రిలయన్స్ రిటైల్‌లో వాటాను కొనుగోలు చేయనున్న అబుదాబి కంపెనీ.. రూ. 4966 కోట్ల డీల్
అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి(ADIA) చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) రూ.4,966.80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ డీల్‌లో అబుదాబి కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో 0.59 శాతం ఈక్విటీని కొనుగోలు చేస్తుంది. ఈ పెట్టుబడి RRVL ప్రీ-మనీ ఈక్విటీ విలువలో చేయబడుతుంది. ఇది రూ. 8.381 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. దేశంలో ఈక్విటీ విలువ పరంగా మొదటి నాలుగు కంపెనీల్లో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ చేరడం గమనార్హం.
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద నిర్వహించబడుతున్న రిలయన్స్ రిటైల్‌కు ఇషా అంబానీ అధిపతిగా ఉన్నారు. రిలయన్స్ రిటైల్ గత కొన్ని సంవత్సరాలుగా తన వ్యాపారాన్ని వేగంగా విస్తరించింది. RRVL దాని అనుబంధ సంస్థలు, అసోసియేట్‌ల ద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న, అత్యంత లాభదాయకమైన రిటైల్ వ్యాపారాలలో ఒకటిగా పనిచేస్తుంది. రిలయన్స్ రిటైల్ కంపెనీకి 18,500 కంటే ఎక్కువ స్టోర్లు ఉన్నాయి.
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంత ఉందంటే?
మహిళలకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలకు రెక్కలోచ్చాయి.. గత రెండు మూడు రోజులుగా తగ్గిన ధరలు నేడు మార్కెట్ లో పుంజుకున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక వెండి ధరలు మాత్రం దిగొచ్చాయని తెలుస్తుంది..వారం రోజులుగా వరుసగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఇవాళ అంతర్జాతీయంగానూ బంగారం రేటు మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది.. శనివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 100 పెరగగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 70 పెరిగింది. దీంతో దేశంలో శనివారం 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 52,500కి చేరుకోగా 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 57,230 వద్ద కొనసాగుతోంది. ఇక శనివారం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
సిక్కింలో మూడు జిల్లాలకు అలర్ట్.. షాకో చో సరస్సు ఎప్పుడైనా తెగిపోవచ్చు
సిక్కిం రాష్ట్రానికి దెబ్బమీద దెబ్బ తగులుతూ ఉన్నాయి. వరదలతో రాష్ట్రం ఇప్పటికే అతలాకుతంల అవుతోంది. ఈ సమయంలోనే మరో విపత్తు పొంచి ఉంది. ఈ ప్రాంతంలో మరొక సరస్సు తెగిపోయే ప్రమాదం పొంచి ఉంది. లొనాక్ సరస్సు తెగిపోవడం వల్ల కలిగే పరిణామాలు ఊహకు అందని విధంగా ఉన్నాయి. సిక్కిం చుట్టుపక్కల విధ్వంసకర దృశ్యం కనిపిస్తోంది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందలాది మంది గల్లంతయ్యారు. ఇప్పుడు మంగన్ జిల్లాలో షాకో చో సరస్సు పగిలిపోతుందనే భయం నెలకొంది. ఈ మేరకు అలర్ట్ కూడా జారీ చేశారు.
సిక్కిం మరోసారి తీవ్ర విధ్వంసం ఎదుర్కొనే అవకాశం ఉంది. మంగన్ జిల్లాలోని లాచెన్ సమీపంలోని లోనక్ సరస్సు, షాకో చో సరస్సు కూడా పగిలిపోయే ప్రమాదం ఉన్నందున ఆ ప్రాంతంలో వరదలు మళ్లీ విధ్వంసం సృష్టించగలవు. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని సరస్సు సమీపంలోని ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తున్నారు. ఈ సరస్సు తంగు గ్రామం పైన ఉంది. ఇక్కడికి వెళ్లాల్సిన రోడ్డు వరదలో కొట్టుకుపోయింది.
నేడు ఢిల్లీ వెళ్లనున్న నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. 20 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన లోకేష్ గత రెండు రోజుల క్రితం ఏపీ వచ్చారు. అయితే.. నిన్న రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయిన లోకేష్ నేడు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు నేపథ్యంలో నారా లోకేష్ ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే.. నిన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం తీర్పు వెలువరిస్తామని తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా పెరిగిన జీతాలు?
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఉద్యోగులు డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. జులైలోనే డీఏ పెరగాల్సి ఉంది. కానీ.. రెండో డీఏ ఇప్పటి వరకు పెరగలేదు.. ప్రతి ఏడాది రెండు సార్లు డీఏ పెరుగుతుంది. జనవరి, జులై రెండు సార్లు డీఏ పెరుగుతుంది. ఈ సంవత్సరం జనవరిలో పెరగాల్సిన డీఏ.. మార్చిలో పెరిగింది. ఆ తర్వాత డీఏ జులైలో పెరగాల్సి ఉంది. కానీ.. ఇంకా జులైలో పెరగలేదు. దసరా, దీపావళి సందర్భంగా ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఊరిస్తూ, నిరాశను కలిగిస్తుంది..
అయితే, కేంద్రం డీఏను పెంచకముందే తెలంగాణ ప్రభుత్వం డీఏ పెంపును తాజాగా ప్రకటించింది. దసరా కానుకగా ఫెస్టివల్ బొనాంజా పేరుతో ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపును ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండి వీసీ సజ్జనార్ డీఏ పెంపును ప్రకటించారు. 4.8 శాతం డీఏను పెంచుతున్నట్టు తాజాగా వెల్లడించారు. డీఏ పెంపు ఈ సంవత్సరం జులై నుంచి అమలులోకి రానుంది. ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్ జీతంతో పాటే డీఏ కూడా పెరిగి.. అక్టోబర్ జీతంతో రానుంది. 2019 నుంచి ఇప్పటి వరకు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు 9 డీఏలను ఇన్‌స్టాల్‌మెంట్స్ లో ఇస్తున్నారు.
తరువాత ప్రాజెక్ట్ కోసం ఆ హాలీవుడ్ స్టూడియో తో చర్చలు..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జవాన్’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తమిళ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నయనతార, దీపికా పదుకొనే,హీరోయిన్ లు గా నటించారు.అలాగే ఈ సినిమాలో ప్రియమణి, విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, రిధి డోగ్రా తదితరులు ముఖ్య పాత్రల్లో మెరిశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై షారుక్ ఖాన్ సతీమణి గౌరీఖాన్ భారీ బడ్జెట్‌తో జవాన్ సినిమా ను నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. సెప్టెంబర్ 7న విడుదలైన జవాన్ రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కాగా జవాన్ సినిమా తో దర్శకుడు అట్లీ క్రేజ్ కూడా నెక్ట్స్ లెవెల్ కు చేరింది.. జవాన్ సినిమా కు ముందు కేవలం తమిళంలో బిజీగా ఉన్న దర్శకుడు అట్లీ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా బిజీబిజీ అయ్యాడు. అయితే అట్లీ మాత్రం హాలీవుడ్ లో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడని సమాచారం.
రూ.2000నోట్ల మార్పిడికి నేడే ఆఖరు.. మార్చుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత్ దాస్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 2023 అక్టోబరు 7 వరకు రూ.2000 నోట్లను మార్చుకోకపోవటం వల్ల కలిగే ప్రభావం గురించి ఇందులో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 30న విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఈ తేదీని పొడిగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అయితే ఇది ఉన్నప్పటికీ నోట్లను రిజర్వ్ బ్యాంక్‌లో మార్చుకోవచ్చు. అక్టోబరు 7 తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ 19 కార్యాలయాల్లో రూ.2000 బ్యాంక్ నోట్లను మార్చుకోవడానికి అనుమతించబడుతుంది. ఈ కార్యాలయాల్లో 20 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు. ఈ 19 ఇష్యూ కార్యాలయాలలో దేనిలోనైనా, వ్యక్తులు లేదా సంస్థలు తమ బ్యాంకు ఖాతాల్లో ఎంత మొత్తమైనా జమ చేసేందుకు రూ. 2000 బ్యాంకు నోట్లను ఇవ్వగలరు.
ప్రమోషన్స్ కి రారు కానీ మా పైసల్ కావాలి…
బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాల హవా చాలా పెరిగింది, ఇప్పుడు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల ప్రమోషన్స్ కి హీరోలు కూడా బౌండరీలు దాటి ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, యష్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రజినీకాంత్, కమల్ హాసన్, కార్తీ, సూర్య, రణబీర్ కపూర్, రన్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, కిచ్చా సుదీప్, విక్రమ్ లాంటి హీరోలు తమ సినిమాల కోసం రాష్ట్రాలు దాటి ఇతర ఇండస్ట్రీలకి వెళ్లి మరీ తమ సినిమాలని ప్రమోట్ చేస్తున్నారు. మా సినిమా బాగుంటుంది, తప్పకుండ చూడండి, ఆదరించండి అంటూ స్పెషల్ మీడియా ఇంటరాక్షన్స్ పెట్టి మరీ అడుగుతున్నారు. ఆ హీరోల కలెక్షన్స్ పెరగడానికి ఈ ప్రమోషన్స్ కూడా ఎంతో హెల్ప్ అవుతున్నాయి. అయితే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు.