నాకు అన్యాయం జరిగింది.. హైకోర్టుకు వెళ్తా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా ముద్దాయిలకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు శిక్షలు ఖరారు చేసిన విషయం విదితమే.. అయితే, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. శిరోముండనం కేసులో శిక్ష ఖరారైన తర్వాత.. వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ తర్వాత ముద్దాయిలు అందరికీ బెయిల్ ఇచ్చింది కోర్టు.. ఇక, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.. చట్టాన్ని గౌరవించడం నా బాధ్యత.. ఈ కేసుపై హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలని భావిస్తున్నాను అన్నారు.. శిరోముండనం కేసును భూతద్దంలో చూపించి రాజకీయ లబ్ధిపొందాలని చూసిన నా ప్రత్యర్థులకు, టీడీపీ నేతలకు ఇవాళ వచ్చిన తీర్పు రుచించదు అని పేర్కొన్నారు త్రిమూర్తులు.. నాకు సంబంధం లేని కేసును ఇంతకాలం ఎదుర్కొన్నాను… కోర్టు తీర్పును హైకోర్టులో అప్పీల్ చేస్తాను అన్నారు. హైకోర్టులో నాకు 100 శాతం న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాని తెలిపారు. కేసు కోసమో పార్టీలు మారుతున్నాను అనే రాజకీయ విమర్శలు చేసే వాళ్లకు నిరాశ ఎదురైందని సెటైర్లు వేశారు. ప్రభుత్వమే కేసులు మాఫీ చేయగలిగితే చంద్రబాబుపై వున్న కేసులు సంగతేంటి..? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాను.. రాజకీయాలకు కేసుకు సంబంధం లేదన్నారు. ఇక నుంచి ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడతాయో చూస్తాను అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.
న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.. వివేకా కేసులో అన్ని నిజాలు బయటకు వస్తాయి..
న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.. వైఎస్ వివేకా కేసులో అన్ని నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని తెలిపారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. తనపై విపక్షాలు చేస్తున్నర ఆరోపణలపై స్పందించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. అనేక విషయాలపై స్పందించారు.. మా షర్మిల అక్క, సునితక్క ఎన్నికల ప్రచారాల్లో చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాను అన్నారు. దస్తగిరి, సునితక్క లాలూచీ పడి నా పై ఆరోపణలు చేస్తున్నారు… వాచ్‌మెన్ రంగన్న నలుగురు వ్యక్తుల పేర్లు చెప్పాడు .. నెల రోజులు అయినా సీబీఐ వాళ్లు అరెస్టు చేయలేదు.. దస్తగిరి యాంటీస్పెక్టర్ బెయిల్ కు సీబీఐ, సునితక్క అడ్డుకోరు.. డబ్బులు ఇస్తాం, బెయిల్ ఇస్తాం అంటే ఎవరిపైన అయినా ఆరోపిస్తారు అంటూ మండిపడ్డారు. జులై 2020లో సునితక్క వాగ్మూలం ఇచ్చినప్పుడు నా భర్త తన ఫోన్ లో లెటర్ చూపించాడని చెప్పింది.. ఎవరు సలహా ఇచ్చారో ఏమో తెలియదు. ఆ లెటర్ గురించి ఏమి తెలియదని చెబుతుంది.. సీబీఐ ముందు నెల తిరగకుంనే సునితక్క మాట మార్చింది.. సంఘటన జరిగిన వారం లోపు ప్రెస్ మీట్ పెట్టి సునితక్క ఏమి చెప్పింది.. నాన్న చనిపోయిన ముందు రోజు ఎన్నికల ప్రచారంలో అవినాష్ ను గెలిపించాలని కోరారు అని సునితక్క చెప్పిందని గుర్తుచేశారు. మే 2023 లో నాకు బెయిల్ వచ్చిన తరువాత సీబీఐ వద్దకు వెళ్లి, మే 31, 2023న సజ్జల చెప్పమంటే చెప్పానని అంటోంది అంటూ సునితపై ఫైర్ అయ్యారు అవినాష్‌రెడ్డి.. చంద్రబాబు నాయుడు చెప్పమంటే అలా చెబుతోంది సునితక్క అని ఆరోపించారు. శివ ప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతాడు.. తను నాకు ఫోన్ చేస్తాడని ముందే నేను ఎలా ఊహించగలుగు తాను.. సీబీఐ చేస్తున్నది గుడ్డి ఆరోపణ అన్నారు. సీబీఐ చేస్తున్నది తప్పుడు విచారణ.. లోకల్ సీఐకి నేనే ఫోన్ చేసి చెప్పినా.. లెటర్ ఉంటే పోలీసులకు చెప్పాలని రాజశేఖర్ రెడ్డి కి లేదా..? అని నిలదీశారు. ఎందుకు లెటర్ దాచి పెట్టారు… ఎర్ర గంగిరెడ్డి కి ఫోన్ చేసిన వ్యక్తి నెర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి.. ఏ నుంచి ఏ 4 వరకు ఉన్న నిందితులు వివేకా పెద్డనాన్నకు సన్నిహితులే అన్నారు. పండింటి రాజశేఖర్ ఇచ్చిన వాగ్మూలం చూసావా అక్క. మీ తండ్రి ని నిరాదరణకు గురి చేసింది ఎవరు.. వ్యాపారంలో వచ్చే లాభానికి రెండవ భార్యకు ఇస్తాడాని నెట్టి వేసింది మీరు కాదా..? అని నిలదీశారు.
చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపే..
ఈ ఎన్నికల్లో చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపే అన్నారు సీఎం వైఎస్ జగన్.. భీమవరంలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. భీమవరంలో ఉప్పొంగిన ప్రజల అభిమానం సముద్రం కనిపిస్తోంది.. ఇంతటి అభిమానాలు, ఆప్యాయత చూపిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిరు. మంచి చేసి మనం.. జెండాలు జతకట్టి వాళ్లు వస్తున్నారు.. పేదల వ్యతిరేకులు ఓడించి మనం చేస్తున్న ఇంటింటి అభివృద్ధి సంక్షేమాన్ని కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమా..? అని ప్రశ్నించారు. జరగబోయేవి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు మాత్రమే కాదు.. వచ్చే ఎన్నికల్లో మన ఓటు ఐదేళ్ల భవిష్యత్తు. పేదల సంక్షేమం అన్నీ కొనసాగి మరో రెండు అడుగులు ముందు వేయాలా లేక మోసపోయి మళ్లీ నష్టపోవాలా అనేది నిర్ణయించే ఎన్నికలు ఇవి… ఈ ఎన్నికలు మన తలరాతను మార్చే ఎన్నికలను ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలన్నారు. ఇక, జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు.. పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు సీఎం జగన్.. ఎన్నికల్లో జగన్ పేదల పక్షం.. రాబోయే ఐదేళ్లలో మీరు ఏ దారిలో నడవాలని ఎన్నికల నిర్ణయిస్తాయన్న ఆయన.. కుటుంబ అంతా కూర్చుని ఆలోచించి నిర్ణయం తీసుకోమని కోరారు.. జగన్‌కు ఓటేస్తే ఈ మంచి అంతా కొనసాగుతుంది.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపు పలుకుతారని ఆరోపించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోతాం అనేది చరిత్ర చెబుతున్న సత్యం.. అందుకే బాగా ఆలోచించి ఓటు వేయండి.. వేసే ఓటు వల్ల మనకి మంచి జరుగుతదా లేదా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించి అడుగులు ముందుకు వేయాలన్నారు. చంద్రబాబుకు ఈ మధ్య నాపై కోపం ఎక్కువ వస్తోంది.. హై బీపీ వస్తుంది.. ఏవేవో తిడుతూ శాపనార్థాలు పెడుతున్నారు.. రాళ్లు వేయండి అంతం చేయండి అంటూ చంద్రబాబు పిలిపు ఇస్తున్నారు.. నాపై చంద్రబాబుకు అంత కోపం ఎందుకంటే.. ఎందుకంటే చంద్రబాబును నేను అడగకూడని ప్రశ్న అడిగా.. ఆ ప్రశ్న ఏంటంటే బాబు బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురుచూస్తూ ఇంకోపక్క జపం చేస్తున్నట్టుగా నటిస్తావెందుకని అడిగా.. ఇలా అడగడం తప్పా..? మీ పేరు చెబితే పేదలకు గుర్తొచ్చే పథకం ఒకటైన ఉందా అని చంద్రబాబును అడిగా.. ఆయన చేసిన మంచి ఏ పేదలకు గుర్తుకు రాకపోగా బాబు పేరు చెబితే వెన్నుపోట్లు మోసం దగా అబద్ధాలు కుట్రలు ఇవి మాత్రమే గుర్తొస్తున్నాయని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్ జగన్.
ఈ మధ్య పవన్‌కు బీపీ ఎక్కువైంది.. జగన్ సెటైర్లు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దత్తపుత్రుడు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి, పిల్లలను పుట్టించి, కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గం కూడా వదిలిస్తున్నారు అంటూ హాట్ కామెంట్లు చేశారు. అందుకే దత్తపుత్రుడికి ఈమధ్య బీపీ ఎక్కువగా కనిపిస్తోందన్న ఆయన.. ఒక్కసారి చేస్తే పొరపాటు మళ్లీ మళ్లీ చేస్తే అలవాటు అంటారని దత్త పుత్రుడికి చెప్పా.. పవిత్రమైన బంధాన్ని నడిరోడ్డుపైకి తీసుకురావడం, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపడం ఘోరమైన తప్పు కాదా? అని దత్తపుత్రుని అడుగుతున్నాను అన్నారు. నువ్వు చేస్తున్నది తప్పు కదా? అని అడిగితే అది దత్తపుత్రుడికి బీపీ పెరిగిపోయి ఊగిపోతున్నారు.. నేను అడిగే ప్రశ్నలకు చంద్రబాబుకి కోపం, దత్తపుత్రుడికి కోపం, చంద్రబాబు వదినకు కూడా కోపం అని ఎద్దేవా చేశారు. చేసిన మంచి మాత్రం చెప్పడానికి చేసిన మంచి చెప్పడానికి ఏ ఉదాహరణ కనిపించదు.. చంద్రబాబు చేసిన మోసాలు చూపడానికి చాలా కనిపిస్తాయన్నారు సీఎం జగన్.. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, వెన్నుపోట్లను నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పేరు చెప్తే ఏ పేదవాడికి ఆయన చేసిన మంచి కనిపించదు.. చంద్రబాబు తన జీవితమంతా మోసాలు కుట్రలు వెన్నుపోట్లతో పొత్తులతో రాజకీయాలు చేస్తా ఉంటారు.. జగన్ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టే .. జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కాంగ్రెస్ కోవర్టులు వ్యవస్థలో ఉన్న వీరి మనుషులు కలసి ఒక్క జగన్ పై దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఒక్కడు . బాబుకు 10 మంది సేనానులు.. చంద్రబాబు వెనుక పదిమంది సేనానులు బాణాలు ఎక్కువ పెట్టి ఉన్నారు.. వారు వేసే బాణాలు తగిలిబోయేది జగన్ కా .. లేక జగన్ అమలు చేసే పథకాలకా అనేది ప్రజల ఆలోచించాలని సూచించారు సీఎం వైఎస్ జగన్.
సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజం.. కోచింగ్ లేకుండా తొలి ప్రయత్నంలోనే విక్టరీ
మంగళవారం సివిల్స్ ఫలితాలు విడుదల కాగానే తెలుగు తేజం అనన్య రెడ్డి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు దేశమంతా ఆమె పేరు అందరినోళ్లలో వినిపిస్తోంది. దీనికి ఆమె సాధించిన ర్యాంకే. చూడ్డానికి మనిషి బక్కపలచగా.. సన్నగా ఉంది. కానీ ఆమె సాధించిన ర్యాంక్ చూస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే. పైగా ఆమె తొలి ప్రయత్నంలోనే అసాధారణ ప్రతిభ చూపించారు. దేశంలోనే మూడో ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించింది. మహిళల్లో అయితే ఆమెనే ఫస్ట్ ర్యాంక్ సాధించింది. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్ గీతం హైస్కూల్‌లో చదివిన అనన్య.. ఇంటర్ విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే ఈ ఘనతను సాధించడం మరో గొప్ప విశేషం. సివిల్స్ పరీక్ష అంటేనే ఎంతో కఠినం. అలాంటిది ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంక్ సాధించడం మామూలు విషయమా? ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కొని నిలబడడం ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటిది తొలి ప్రయత్నంలోనే ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సొంత ప్రిపరేషన్‌తో సివిల్స్‌లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి అందరి చేత ప్రశంసలు పొందుతోంది.
రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్ పూర్ లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాధ సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నేను రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదగడానికి మెదక్ జిల్లా నాకు బలానిచ్చింది అన్నారు. మెతుకు సీమలో ఏడూ ఎమ్మెల్యేలు గెలిపించిన నా జిల్లాకి చేతులెత్తి మొక్కుతున్నాను.. BRSకి ఓట్లెందుకు సీట్లెందుకు అని కొంతమంది మాట్లాడుతున్నారు.. ఈ టైంలోనే మనకి మన నాయకులు కావాలి.. రాజకీయాల్లో అప్పుడప్పుడు లిల్లీ పుట్టుగాళ్లకు కూడా అధికారం వస్తుంది అని ఆయన చెప్పారు. రేవంత్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేటట్టు లేదు అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ భయంతో నారాయణాపేట సభలో భయంతో మాట్లాడుతున్నారు.. ఎప్పుడు ఆయన బీజేపీతో కలుస్తాడో తెలియదు అని పేర్కొన్నారు. వాళ్ళకి ఇంకా మంచి పనులు చేయమని అధికారం జనాలు ఇస్తారు.. ప్రపంచంలో ఎక్కడ లేని అంబెడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో పెట్టాను.. లిల్లిపుట్టుగాళ్ల ప్రభుత్వంలో అంబెడ్కర్ కి అవమానం జరిగింది.. అంబేడ్కర్ విగ్రహాన్ని చూడటానికి ఎందరో వస్తే కనీసం మంచినీళ్లు కూడా పెట్టలేదు అని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ మెడలు వచ్చి పని చేయిస్తుంది అని కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం పనులు పూర్తి కావాలన్న, 24 గంటల కరెంట్ కావాలన్న మళ్ళీ BRS రావాలి.. ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 2 సీట్లు కూడా రావు అది సర్వేలో తేలింది..కూసుంటే లేవచేతకాదు కానీ చెట్టంత ఎగురుతా అన్నాడట.. డిసెంబర్ 9వ తేదీ నాడు రుణమాఫీ చెయ్యలేదు కానీ ఆగస్టు 15 వరకు చేస్తాం అంటున్నారు.. ఓట్లు ఆగమాగం వేయొద్దు.. మొన్న ఎలక్షన్స్ లో దెబ్బతిన్నాం.. రైతులకు ఇస్తామన్న బోనస్ కచ్చితంగా ఇవ్వాలి.. దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం.. మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోయి ట్యాంకర్లు వస్తున్నాయి.. ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు అని కేసీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోతుందనే భయం కేసీఆర్లో కనిపిస్తుంది..
కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని ఎన్డీవీ క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలను గెలిచి కూడా మా పార్టీలోని 12 ఎమ్మెల్యేలను లాగేసుకున్నాడు అనే విషయాన్ని గుర్తు చేశారు. మేము ఎప్పుడూ కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, నలిపేస్తాం, మేమే మళ్లీ అధికారంలోకి వస్తామని తప్పుడు మాటలు మాట్లాడలేదని చెప్పారు. మేము ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని నిలబెట్టడమే మా యొక్క ప్రథమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. మేము ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కానీ, ఏ శాసన సభ్యుడిని గానీ, బలవంతంగా వచ్చి.. బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో చేర్చుకోవడం లేదు.. వాళ్లు బీఆర్ఎస్ పార్టీలో ఇమడలేక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేసీఆర్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. పలు సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒకటి రెండు సీట్లు మాత్రమే వస్తాయని తేలింది.. కేసీఆర్ కు వచ్చే సీట్లు వస్తాయని చెబుతున్నారు.. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ చెప్పే మాయమాటలు ప్రజలకు తెలుసు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే సగానికి పైగా హామీలను అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ప్రతి హామీని వంద శాతం మేం అమలు చేసి తీరుతాం.. బీఆర్ఎస్ ప్రభుత్వంలా మేము మోసాలు చేయం అని ఆయన పేర్కొన్నారు. ఇక, గత 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఎన్నీ హామీలను అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత బంధును కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలకే ఇచ్చారని పేర్కొన్నారు. 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి దళితులను బీఆర్ఎస్ పార్టీ దారుణంగా మోసం చేసిందన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నాడంటూ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ- బీఆర్ఎస్ కుట్రపూరితంగా ఈ ప్రచారం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్.. 29కి పెరిగిన మృతి చెందిన మావోల సంఖ్య
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోల సంఖ్య 29కి చేరింది. ఛోట్‌బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండా, కరోనార్ మధ్య హపటోలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో.. పోలీసులు, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరగగా.. 29 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ లో DRG మరియు BSF బృందాలు సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో 25 లక్షల రివార్డు ఉన్న నక్సలైట్ కమాండర్ శంకర్ రావు కూడా మరణించినట్లు సమాచారం. కాగా.. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఒక ఇన్‌స్పెక్టర్‌తో సహా ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. ఇన్‌స్పెక్టర్ కాలికి కాల్పులు జరగగా, కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు.. నక్సలైట్ల నుంచి ఏడు ఏకే 47, మూడు ఎల్‌ఎంజీ ఆయుధాలు, ఇన్‌సాస్ రైఫిల్ భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. 10 మంది నక్సలైట్ల మృతదేహాలను సైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఛోటేబెతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని కంకేర్ జిల్లా ఎస్పీ ఐకె అలెసెల తెలిపారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని.. ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన సైనికుల పరిస్థితి సాధారణంగా ఉందన్నారు. గాయపడిన సైనికులకు మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.
వచ్చే నెలలో మారుతి న్యూ స్విఫ్ట్ లాంఛ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి స్విఫ్ట్ నాల్గవ ఎడిషన్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్‌లో అనేక కొత్త అప్‌డేట్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఆటో మోటార్ షోలో మారుతి పేరెంట్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ తన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును ప్రదర్శించింది. అయితే.. ఇండియా-స్పెక్ మోడల్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. యెడ్ (YED) కోడ్ నేమ్‌తో వస్తున్న నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ (Swift).. అడాస్ (ADAS) వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్స్ విత్ 6-ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది. స్విఫ్ట్‌లో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, కొత్త గ్రిల్‌తో పాటు, హెడ్‌ల్యాంప్‌లు, LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRL) ఉన్నాయి. సుజుకి లోగో ఇప్పుడు బానెట్ పైభాగంలో ఉంచారు. ఇరువైపులా కొత్తగా డిజైన్ చేయబడిన డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక వైపున పునఃరూపకల్పన చేయబడిన టెయిల్‌గేట్, దిగువన స్కిడ్ ప్లేట్‌తో కూడిన కొత్త బంపర్ ఉంది. అదనంగా.. స్టాప్ ల్యాంప్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్, విలక్షణమైన C-ఆకారపు DRLలతో LED టైల్‌లైట్‌లను కలిగి ఉంటుంది. ఫోర్డ్ ఫిగో, మారుతి బాలెనో, మారుతి బ్రెజాల్లో మాదిరిగా బ్లాక్ అండ్ వైట్ డ్యుయల్ టోన్ థీంతోపాటు ఆల్ న్యూ డాష్ బోర్డ్ లేఔట్ ఉంటుంది. 9.0-అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తోపాటు న్యూ డాష్ బోర్డ్ లేఔట్, స్లీక్ ఏసీ వెంట్స్, బాటంలో హెచ్ వ్యాక్ కంట్రోల్స్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో న్యూ స్విఫ్ట్ ఇంటీరియర్ డిజైన్ చేశారు.
బ్లాక్ బస్టర్ కాంబో మళ్ళీ వస్తోంది.. కానీ?
ఈ మధ్యకాలంలో ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అయిన హ్యాష్ టాగ్ 90 అనే వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆదిత్య హాసన్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో నవీన్ మేడారం అనే దర్శకుడు నిర్మాణంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉండడంతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ వెబ్ సిరీస్ తో ఈటీవీ విన్ యాప్ కి సబ్స్క్రైబర్లు పెరిగారు అంటే ఎంతలా ఈ వెబ్ సిరీస్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ వెబ్ సిరీస్ కి సెకండ్ సీజన్ ఉంటుందని అప్పట్లోనే యూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పుడు సెకండ్ సీజన్ కాదు కానీ ఇదే కాంబినేషన్లో ప్రొడక్షన్ నెంబర్ 2 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో నవీన్ మేడారం నిర్మాణంలో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. ఈ టీం నుంచి ప్రొడక్షన్ నెంబర్ 2 రాబోతుందని అయితే మోడరన్ వరల్డ్ లో ఒక ట్విస్ట్ ఉంటుందని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో ఒక అమ్మాయి అబ్బాయి సైకిల్ తొక్కుతూ స్కూల్ కి వెళుతున్నట్లుగా చూపించారు. బ్యాక్ డ్రాప్ చూస్తున్నట్లయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే కనిపిస్తోంది. ఒకపక్క నది మరొక పక్క కాలు అలాంటి ప్రాంతంలో ఈ సబ్జెక్ట్ ఉండబోతుందని హింట్ ఇచ్చేశారు మేకర్స్. అయితే ఇది వెబ్ సిరీసా, లేక సినిమానా అనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. బహుశా రేపు అధికారికంగా ప్రకటించే సమయంలో ఈ విషయం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
అఖండ సీక్వెల్‌పై బోయపాటి కీలక అప్డేట్
బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు మూడు సినిమాలు చేస్తే దాదాపు మూడు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇద్దరు కలిసి ముందుగా సింహా తర్వాత లెజెండ్ సినిమాలతో పాటు చివరిగా అఖండ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ అఖండ సినిమా అయితే బాలకృష్ణ కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా మారింది. ఇక ఈ సినిమా చివరిలో రెండో భాగానికి లీడ్ వదిలారు. అయితే ఎప్పుడు ఈ రెండో భాగం తెరకెక్కుతుందని విషయం మీద క్లారిటీ లేదు. కానీ ఈ విషయం మీద తాజాగా బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు. తాజాగా కోకాపేట సమీపంలో సురేష్ బాబు నిర్మించిన ఒక ఆలయ పూజా కార్యక్రమంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగానే తన అఖండ సీక్రెట్ గురించి ఆయన లీక్ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణతో అఖండ సినిమా ఉంటుందని చెబుతూనే ఇప్పట్లో అయితే సినిమా ఉండదని ప్రస్తుతం తమకి ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత అధికారికంగా సినిమా అనౌన్స్ చేసి స్టేట్స్ మీదకు వెళతామని చెప్పుకొచ్చారు. సొసైటీకి కావాల్సిందేమిటో బాలకృష్ణ అభిమానులకు కావాల్సిందేమిటో తనకి తెలుసు అని వారందరూ ఆనందించేలా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు బోయపాటి శ్రీను. ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద ఈ సినిమాని గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఇక బోయపాటి విషయానికి వస్తే అల్లు అర్జున్ తో సినిమా అని ఒకసారి సూర్యతో సినిమా చేస్తున్నాడు అని ఒకసారి రకరకాల పేర్లు వస్తున్నాయి. కానీ అధికారికంగా ప్రకటిస్తే తప్పు బోయపాటి శ్రీను సినిమా ఎవరితో ఉంటుందనే విషయం మీద క్లారిటీ లేదు.