Gadikota Srikanth Reddy: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారం ఆరోపణలు చేయడం, ప్రజల్లో ద్వేషాలు రేపేలా మాట్లాడడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. రాయచోటి అభివృద్ధి గురించి చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు అధికారులతో కలిసి రండి. నేను ఒక్కడినే వస్తా.. గత ఐదు సంవత్సరాల్లో ఏం చేశానో చూపిస్తా, అని…
Gadikota Srikanth Reddy: సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధం అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా ఉన్నదే చంద్రబాబు.. ప్రజలను మభ్యపెడుతూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
Gadikota Srikanth Reddy: రాయచోటి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిపై మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు. ఆయన తాజాగా ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఓట్ల గణాంకాలను వివరంగా వెల్లడించారు. ఇక ఆయన తెలిపిన సమాచారం మేరకు 2012 ఉప ఎన్నిక, 2014, 2019, 2024 ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో పోలైన ఓట్లపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో…
Gadikota Srikanth Reddy: చంద్రబాబు పదహారేళ్ళ పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చారా అని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ హయంలోనే ఫ్యాక్షన్ క్రియేట్ చేశారు.. రాయలసీమలో వైఎస్ఆర్ ఫ్యాక్షన్ అరికట్టేందుకు కొత్త నేతలను తీసుకు వచ్చారు.. మీ దుష్ట శక్తుల సాయంతో జగన్ ను ఓడించినంత మాత్రాన మీరు సాధించింది ఏమీ లేదు.
వైఎస్ జగన్ ను లేకుండా చేయాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి.. దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత జగన్.. కానీ, జగన్ పర్యటనల్లో భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. గతంలో రెండుసార్లు జగన్ పై దాడులు జరిగాయి.. పాదయాత్ర సమయంలో అనేక అడ్డంకులు సృష్టించారు.. జెడ్ ప్లస్ రక్షణలో ఉన్న జగన్‌కు పర్యటన సమయంలో కనీస భద్రత కల్పించకపోవటం దారుణం అన్నారు..
“ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్”.. బడ్జెట్ తర్వాత నిర్మలా సీతారామన్ తొలి ఇంటర్వ్యూ పార్లమెంట్ లో ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె బడ్జెట్ తర్వాత ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన మొదటి ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ప్రజల కోసం, ప్రజల చేత తీసుకొచ్చిన బడ్జెట్ అన్నారు. అలాగే, నేను ఎక్కడికి వెళ్లినా వినిపించే పదం పన్ను చెల్లింపుల గురించి.. మేం…
వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన పై ఆరోపణలు చేయడం తగదని అన్నారు.
సీఎం చంద్రబాబు రాయచోటి పర్యటనపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి పర్యటన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు నిరాశ మిగిల్చిందని ఆరోపించారు.
సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటనతో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా..? అని ప్రశ్నించారు.