కాకినాడలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ లో విషాదం చోటుచేసుకుంది. ర్యాలీలో పాల్గొంటు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు సాయి కిరణ్ అనే యువకుడు. మంగళవారం ఉదయం 1600 మీటర్ల పరుగు పందెం జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం శ్రీహరి నాయుడుపేట గ్రామానికి చెందిన యువకుడు సాయి కిరణ్. వెంటనే యువకుడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. యువకుడి మృతి తో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 5న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కాకినాడలో ప్రారంభమైంది ..రేపటితో ముగియనుంది..ఆర్మీ ర్యాలీలో పదివేల మంది అభ్యర్థులు పాల్గొన్నారు.