. అతడు తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Also Read:MS Dhoni: నాకు వయసు అయిపోయింది అనిపిస్తోంది!
రష్యా ఇప్పటివరకు ఉక్రెయిన్‌పై అతిపెద్ద వైమానిక దాడి చేసింది. ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో రష్యా 367 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఉక్రేనియన్ వైమానిక దళం ప్రకారం, వారు 45 క్షిపణులను కూల్చివేసి 266 డ్రోన్లను ధ్వంసం చేశారు. అనేక నగరాల్లో భారీ విధ్వంసం జరిగింది. కీవ్‌తో సహా 30 కి పైగా నగరాలు, గ్రామాలు దెబ్బతిన్నాయి. ఈ దాడిలో కనీసం 12 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు.
Also Read:Honeytrap: వృద్ధుడితో 28 ఏళ్ల యువతి అసభ్యకర చేష్టలు.. వీడియోలు తీసి రూ.50 లక్షలు డిమాండ్..!
అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా అమెరికా ప్రతిస్పందన పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ” ఆదివారం ప్రపంచం సెలవు పెట్టవచ్చు, కానీ యుద్ధం కొనసాగుతుంది. అమెరికా మౌనం, ప్రపంచం మౌనం పుతిన్‌ను మరిన్ని దురాగతాలకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నాయి. రష్యా ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురాకపోతే, ఇటువంటి దాడులు కొనసాగుతూనే ఉంటాయి” అని ఆయన అన్నారు.