“ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్”.. బడ్జెట్ తర్వాత నిర్మలా సీతారామన్ తొలి ఇంటర్వ్యూ
పార్లమెంట్ లో ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె బడ్జెట్ తర్వాత ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన మొదటి ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ప్రజల కోసం, ప్రజల చేత తీసుకొచ్చిన బడ్జెట్ అన్నారు. అలాగే, నేను ఎక్కడికి వెళ్లినా వినిపించే పదం పన్ను చెల్లింపుల గురించి.. మేం నిజాయితీగా ట్యాక్స్ కడుతున్నాం.. నిజాయితీగా ఉంటూ దేశానికి సేవ చేస్తున్నాం.. మీరు మా కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ అంశంపై ప్రధాని మోడీతో చర్చించిన తర్వాత ఆయన మార్గ నిర్థేశంతో ముందుకు సాగినట్లు చెప్పుకొచ్చింది. అందుకే, ఈ బడ్జెట్‌లో వేతన జీవులకు బిగ్ రిలీఫ్ కల్పిస్తూ పన్ను తగ్గింపు ఆలోచన వెనక ప్రధాని మోడీ ఉన్నారని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
బత్తుల ప్రభాకర్ 2013 నుంచి నేరాలు చేస్తున్నాడు
గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బులో చోటు చేసుకున్న కాల్పుల ఘటన వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. నిన్న రాత్రి ఏడున్నర గంటల సమయంలో ప్రిజం పబ్బుల్లో మోస్ట్ వాంటెడ్ బత్తుల ప్రభాకర్ ఉన్నాడు అని సమాచారం అందిందన్నారు. నేరస్తుడిని పట్టుకునే క్రమంలో అతను పోలీసులపై కాల్పులు జరిపాడని, దీంతో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి కాలికి బుల్లెట్ గాయం అయిందన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రెండు తుపాకులు సీజ్ చేశామని, 23 రౌండ్లు బుల్లెట్స్ సీజ్ చేశామన్నారు. బత్తుల ప్రభాకర్ ను విచారించామని, అతను ఇచ్చిన సమాచారం మేరకు ఇంట్లో తనిఖీలు చేశామని ఆయన పేర్కొన్నారు. 451 లైవ్ బుల్లెట్లు రౌండ్లు దొరికాయన్నారు. ప్రభాకర్ చిత్తూరు జిల్లాకు చెందిన వాడని, 2013 నుండి నేరాలు మొదలు పెట్టాడు. సోలో గా దొంగతనాలు చేస్తున్నాడన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80 కేసులో నిందితుడు ..23 కేసులో వాంటెడ్ గా ఉన్నాడని, తెలంగాణలో 11 కేసులో, ఆంధ్ర ప్రదేశ్ లో 12 కేసుల్లో నిందితుడు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణలో నేరాలకు పాల్పడ్డాడని, 2022 లో జైలు నుండి పారిపోయాడు..అప్పటి నుండి ఏపి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడని డీసీపీ వినీత్ తెలిపారు. ఇళ్ళల్లో చోరీ చేయడం రిస్క్ అని శివార్లలో ఉండే విద్యాలయాల్లో చోరీలు చేస్తున్నాడని, దొంగతనం చేసే ముందు రెక్కి చేస్తాడు.. అరిలోవా పోలీస్ కస్టడీ అని, యుట్యూబ్ పోలీసులకు చిక్కకుండా. ఎలా తప్పించుకోవాలి అని వీడియోలు చూస్తాడన్నారు.
బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం.. గూండాయిజం చేస్తోందని ఆరోపణలు!
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఢిల్లీలో పాలిటిక్స్ వేడెక్కాయి. దీంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ భారతీయ జనతా పార్టీ రౌడీయిజం చేస్తుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి ఆప్ విజయం సాధిస్తుందన్నారు. ఇది బీజేపీ నాయకులకు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నచ్చడం లేదు.. అందుకే మాపై దాడులకు, బెదిరింపులకు దిగుతున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఆర్థికంగా ఎంత బలోపేతంగా దేశం ఉందనేందుకు ఇదే నిదర్శనం
కరోనా లాంటి గడ్డు పరిస్థితి నుంచి కఠిన నిర్ణయాలు తీసుకుని ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోడీ గాడిలో పెట్టారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 2014లో 2 లక్షలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటే ఇప్పుడు ఏకంగా 12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చారన్నారు. ఇదొక మైల్ స్టోన్ అని, దశాబ్ద కాలంలో ప్రధాని మోడీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఆర్థికంగా ఎంత బలోపేతంగా దేశం ఉందనేందుకు ఇదే నిదర్శనమని, మధ్య తరగతి ప్రజలతో దేశ ఆర్థిక ప్రగతి సాధ్యమని భావించి మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రాల హక్కులకు ప్రాధాన్యం కల్పిస్తూనే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, సామాన్యుడు కూడా నాణ్యమైన విద్య, వైద్యం అందుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దారన్నారు ఎంపీ కె.లక్ష్మణ్.
మీరు ఏమైనా రామరాజ్యాన్ని నడిపారా.. రావణ రాజ్యాన్ని నడిపారు!
చిత్తూరు జిల్లా పుంగనూర్ నియోజకవర్గంలో జనంలోకి జనసేన బహిరంగ షభలో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఆరు నెలలు అయ్యింది కూటమీ ప్రభుత్వం వచ్చి.. అప్పుడే పథకాలు రాలేదంటూ మాట్లాడుతూ వైసీపీ గూండాలకు, కుక్కలకు, సన్యాసులకు బుద్దుండాలని విమర్శించారు. రూ 4 వేల పింఛన్, దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రోడ్లు వేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశాం.. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం.. 48 గంటలకు రైతులకు డబ్బులను అకౌంట్స్ లో వేస్తున్నాం.. విశాఖ ఉక్కుకు నిధులు వచ్చాయి.. గంజాయి డ్రస్ పై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశాంం.. అన్నా క్యాంటిన్లు తిరిగి ప్రారంభించాం.. ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తూ వస్తున్నామని నాగబాబు తెలిపారు.
మూసీ నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. 37.50కోట్లు విడుదల
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వేగంగా అమలవుతోంది. ఈ ప్రాజెక్ట్ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు మూసీ నిర్వాసితుల పునరావాసం, ఆర్థిక సహాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కు పురపాలక శాఖ రూ. 37.50 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం ఇప్పటికే నదిగర్భంలో నివసిస్తున్న కుటుంబాలకు తాత్కాలిక ఖర్చుల నిమిత్తం రూ. 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మేరకు 15,000 కుటుంబాలకు నగదు పంపిణీ కొనసాగుతోంది. అలాగే, ఇళ్లను ఖాళీ చేసే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
ప్రాజెక్టు కింద, మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న నిర్వాసితులకు రెండు పడక గదుల ఇళ్లు (Double Bedroom Houses) కేటాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా ప్రకటించింది. ఇందులో భాగంగా, ఇప్పటికే కొంతమంది నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించామని పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి ఎం. దానకిశోర్ వెల్లడించారు. గతంలో జీవో (Government Order) ద్వారా 16,000 ఇళ్లను నిర్వాసితులకు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
‘అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాల ఎన్‌సైక్లోపీడియా’: జేపీ నడ్డా
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. దీంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ఒక్కసారి అవకాశమివ్వండి అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ప్రచారంతో హోరెత్తిస్తుంది. ఇక, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న ఎన్నికల్లో విజయం మాదే అని ధీమా వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ పాలనపై ప్రజలు భ్రమపడ్డారు, ఇప్పుడుఆ భ్రమలు వీడి వాస్తవంలోకి వచ్చిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టడానికి ఢిల్లీ వాసులు నిర్ణయించుకున్నారు. కేజ్రీవాల్ అవినీతి, పాలనా రాహిత్యంతో హస్తినా ప్రజలు విసిగిపోయారు.. ఇప్పుడు దేశ రాజధానికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని జేపీ నడ్డా పేర్కొన్నారు.
ఢిల్లీ అభివృద్ధి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి..
ఢిల్లీలో ఈనెల 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అందుకోసం బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లారు. షాధ్రాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చంద్రబాబు. ఆయనతో పాటు కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఢిల్లీలో ఇంత మంది తెలుగు వాళ్ళు ఉంటారనుకోలేదని అన్నారు. ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం బీజేపీకే ఓటు వేయాలని తెలిపారు. ఢిల్లీలోనే కాదు విదేశాల్లోనూ తెలుగు వాళ్ళు ఉన్నారు.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మోడీ నాయకత్వం గొప్పగా ఉందంటున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే రాష్ట్రానికి ప్రయోజనాలు..
డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్, జలజీవన్ మిషన్ పొడిగింపు వంటి ప్రయోజనాలు రాష్ట్రానికి కలిగాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2019కి ముందు పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడూ లేని ఫేజ్-1, ఫేజ్-2లను తీసుకొచ్చి జగన్ తీవ్రమైన తప్పిదం చేశాడని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ చరిత్రలో 41.15 మీటర్లు, 45.72 మీటర్లు అంటూ రెండు ఫేజ్‌లను కేంద్రానికి పంపి జగన్ చేసిన పాపం నేడు రాష్ట్రానికి శాపంగా మారిందని దుయ్యబట్టారు. చంద్రబాబు హయంలో 18 నెలలు శ్రమించి పూర్తిచేసిన డయాఫ్రమ్ వాల్‌ను ధ్వంసం చేసిన జగన్.. చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కౌంటర్..
వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన పై ఆరోపణలు చేయడం తగదని అన్నారు. సాఫ్ట్‌వేర్‌ను, ఐటీని తాను కనిపెట్టినట్లు చంద్రబాబు మాట్లాడలేదు.. చంద్రబాబు చెప్పింది ఒకటే హైదరాబాదులో ఆ రోజు ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చేదానికి నేను బిల్ గేట్స్‌ను ఒప్పించి ఐటీ మిలీనియం బ్లాక్ పెట్టించింది నేనే అని చెప్పారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత వందలాది కంపెనీలు ఒక్కదానికొకటి హైదరాబాదుకు రావడం జరిగిందన్నారు. తాను ఐటీని సృష్టించాను.. తయారు చేశాను అని ఎక్కడా కూడా చంద్రబాబు చెప్పలేదని మంత్రి పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై కామెంట్ చేసేటప్పుడు తెలుసుకొని కామెంట్స్ చేయాలని సూచించారు.