“ది వాక్సిన్ వార్” సినిమాపై ప్రధాని మోడీ ప్రశంసలు..
‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీ మేకర్స్ నుంచి వచ్చి మరో సినిమా ‘ది వాక్సిన్ వార్’. కోవిడ్ సమయంలో భారత శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ రూపొందించిన కథాంశంతో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తీశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో శాస్రవేత్తలు ఎదుర్కొన్న సవాళ్లు, వారి కృషిని ఆధారంగా ఈ సినిమాను రూపొందింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ది వ్యాక్సిన్ వార్ సినిమాపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు.ఆయన చేసిన ప్రసంగంలో వ్యాక్సిన్ వార్ సినిమాను గురించి ప్రస్తావించారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా భారత శాస్త్రవేత్తల కృషిని ప్రధాని అభినందించారు. మన దేశ శాస్త్రవేత్తలు రాత్రి, పగలు అనే తేడా లేకుండా కష్టపడిన తీరు వివరిస్తూ ‘ది వ్యాక్సిన్ వార్’ అనే సినిమా తీసినట్లు విన్నానని, బుషుల వలే శాస్త్రవేత్తలు ల్యాబుల్లో కోవిడ్‌తో పోరాడారని, శాస్త్రవేత్తలు, సైన్స్ ప్రాముఖ్యతను హైలెట్ చేసినందుకు ఈ చిత్ర నిర్మాతలను అభినందిస్తున్నానని మోడీ అన్నారు.
‘పవిత్ర లోకేష్’ను చూస్తే ఇలాంటి లేడీస్ ఉంటారా అనిపిస్తుంది!
మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ అక్టోబర్ 6 నుంచి ఆహాలో అయ్యేందుకు సిద్ధం అయింది. ఈ సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించగా హెబ్బా పటేల్ ప్రముఖ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నరేశ్ వీకే, పవిత్రా లోకేష్, తమిళ నటుడు జయప్రకాశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారం కానున్న సందర్భంగా ఈ సినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించిన యూనిట్ అనేక విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ విప్లవ్ కోనేటి మాట్లాడుతూ ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ కు కృతజ్ఞతలు తెలిపారు, నరేష్ తక్కువ సీన్స్ చేసినా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని, ఈ సినిమాలో పవిత్ర లోకేష్ క్యారెక్టర్ చూస్తే బయట ఇలాంటి లేడీస్ ఉంటారా అనిపిస్తుందని అన్నారు.
హాఫ్ సెంచరీతో రాణించిన జో రూట్.. కివీస్ ముందు ఓ మోస్తరు టార్గెట్
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆరంభ పోటీలో న్యూజిలాండ్ బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ తీసుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తొలి వికెట్ కు 44 పరుగులు భాగస్వామ్యం చేసిన తర్వాత వికెట్ పడటంతో క్రీజులోకి జో రూట్ (77) వచ్చి నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తర్వాత గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జోస్ బట్లర్ 43, జానీ బెయిర్‌స్టో 33, డేవిడ్ మలన్ 14, హ్యారీ బ్రూక్ 25, మొయిన్ అలీ 11, లియామ్ లివింగ్ స్టోన్ (20), క్రిస్ వోక్స్ (11), సామ్ కరన్ 14 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
మీరంతా బీజేపీకి గుణపాఠం చెప్పాలి
గవర్నర్ ఎమ్మెల్సీ అభ్యర్థులని తిరస్కరించడంపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఎరుకల జాతి, విశ్వ బ్రహణులుకు సీఎం ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారని, గవర్నర్లను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎరుకల జాతిని రిజెక్ట్ చేసిందని, మీరంతా బిజెపికి గుణపాఠం చెప్పాలన్నారు మంత్రి హరీష్ రావు. బీజేపిలో ఉండి తమిళి సై గవర్నర్ కావచ్చని, కుర్రా సత్యనారాయణ మాత్రం బీఆర్‌ఎస్‌లో ఉండి ఎమ్మెల్సీ కావద్దా అని ఆయన ప్రశ్నించారు. ఇక, అంతకుముందు.. సిద్దిపేటలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నూతనంగా నిర్మించిన 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను హరీష్ రావు ప్రారంభించారు.
ఎప్పుడూ నాకు సపోర్ట్ గా ఉన్నారు… థాంక్యూ బావ!
ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న ఈ సినిమాని ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషించారు. బుధవారం సాయంత్రం మ్యాడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగగా అందులో భాగంగా నార్నే నితిన్ మాట్లాడుతూ ముందుగా మా దర్శకుడు కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలని అన్నారు.
విశాఖ ఉక్కు అప్పులను నష్టాలుగా చూపించి కేంద్రం అమ్మకానికి పెట్టింది..
విశాఖ ఉక్కు అప్పులను నష్టాలుగా చూపించి కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం అన్యాయం అంటూ సీతారాం ఏచూరి మండిపడ్డారు. వ్యవస్థను మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లోకి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెడుతోంది అని ఆయన విమర్శలు గుప్పించారు. రైతు ఉద్యమం తరహాలో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాలపై వెనక్కి తగ్గడం ఖాయం.. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలంటే మోడీని అధికారానికి దూరం చేయాలిసిందే.. నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉంటే కేంద్రం మాత్రం తప్పుడు ప్రచారాలు చేసుకుంటోంది అని సీతారం ఏచూరి అన్నారు. ప్రచారాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న మోడీ.. రైతుల రుణమాఫీకి మాత్రం ముందుకు రాడు అని సీతారం ఏచూరి అన్నారు. 2024లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కాపాడుకోవడానికి యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.. ఇండియా కూటమి తరపున విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యతను మార్కిస్ట్ పార్టీ తీసుకుంటుంది అని ఆయన పేర్కొన్నారు.
విజయ్ నట విశ్వరూపం.. బ్లడీ స్వీట్ ఏ రేంజ్ లోనా
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో అభిమానులు అందరూ విజయ్ నటిస్తున్న లియో సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష నటిస్తుండగా.. అర్జున్ సర్జా, సంజయ్ దత్ విలన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్. టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాయి.ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న లియో ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ చేశారు మేకర్స్.. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. పవర్ ప్యాక్డ్ ట్రైలర్ ను లోకేష్ దింపేశాడు.
ఢిల్లీలో చక్రం తిప్పుతామన్నారు.. బొంగురం కూడా తిప్పలేదు
బీఆర్ఎస్ తో పొత్తుకు సంకేతాలు ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పడం సిగ్గుమాలిన చర్య అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచాం.. ఎన్నికల్లో కలవలేదు.. అబద్ధాలకు పెట్టింది పేరు బీఆర్ఎస్.. మోడీ అసలు రహస్యాన్ని బయట పెట్టారు.. అందితే జుట్టు.. లేకపోతే కాళ్ళు పట్టుకోవడం బీఆర్ఎస్ వ్యవహార శైలి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. BRS ది పచ్చి అవకాశ వాదమే.. బీఆర్ఎస్ రాజకీయ పరాన్నజీవి.. ముఖ్యమంత్రి చేస్తే TRS దుకాణం బంద్ చేస్తామని చెప్పింది వాస్తవం కాదా.. వాస్తవాలు చెబితే, కుడితిలో పడ్డ ఎలుకలా వ్యవహరిస్తున్నారు అని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు.
కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే దమ్ముందా..?
కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే దమ్ముందా..? అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఆయనను సీఎం అభ్యర్ధిగా ప్రకటించిన మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుంది అని ఆయన వ్యాఖ్యనించారు. నీ కొడుకు అహంకారం చూసి మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవరూ బీఆర్ఎస్ కు ఓట్లేయరు.. కేసీఆర్ కొడుకుకు కండకావరం తలకెక్కింది అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు, సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుతో పాటు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న కృష్ణా ట్రిబ్యునల్ కు విధివిధానాలు ఖరారు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
ఇవన్నీ టైమ్ వేస్ట్ వ్యవహరాలు.. ఆప్ ఎంపీ కస్టడీపై సీఎం కేజ్రీవాల్..
ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ఎంపీ సంజయ్ సింగ్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా ఈ రోజు ఆయనకు కోర్టు అక్టోబర్ 10 వరకు 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో అంతకుముందు ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌తో పాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరు జైలులో ఉన్నారు. బుధవారం రోజు ఎంపీ సంజయ్ సింగ్ ఇంటిలో 10 గంటల పాటు ఈడీ విచారించిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసింది.
చావడానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ భయపడను.. ప్రధాని నరేంద్రమోడీ, అదానీ అవినీతి గురించి నిరంతరం మాట్లాడుతాను, అదానీ అవినీతి గురించి ఇప్పటి వరకు ఈడీకి చాలా ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని అరెస్ట్ తర్వాత విడుదల చేసిన వీడియోలో సంజయ్ సింగ్ ఆరోపించారు. ఆప్ పార్టీని దెబ్బతీయడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీలతో దాడులు చేయిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష ఇండియా కూటమిని చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారని విమర్శిస్తున్నాయి.
నేను ఎన్డీయేలో ఉంటే ఏంటి.. బయట ఉంటే ఏంటి.. మీకు భయం ఎందుకు..?
జనసేన పార్టీ వారాహి విజయ యాత్రలో భాగంగా నేడు కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం పరిధిలోని ముదినేపల్లి గురజా రోడ్డులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయిన జనసేనకు భయపడనక్కర్లేదని వైసీపీ నేతలంటారు..175కి 175 కొట్టేస్తామనే వైసీపీ నేతలకు భయం ఎందుకు అని ఆయన అన్నారు. నేను NDA లో ఉంటే ఏంటి.. బయట ఉంటే ఏంటి.. ఎందుకు భయం మీకు.. నాకు 151 ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్షం ఊసే నేను ఎత్తను.. కైకలూరు ఎమ్మెల్యే, ఆయన కొడుకు పోలీసు స్టేషనులో కూచుని మరీ చేసే పనులను తేలుస్తామన్నారు. 2009లో వైఎస్ఆర్ ను ఎదుర్కొన్నా.. ఎక్కడా భయపడలేదు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ సూపర్ మార్కెట్‌పై రష్యా దాడి.. 49 మంది మృతి
ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడికి తెగబడింది. ఖార్కివ్ తూర్పు ప్రాంతంలోని సూపర్ మార్కెట్‌పై దాడి చేసింది. ఈ దాడిలో ప్రజలు పెద్ద ఎత్తున మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా జరిపిన ఈ రాకెట్ దాడిలో ఇప్పటి వరకు 49 మంది ప్రజలు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్ స్కీ తెలిపారు.
రష్యా సరిహద్దుల్లో ఉన్న కుపియాన్స్క్ జిల్లాలోని గ్రోజా గ్రామంపై ఈ రాకెట్ దాడి జరిగిందని, గతంలో ఈ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకుందని, ఆ తరువాత ఉక్రెయిన్ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకోవడంతోనే రష్యా దళాలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని జెలెన్ స్కీ ఆరోపించారు. ఒక సాధారణ దుకాణంపై రాకెట్ దాడి చేసి ప్రజలను చేయడం రష్యా చేసిన ఉగ్రవాద దాడి అని విమర్శించారు.
ఈ నెల 6 ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ను ఈ నెల 6 న (శుక్రవారం) లాంఛనంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఒక పాఠశాలలో శుక్రవారం నాడు ఈ కార్యక్రమాన్ని మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని తెలిపారు.
మిగిలిన పాఠశాలల్లో దసరా సెలవులు పూర్తి కాగానే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. ఇందుకు సంబంధించి పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకం అమలుతీరును పర్యవేక్షించే భాధ్యతను పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ కమిషనర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగిస్తున్నామని తెలిపారు. విద్యా శాఖ, పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ పథకాన్ని సమర్ధవంతంగా అమలుచేస్తామని పేర్కొన్నారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు అల్ఫాహారాన్ని అందించనున్నామని అన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు డ్రాపవుట్లను తగ్గించి, హాజరు శాతాన్ని పెంచడంతో పాటు వారికి చదువు పట్ల శ్రద్ధ కలిగేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీ
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రెండు రోజులపాటు దేశ రాజధానిలో సీఎం పర్యటించనున్నారు. కాగా, ఇవాళ సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించారు. పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని ఆయన వినతి చేశారు. ఇక, సీఎం జగన్ సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డిలు ఉన్నారు.
కూతురుపై సవతి తండ్రి అత్యాచారం.. రెండేళ్లుగా వేధింపులు..
మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరుగుతున్నాయి. నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కామాంధులు బరి తెగిస్తూనే ఉన్నారు. వావీవరసలు మరిచి మృగాళ్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కేసులు దేశంలో ఎక్కడో చోట బయటపడుతూనే ఉన్నాయి. పరువు కోసం బయటకు రాని కేసులు అనేకం ఉంటున్నాయి. తాజాగా నవీ ముంబై ప్రాంతంలో ఓ సవతి తండ్రి గత రెండేళ్లుగా 15 ఏళ్ల కూతురుపై అత్యాచారం చేస్తున్నాడు. ప్రాణాలతో బయటపడిన బాలిక బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 2021, అక్టోబర్ 2023 మధ్య తన సవతి తండ్రి తనపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడని, అసహజ సెక్స్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తను కొట్టి, చంపేస్తానని బెదిరించాడని బాలిక ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.