ఏక్ దమ్ ఏక్ దమ్ అంటున్న టైగర్..
మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్లో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ నుండి ది పెప్పీయెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్” ఏక్ దమ్ ఏక్ దమ్ “పాటను 5 భాషల్లో విడుదల చేశారు. మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ భారతదేశంలోని అతిపెద్ద గజదొంగగా భావించే టైగర్ నాగేశ్వరరావు జీవితకథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో అతని ప్రేయసి సారా పాత్రలో నుపుర్ సనన్ లుక్ ను ఇది వరకే మేకర్స్ రిలీజ్ చేయగా ఇప్పుడు సినిమాలోని ఫస్ట్ సింగల్ ని సౌత్ ఇండియా భాషలు నాలుగు, హిందీలో విడుదల చేయడం ద్వారా సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌స్ గ్రాండ్ గా ప్రారంభించారు.
రూ.40వేలకు మహిళ విక్రయం.. గదిలో బంధించి..!
రూ.40 వేలకు ఓ మహిళను విక్రయించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అస్సాంకు చెందిన 35 ఏళ్ల మహిళను ఝుంజునుకు చెందిన వ్యక్తికి అమ్మారు. మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం ఆమెను సూరజ్‌గఢ్‌కు తీసుకొచ్చి అక్కడ ఓ ఇంట్లో బందీగా ఉంచారని తెలిపింది. అంతేకాకుండా రాత్రి తనపై దాడి చేశారని.. ఆ తర్వాత ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నట్లు మహిళ పేర్కొంది. ప్రస్తుతం ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
చరిత్రలో ఇది సరికొత్త రికార్డు
ఆగస్టు నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 76.3 శాతం డెలివరీలు జరగటం గొప్ప విషయమని, చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో వైద్యారోగ్య శాఖ చేస్తున్న కృషి వల్ల 2014లో 30శాతంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు, రెట్టింపు కంటే ఎక్కువ జరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనం అన్నారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వైద్యారోగ్య శాఖ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అత్యధికంగా నారాయణ్ పేట్ 89శాతం, ములుగు 87శాతం, మెదక్ 86, భద్రాద్రి కొత్తగూడెం 84శాతం, వికారాబాద్ 83, గద్వాల్ 85శాతం డెలివరీలు చేసి మంచి పనితీరు కనబర్చాయని అభినందించారు. అతి తక్కువగా ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు అవుతున్న మంచిర్యాల (63), నిర్మల్ (66), మేడ్చల్, కరీంనగర్ (67) జిల్లాల్లో పనితీరు మెరుగుపడాలన్నారు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ స్కోర్ విషయంలో మొదటి స్థానాల్లో నిలిచిన మెదక్ (84.4), జోగులాంబ గద్వాల్ (83.9), వికారాబాద్ (81), ములుగు (79), నాగర్ కర్నూల్ (77) జిల్లాల వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. చివరి స్థానంలో ఉన్న జగిత్యాల, కుమ్రంభీం, నారాయణ్ పేట్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు.
మిస్ శెట్టి ప్రమోషన్స్ లోకి ప్రభాస్ ను లాగిన అనుష్క
ట్టకేలకు అనుష్క శెట్టి తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అసలు విషయం ఏమిటంటే అనుష్క శెట్టి హీరోయిన్ గా నవీన్ పోలిశెట్టి హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒక పెళ్లి కానీ అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని తనను తల్లయ్యేందుకు సహాయం చేయమని కోరినట్లుగా ట్రైలర్ లో చూపించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగబోతున్నట్లుగా చెబుతున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో అంటే ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఇప్పటివరకు అనుష్క శెట్టి ఈ సినిమా ప్రమోషన్స్ లో నేరుగా పాల్గొన్నది లేదు. నవీన్ పోలిశెట్టి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలియతిరిగారు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి సినిమా ఖచ్చితంగా చూసి తమను ఆశీర్వదించమని కోరాడు. తర్వాత మెగాస్టార్ చిరంజీవికి సినిమా చూపించడం ఆయన అద్భుతంగా ఉందని తన రివ్యూ ఇవ్వడం కూడా జరిగిపోయాయి.
తెలుగు భాష అంతరించిపోయే దశలో ఉంది
విజయవాడలో మాతృభాషా మహాసభకు పలు రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కాంగ్రెస్ మీడియా ఇంఛార్జ్ తులసీరెడ్డి, జనసేన అధికార ప్రతినిధి కందుల దుర్గేష్, మాజీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, సీపీఐ నాయకురాలు అక్కినేని వనజ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాతృ భాష మహాసభ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ దినోత్సవం రోజున మాతృభాషా సభ ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విసయం అన్నారు. తెలుగు భాష త్రిలింగం అనే పదం నుంచీ వచ్చింది.. దక్షిణ ఆసియాలో 24 ద్రవిడ భాషల్లో అత్యధిక మంది వాడే భాష తెలుగు.. అత్యంత సుందర లేఖనం కలిగిన భాష కూడా తెలుగేనంటు ఆమె పేర్కొన్నారు.
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
ప్రపంచంలోని అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్లలో ఒకటైన డీపీ వరల్డ్, తెలంగాణలో రూ.215 కోట్ల పెట్టుబడులు పెట్టి తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర ఈ విషయాన్ని మంగళవారం దుబాయ్‌లో గ్రూప్ ఇవిపి (కార్పొరేట్ ఫైనాన్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్) అనిల్ మోహతాతో సమావేశమైన తర్వాత ఈ ప్రకటన చేశారు. సంస్థ తన కార్యకలాపాలను విస్తరించడంతో పాటు రూ.165 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోను ఏర్పాటు చేయనుంది.
పెళ్లి కావడం లేదని శివలింగాన్ని దొంగలించిన ఓ వ్యక్తి
పెళ్లి కావడం లేదని రోజు పూజించే శివలింగాన్ని మాయం చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన యూపీలోని కౌశాంబి జిల్లాలో వెలుగు చూసింది. మహేవాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్హియావాన్ మార్కెట్‌లో నివాసం ఉంటున్న 27 ఏళ్ల చోటు.. శ్రావణ మాసం మొత్తం శివుడికి ప్రత్యేక పూజలు చేశాడు. అయితే తన పెళ్లి జరగాలని రోజు ప్రార్థించేవాడు. అయితే శ్రావణం అయిపోయింది. తన కోరిక నెరవేరలేదు. దీంతో మనస్తాపానికి గురైన చోటు శివలింగాన్ని మాయం చేశాడు. అయితే ఉదయాన్ని ఆలయానికి వచ్చిన కొందరు భక్తులు.. శివలింగం కనపడకపోవడంతో షాక్‌కు గురయ్యారు. దీంతో ఆలయ పూజారి వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే శివలింగాన్ని దొంగిలించడంలో చోటు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే శివలింగాన్ని దొంగిలించి ఆలయంలో ఒకచోట దాచినట్లు తెలిపాడు.
చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం.. తండ్రి బ్రోకర్.. కొడుకు జోకర్..
ఏపీలో రాజకీయం మంచి రంజూ మీద ఉంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా.. అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే, తాజాగా చంద్రబాబు నాయుడికి ఐటీ నోటీసులు ఇచ్చారనే వార్తలపై వైసీపీ పార్టీ నేతలు ఆయనను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. బాబు-కొడుకుల అరెస్ట్ ఎలా జరుగుతుందనే చర్చ ప్రస్తుతం జరుగుతోందన్నారు. తండ్రి బ్రోకర్.. కొడుకు జోకర్.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఐటీ శాఖ తేల్చేసింది అని మంత్రి కొట్టు పేర్కొన్నారు.
విజయ్ ఇచ్చే లక్ష కావాలంటే ఆ పని చేయాల్సిందే..
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. లైగర్ లాంటి డిజాస్టర్ హిట్ తరువాత విజయ్ ఖుషీతో హిట్ అందుకున్నాడు. ఇక ఈ సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకోవాలని సరికొత్తగా ఆలోచించాడు. ఇప్పటివరకు ఏ హీరో చేయని ఒక అరుదైన పనిని విజయ్ చేశాడు. ఖుషీకి వచ్చిన రెమ్యూనిరేషన్ లో ఒక కోటి రూపాయలను.. అభిమానుల్లోని 100 మంది ఫ్యామిలీస్ కు ఇస్తున్నా అని చెప్పి ఔరా అనిపించాడు. ఇప్పటివరకు ఒక హీరో.. ఇలా అభిమానులకు డబ్బులు ఇవ్వడం అనేది జరగలేదు. హా .. ఇవన్నీ ప్రమోషన్ స్టంట్ .. వేదిక మీద చెప్తారు.. ఆ తరువాత మర్చిపోతారు. కానీ, విజయ్ అలా కాదు. తాను చెప్పిన పని ఖచ్చితంగా చేస్తాడు.
పెంపుడు కుక్క కరిచి బాలుడు మృతి
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో పెంపుడు కుక్క కాటుకు గురై 14 ఏళ్ల బాలుడు మృత్యువాత చెందాడు. బాలుడి కుటుంబ సభ్యులు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా బాలుడు బతకలేదు. చివరికి తండ్రి ఒడిలో అంబులెన్స్‌లోనే బాలుడు ప్రాణాలు విడిచాడు. దీంతో తీవ్ర దు:ఖంతో బాలుడి తండ్రి.. తన కొడుకు చనిపోయాడంటూ కన్నీరుమున్నీరయ్యాడు. అభం శుభం తెలియని తన కొడుకు ఆ కుక్క బలితీసుకుందని.. దాన్ని పెంచుకునే ఇంటి యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
జై షా జర చూడు.. ఇప్పుడు ఇండియా కాదు.. భారత్
మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాజ్యాంగంలో అనేక మార్పులు చేసిన కేంద్ర సర్కార్.. ఇప్పుడు ఇండియా పేరునే మార్చేసే దిశగా అడుగులు వేస్తుంది. త్వరలోనే ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే జీ-7 సమ్మిట్ లో భారత్ అని ముద్రించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు కూటమి ఏర్పాటు చేశాయి. ఆ కూటమి కి ఇండియా పేరును ఫైనల్ చేశారు.
బ్రేకింగ్.. ప్రభాస్ తో దానికి ఓకే చెప్పిన అనుష్క
లేడీ సూపర్ స్టార్ అనుష్క చాలా గ్యాప్ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మించింది. ఇక ఈ చిత్రంలో జాతి రత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఇప్పటికే ప్రమోషన్స్ బాధ్యత మొత్తం నవీన్ పోలిశెట్టి తన భుజస్కందాలపై వేసుకొని మోస్తున్నాడు. అనుష్క ప్రమోషన్స్ కి రాను అని చెప్పడంతో అన్ని తానే అయ్యి చూసుకుంటున్నాడు. కాకపోతే అనుష్క ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వనుందని ముందు నుంచే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ ఇంటర్వ్యూ షూట్ జరిగిందని తెలుస్తుంది. ఇక ఇందులో ఆమె అనేక ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. ఆమె పెళ్లి గురించి, సినిమాల గురించి, ప్రభాస్ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంది.