భయంకరమైన యాక్సిడెంట్.. చూసి షాకవుతారు
మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబయిలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో వైరల్ అయిన వీడియో. అక్కడ రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 49 ఏళ్ల వైద్యుడు మృతి చెందాడు. ప్రమాద ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. జూన్ 3వ తేదీ ఉదయం 6:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. బద్వార్ పార్క్ దగ్గర అప్పటికే ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి మరో బస్సు ఢీకొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బస్సును ఢీకొట్టిన తర్వాత, అది బస్సును చాలా మీటర్ల వరకు ముందుకి లాగుతుంది. ఈ ఘటనలో డాక్టర్ బలరామ్ భాగ్వే వెనుక బస్సు చక్రాల కింద పడ్డాడు. వీరిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. కొద్దిసేపటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన ఈ బాధాకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోడు రైతులకు పట్టాలు లేవు.. విద్య, వైద్యం ఉచితంగా అందట్లేదు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ జనసమితి 3వ ప్లీనరీ సమావేశంలో టీజేఎస్ చైర్మన్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండ రామ్ మాట్లాడుతూ.. తమ ఆర్థిక రాజకీయ స్వలాభాల కోసమే తెలంగాణ రాష్ట్రంలో సీఎం విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండానే సొంత ఎజెండాను అమలుపరుస్తున్నదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ పదాన్ని వదిలి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మరచి బీఆర్ఎస్ తో దేశ రాజకీయాలలో వెళ్లడం సరికాదని ఆయన హితవు పలికారు. దేశంలోనే అత్యధిక అప్పు ఉన్న రైతుగా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
జిమ్ లో తెగ కష్టపడుతున్న సమంత..!!
సమంత తన నటనతో అందరిని మెప్పించి తెలుగు లో టాప్ హీరోయిన్ అయింది.ఇక తన కెరియర్ లో చాలా హిట్ మూవీస్ లో నటించి మెప్పించింది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో నార్త్ ఇండియా లో కూడా తన ప్రతిభని చాటింది.. అందుకే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న సిటడెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని హిందీ ఇండస్ట్రీ కూడా ఎంతో ఆత్రుత గా ఎదురు చూస్తుంది.ఇంతటి పాపులారిటీ సమంత కు అంత ఈజీగా అయితే ఏం రాలేదు మరి. ప్రతి పాత్ర కోసం సమంత ఎంతో కష్టపడింది. ముఖ్యంగా తన అందం కోసం అలాగే ఫిట్ నెస్ కోసం సమంత ఎంత కష్టపడుతుందో అందరికీ తెలిసిందే.ముఖ్యంగా ఫిట్ గా ఉంటడానికి సమంత ఎంతో కష్టపడుతుంది. క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ ఫిట్ నెస్ ను కాపాడుకుంటుంది. అయితే సాధారణంగా హీరోయిన్లంతా నార్మల్ గా కార్డియో లాంటి కసరత్తులను చేస్తే సమంత మాత్రం వెయిట్ లిఫ్టింగ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ను ఇస్తుంది. అలా వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల బాడీకి స్టామినా వస్తుందని చెప్తుంది ఈ బ్యూటీ. ఇప్పటికే పలుమార్లు జిమ్ లో వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఫొటోలు పోస్టు చేసిన విషయం తెలిసిందే.
రైలు ప్రమాదంలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు ఉచితంగా విద్య..
ఒడిశా బాలాసోర్ రైల్ దుర్ఘటన వందల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను తీసుకుంది. 288 మంది ప్రయాణికులు మరణించారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్లో ఉన్న గూడ్స్ రైలుని ఢీకొట్టడంతో పక్కనే ఉన్న పట్టాలపై బోగీలు పడిపోయాయి. అదే సమయంలో ఆ ట్రాక్ పై వస్తున్న యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ మళ్లీ ఈ బోగీలను ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తి విచారణ తర్వాతే ప్రమాదానికి కారణాలు తెలియరానున్నాయి. మూడు దశాబ్ధాల్లో అత్యంత ఘోరమైన ప్రమాదంగా బాలాసోర్ ట్రైన్ దుర్ఘటన చరిత్రలో నిలిచింది.
ఢిల్లీ జంట హత్యల కేసులో పురోగతి.. మిలియనీర్ కావాలనే హత్యలు
దేశ రాజధాని ఢిల్లీలోని కృష్ణానగర్‌లో జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు పెద్ద విజయం సాధించారు. ఈ కేసులో కంప్యూటర్ టీచర్, మ్యూజిక్ కంపోజర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘Operation Malamaal’ కింద ఈ జంట హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో లక్షలు దోచుకోవాలనే ఉద్దేశంతో కృష్ణానగర్‌లో వృద్ధులైన తల్లి, కూతుళ్లను జంట హత్యలు చేశారు. మొత్తం విషయాన్ని బయటపెట్టిన పోలీసులు.. నిందితుల్లో ఒకరైన కిషన్ సింగ్ (28) మృతి చెందిన బాలికకు కంప్యూటర్ క్లాసులు చెప్పేవాడని తెలిపారు. దీంతో పాటు మరో నిందితుడి పేరు అంకిత్ కుమార్ (30). కంప్యూటర్ టీచర్ కిషన్ తనతో హత్య చేయించాలని పిలిచాడు.
అంకిత్ కుమార్ ఓ వెబ్ సిరీస్‌లో పాట కూడా పాడాడని రెండో నిందితుడి గురించి పోలీసులు తెలిపారు. భోజ్‌పురి చిత్రాల్లో పాటలు పాడడమే కాకుండా సంగీత స్వరకర్త కూడా. గత నెల మే 31న ఢిల్లీలోని కృష్ణానగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో జరిగిన జంట హత్యల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ జంట హత్యలో 76 ఏళ్ల రాజ్‌రాణి, 39 ఏళ్ల ఆమె కూతురు గిన్ని కరార్ హత్యకు గురయ్యారు.
బికినీతో బీచ్ ఒడ్డున సన్నీలియోనీ.. మమ్ముల్ని పిలవొచ్చుగా అన్న నెటిజన్
సన్నీ లియోన్ చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ లో సన్నీలియోన్ కూడా పాల్గొంది. కొన్ని రోజుల క్రితం సన్నీ లియోన్ ఒక పెద్ద ప్రకటన చేసింది. తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు షోలో పాల్గొనడానికి నిరాకరించానని తెలిపింది. అయినా వరుసగా బిగ్ బాస్ మేకర్స్ తనకు ఫోను చేస్తూనే ఉన్నారట. చివరగా ఈ షోకి ఎలాగొలా ఒప్పించారట తెలిపాను. అలాగే సినిమాల్లో నటించేందుకు మొదట్లో భారతదేశానికి రావాలని అనుకోలేదట, ఎందుకంటే భారతదేశంలోని ప్రజలు తనను అసహ్యించుకున్నారని ఆవేదన చెందిందట. దాని గురించి తన భర్తతో కూడా మాట్లాడిందట.
ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ..
మూడు దశాబ్ధాల కాలంలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా మిగిలిన ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటనపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ఘటనలో విద్రోహ కోణం ఏమైనా ఉందా..? లేకపోతే సాంకేతిక లోపమా..? అనే అంశాలపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విపక్షాలు ఈ రైలు ప్రమాదంపై సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రైల్వే బోర్డు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో విచారణ చేయించాలని కోరింది. ప్రస్తుతం రెస్క్యూ పూర్తయిందని, పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, ట్రాక్ కు సంబంధించిన పనులు పూర్తికాగా.. ఓవర్ హెడ్ వైరింగ్ పనులు కొనసాగుతున్నాయని, గాయపడిన ప్రయాణికులు చికిత్స పొందుతున్నారని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
తెలంగాణకు 4 రోజులు వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈరోజు తెల్లవారుజాము వరకు భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాద్ వాసులకు, రాష్ట్ర ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ప్రమాద సమయంలో రెండు రైళ్ల వేగం గంటకు 100 కి.మీ కంటే ఎక్కువ
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ కారణమని ఆరోపిస్తున్నారు. ఆదివారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఘటనపై దర్యాప్తు పూర్తయిందని తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ కారణంగా ప్రమాదం జరిగిందని, దీనికి సంబంధించి సేఫ్టీ కమిషనర్ త్వరలో విచారణ నివేదికను సమర్పించనున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రెండు ప్యాసింజర్ రైళ్ల వేగం గురించి కూడా సమాచారం అందింది. రైలు పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద సమయంలో గంటకు 128 కిలోమీటర్ల వేగంతో నడుస్తోందని రైల్వే బోర్డు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పట్టాలు తప్పిన ప్రదేశంలో లూప్‌లైన్‌లో గూడ్స్ రైలు నిలబడి ఉంది. పట్టాలు తప్పిన తర్వాత కోరమాండల్ గూడ్స్ రైలును ఢీకొట్టింది.
సమిష్టి కృషితోనే అద్భుత పురోగతి సాధించాం
నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. మొదట కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్ సీటులో వరుణ్ రెడ్డిని కూర్చండబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్ వద్ద పోలీస్ సిబ్బంది ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు 25 కోట్లు చొప్పున కేటాయిస్తున్నామన్నారు. పది పరిక్ష ఫలితాల్లో రాష్ట్రం లోనే నిర్మల్ టాప్ రావడం గర్వకారణమన్నారు సీఎం కేసీఆర్. ధరణిని తీసి బంగాళాఖాతంలో కలుపుతా అని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారని, రైతు బంధు, బీమా ఎలా వస్తుందన్నారు సీఎం కేసీఆర్. ధరణి ని బంగళాఖాతంలో కలుపు తామన్న వారినే బంగాళాఖాతంలో కలపాలన్నారు. ధరణి తీసి వేస్తే ఇవ్వన్నీ ఎలా వస్తాయని, మంచి నీళ్ళు పోయని నాటి దుర్మార్గుల పాలన మళ్లీ కావాలా అని ఆయన అన్నారు. ఏడాదికి 12 వేల కోట్లు ఖర్చు చేసి ఫ్రి కరెంట్ ఇస్తున్నామన్నారు. దళిత బంధు కు రామ్ రామ్ అనే వాళ్ల పాలన కావాలా అని ఆయన అన్నారు.
టెక్నాలజీ వాడకం వల్ల దేశంలో తెలంగాణ పోలీస్ అగ్రస్థానంలో ఉంది
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవం పోలీస్ ఎక్స్పో నిర్వహించారు. సైఫాబాద్ లోని కొత్త డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద సిటీ పోలీస్ శాఖా నేతృత్వంలో పలు సాంకేతిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, డిజిపి అంజనీ కుమార్‌లు పాల్గొన్నారు. వివిధ విభాగాల టెక్నాలజీ డిస్‌ప్లే, బ్యాండ్, డాగ్ స్క్వాడ్ డిస్‌ప్లే, ఫోరెన్సిక్ సైన్స్, ఫోటో ఎగ్జిబిషన్, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో, క్రావ్ మాగా, బాంబ్ డిస్పోజల్ డ్రిల్, వివిధ కమ్యూనికేషన్ పరికరాలు, ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ డెమో, మై నేషన్ స్టాల్స్, సైబర్ సెక్యూరిటీ, నార్కోటిక్ బ్యూరో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఇంజనీర్స్, సైంటిస్ట్ ఉన్నారని ఆయన అన్నారు.