Sisodia: లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై దాదాపు 17 నెలల పాటు జైలు జీవితం గడిపిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఎట్టకేలకు బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం ఆయన తన కుటుంబంతో కలిసి కన్నాట్ ప్లేస్ లోని హనుమాన్ మందిర్ కు వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
Read Also: Manda Krishna Madiga: విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై ఏపీ, తెలంగాణ సీఎంలను కలుస్తాం..
ఈ సందర్భంగా మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. బజరంగ్ బలి ఆశీస్సులు తనపై ఉన్నాయన్నారు. ఆయన ఆశీర్వాదంతోనే తాను జైలు నుంచి బయటకు వచ్చాను.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా హనుమాన్ ఆశీస్సులు ఉన్నాయని, తనలానే సీఎం కూడా తొందరలోనే జైలు నుంచి రిలీజ్ అవుతారని సిసోడియా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నిన్న సాయంత్రం తీహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. కాగా, అంతకుముందు.. రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీ తీసుకొని ఆయనను విడుదల చేయాలని కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.
Read Also: Funny Thief in Siddipet: అంబులెన్స్ దొంగలించిన దొంగ.. అరగంటలో యాక్సిడెంట్ ఆసుపత్రికి
అలాగే, సిసోడియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలి, సాక్షులను ప్రభావితం చేయకూడదు, ప్రతీ సోమవారం, గురువారం సీబీఐ, ఈడీ అధికారుల ముందు హాజరుకావాలని సుప్రీం ధర్మాసనం కొన్ని షరతులు పెట్టింది. అయితే, ఢిల్లీ మద్యం కేసుకి సంబంధించి గతేడాది ఫిబ్రవరి 26వ తేదీన సీబీఐ అధికారులు అప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్టు చేయడంతో.. దాదాపు 17 నెలల పాటు ఆయన తీహార్ జైలులోనే ఉన్నారు.
#WATCH | Delhi: AAP leader and former Deputy CM Manish Sisodia says, "Lord Bajrang Bali has blessed me. Arvind Kejriwal also has blessings of Lord Bajrang Bali and you will see that Kejriwal ji will also be blessed in the same way." https://t.co/wZl0A1lw9D pic.twitter.com/WZaPtbaqw7
— ANI (@ANI) August 10, 2024