ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తెలుగు కుర్రాడు.. అరంగేట్రంలోనే దిగ్గజ ఆటగాడితో ఢీ!
టెన్నిస్ క్యాలెండర్‌లోని మొదటి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్ 2025 షెడ్యూల్ గురువారం విడులైంది. జనవరి 12 నుంచి 26 వరకు టోర్నీ సాగనుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తెలుగు మూలాలున్న అమెరికా కుర్రాడు నిశేష్ బసవారెడ్డి బరిలోకి దిగుతున్నాడు. గ్రాండ్‌స్లామ్ అరంగేట్రంలోనే దిగ్గజ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌తో పోటీపడబోతున్నాడు. 19 ఏళ్ల నిశేష్ వైల్డ్ కార్డుతో గ్రాండ్‌స్లామ్ అరంగేట్రం చేయనున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను రికార్డు స్థాయిలో 10 సార్లు గెల్చుకున్న జొకో ముందు బసవారెడ్డి ఎలా నిలబడనున్నాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిశేష్ బసవారెడ్డి తల్లిదండ్రులు మురళీకృష్ణ, సాయిప్రసన్నలది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా. 1999లో మురళీకృష్ణ అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలో జన్మించిన నిశేష్‌కు టెన్నిస్ అంటే చిన్నప్ప్పటి నుంచి ఇష్టం. తల్లిదండ్రులు కూడా అతడిని ప్రోత్సహించారు. అమెరికా స్టార్ ఆటగాడు రాజీవ్ రామ్, కోచ్ బ్రయాన్ స్మిత్ మార్గనిర్దేశనంలో నిశేష్ ఆటపై మంచి పట్టు సాధించాడు. సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లోనూ నిశేష్ సత్తా చాటుతున్నాడు. 2022లో ఒజాన్ బారిస్‌తో కలిసి యుఎస్ ఓపెన్ బాలుర డబుల్స్ టైటిల్‌ను సాధించాడు.
కోడలిని చంపి పూడ్చేసిన అత్తామామలు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?
అత్తామామలు మద్యం మత్తులో కోడలిని హత్యచేశారు. ఈ దారుణమైన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి వద్ద చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… శంషాబాద్ మండలం రామాపురం తండాకు చెందిన ముడావత్ దోలిని అదే తండాకు చెందిన ముడావత్ సురేష్ కు15 సంవత్సరాల క్రితం వివాహం అయింది. గత కొన్ని రోజులుగా భార్య భర్తల మద్య గొడవల కారణంగా అత్త తుల్శీ, మామ అనంతి సాతంరాయిలో ఉంటూ కూలీ పనులు చేస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం సురేష్ దోలి భార్యాభర్తలు గ్యాస్ స్టవ్ రిపేయిర్ కోసం శంషాబాద్ వచ్చారు.
నేడు హష్ మనీ కేసులో ట్రంప్‌కు కోర్టు శిక్ష విధించే ఛాన్స్..
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి భారీ షాక్ తగిలింది. హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఈరోజు (జనవరి 10) శిక్ష విధిస్తామని ఇప్పటికే న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్ మెర్చాన్ స్పష్టం చేశారు. అయితే, నూతన అధ్యక్షుడికి జైలు శిక్ష విధించే ఛాన్స్ మాత్రం లేదని పేర్కొన్నారు. శిక్ష విధించినా తన అధికారాన్ని, అధ్యక్షుడిగా తన బాధ్యతను నిర్వర్తించే విధంగానే ఉండబోతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు శిక్ష విధిస్తానంటూ న్యూయార్క్ న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాలను అడ్డుకోవాలంటూ కోరారు. అయితే, అమెరికాకు కాబోయే అధ్యక్షుడి పిటిషన్ ను తిరస్కరించింది.
ఘోరం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. నలుగురు మృతి
సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులున్నారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం.. నుజ్జును నుజ్జైంది. తెల్లవారు జామున 3.30 – 4.00 గంటల మధ్యలో జరిగిన దుర్ఘటన జరిగింది. విషయం తెలిసిన వెంటనే సూర్యాపేట డీఎస్పీ, రూరల్ సీఐ, చివ్వేంల ఎస్ఐ, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లారీ టైర్
పేలడంతో పక్కకు ఆపినట్లు డ్రైవర్ తెలిపాడు.
నేడు జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై విస్తృత చర్చ జరగనుంది. ముఖ్యంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే అభివృద్ధి కార్యక్రమాల అమలుపై వివరాలు పరిశీలించనున్నారు. తాజాగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు దృష్ట్యా, ప్రభుత్వ పథకాల ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఇప్పటికే సూచించారు. ఈ క్రమంలో, రేపు జరగబోయే సమావేశంలో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు పద్ధతులు, ఇంకా చేపట్టవలసిన చర్యల గురించి కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు.
గుడ్‌న్యూస్.. బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక..
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్-2017 లో సవరణలు చేస్తూ వేరు వేరుగా జీవోలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీలక సంస్కరణలతో ఉత్తర్వులు జారీ చేశామన్నారు. సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు మారుస్తూ జీవో తెచ్చినట్లు తెలిపారు.
ఆర్‌జీ కార్ ఆస్పత్రి ఘటన నిందితుడికి ఉరిశిక్ష..?
పశ్చిమ బెంగాల్ ఆర్జీ కార్ హస్పటల్ ఘటనలో కీలక పరిణామం నెలకొంది. ట్రైనీ డాక్టర్ ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ దర్యాప్తు ముగిసింది. దీంతో కేసు విచారణ సమయంలో సేకరించిన కీలక ఆధారాల్ని ఇప్పటికే అందజేసింది. ఈ నేపథ్యంలో నిందితుడు సంజయ్ కు మరణ శిక్షను విధించే సాక్ష్యాలను సీబీఐ గురువారం నాడు సీల్దా సెషన్స్ న్యాయస్థానానికి అందించింది. ఈ కేసులో జనవరి 18వ తేదీన కోర్టు తీర్పును వెల్లడించనుంది. అయితే, తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ తరపున లాయర్లు వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపారు. దానికి బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే ఇందుకు సాక్ష్యం అని వెల్లడించారు.
భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు.. గోవింద నామస్మరణలతో మార్మోగుతున్న ఆలయాలు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ ఇదివరకెన్నడూ లేని విధంగా పెరిగింది. అనేక భక్తులు వైకుంఠ ద్వారదర్శనానికి టోకెన్ తీసుకున్నా నేపథ్యంలో..
వారిని వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతించారు. పదిరోజుల పాటు సాగనున్న వైకుంఠ దర్వానాల కోసం వేలాదిగా భక్తులు తిరుమల కొండపైకి వస్తున్నారు, ఈ సందర్భంగా తిరుమల కొండలు గోవింద నామస్మరణలతో మార్మోగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మలయప్ప స్వామి స్వర్ణరథంపై దర్శనమిస్తారని సమాచారం.
వైకుంఠ ఏకాదశి సందర్భమంటే, అన్ని దేవాలయాలు చాలా అందంగా ముస్తాబు అవుతున్నాయి. ప్రఖ్యాత వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం తెరుచుకొని, భక్తులు వేగంగా దేవాలయానికి వెళ్లేందుకు క్యూ కట్టుతున్నారు. తెల్లవారుజామున నుంచే భక్తులు ఈ దివ్య దర్శనాన్ని పొందేందుకు ఆసక్తిగా ఉన్నారు. శ్రీమన్నారాయణుడిని దర్శించుకునేందుకు వేకువజామున నుండే భక్తులు అనేక సంఖ్యలో గల బారులు తీరి ఉన్నారు. కాగా భద్రాచలం ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు, అక్కడ ఉత్తర ద్వారము ద్వారా శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనమిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్టనర్ ఎవరంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శంకర్ చేస్తున్న మొదటి తెలుగు సినిమా కావడం, దిల్ రాజు నిర్మిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా రావడంతో ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా గమించాయి. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద ఆసక్తి పెంచడంతో సినిమా ఎలా ఉంటుందో అని మెగా ఫాన్స్ తో పాటు సినీ ప్రేమికులు కూడా ఎదురుచూస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది.