గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. నేడే వారి ఖాతాల్లో సొమ్ము జమ
సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్ములను వరుసగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక, రైతులకు కూడా ఎప్పటికప్పుడూ.. సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. ఈ తరుణంలో కౌలు రైతులకు శుభవార్త వినిపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు రైతు భరోసా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.. రైతుల ఖాతాల్లో వర్చువల్ గా నగదు జమ చేయబోతున్నారు.. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా ఆర్థిక సాయం అందబోతోంది.. ఈ స్కీమ్ కింద మొత్తం 1,46,324 మందికి లబ్ది చేకూరనుండగా.. ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు.. అంటే.. మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లో 109.74 కోట్ల రూపాయలు జమ చేస్తారు సీఎం వైఎస్ జగన్..
ఇక సూర్యుడిపై ఫోకస్ పెట్టిన ఇస్రో.. నేడే PSLV C-57 ప్రయోగానికి కౌంట్‌డౌన్
చంద్రయాన్-3తో జాబిలమ్మపై అడుగుపెట్టి అక్కడి పరిస్థితులు, వనరులపై అధ్యయనం మొదలుపెట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. చందమామపై ఉన్న రహస్యాలను ఛేదించే పనిలోపడిపోయింది.. మరోవైపు.. ఇప్పుడు సూర్యుడిపై ఫోకస్ పెట్టింది.. దీనికి సంబంధించిన PSLVC-57 రాకెట్ ప్రయోగానికి ఈ రోజు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. ఈ రోజు ఉదయం 11.50 గంటలకు మొదలుకానున్న కౌంట్ డౌన్.. 24 గంటల పాటు కొనసాగనుంది.. ఆ తర్వాత PSLVC-57 రాకెట్ ను ప్రయోగించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.. ఇప్పటికే PSLVC-57 ప్రయోగానికి లాంచ్ అథరైజేషన్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. మరోవైపు.. శ్రీహరికోటకు చేరుకున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.. ప్రయోగ ప్రక్రియపై శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు.. రాకెట్ లోని వివిధ విభాగాలను పరిశీలిస్తున్నారు శాస్త్రవేత్తలు.. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి పై పరిశోధనలకు ఆదిత్య- L1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు.. ఇక, నిన్న షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటన చేశారు..
వెలుగులోకి వాలంటీర్ బాగోతం.. బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చాకా ఊహించని ట్విస్ట్..!
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు విపక్షాల నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు.. ఇదే సమయంలో.. అక్కడక్కడ కొన్ని వాలంటీర్ల వ్యవహారాలు కలకలం రేపుతూనే ఉన్నాయి.. అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు.. ఇలా పలు రకాల కేసుల్లో వారు చిక్కుకుంటున్నారు. తాజాగా, ఓ వాలంటీర్ బాగోతం అనంతపురంలో తీవ్ర కలకలంగా మారింది.. ఓ బాలికపై కన్నేసిన వాలంటీర్.. ఆమెపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తుండగా.. దీంతో ఆమె గర్భం దాల్చింది. అయితే, ఈ వ్యవహారంపై కుటుంబ సభ్యులు బాలికను నిలదీయడంతో.. ఓ కానిస్టేబుల్ వల్లే తాను గర్భందాల్చానంటూ ట్విస్ట్ ఇచ్చింది.. ఇక, బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఆ కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. కానీ, బాధితురాలు మేజిస్ట్రేట్ ముందు అసలు నిందితుడి పేరు చెప్పడంతో.. అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు షురూ.. ఓ మోస్తరు నుంచి భారీగా కురిసే అవకాశం
ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాకాలంలో తేమ శాతం గత నెల కంటే ఎక్కువగా ఉంది. రుతుపవనాలు ఆశించిన స్థాయిలో ప్రభావవంతంగా లేవు. వాతావరణ పరిస్థితుల వల్ల పెద్దగా వర్షాలు కురవలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే మరికొద్ది రోజుల్లో ఈ పరిస్థితి మారనుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాల ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేటి నుంచి వారంలో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలవుతాయని చెబుతున్నారు. రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జూన్, జూలై మాసాల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో లేవు. జూన్ చివరిలో వర్షాలు కురిశాయి. జూలైలో స్వల్ప తగ్గుదల కనిపించింది. తెలంగాణలో వర్షాలు కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తున్నా ఏపీలో మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఆ తర్వాత వాతావరణం కాస్త చల్లబడినా వర్షం కురవలేదు. ఆగస్టులో సగటు వర్షపాతం నమోదవుతుంది. సూర్యుడు మళ్ళీ ప్రకాశించడం ప్రారంభించాడు. కానీ రుతుపవనాల ద్రోణి ఉత్తరాది రాష్ట్రాల వైపు పయనించడమే తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితులకు కారణమని వాతావరణ శాఖ చెబుతోంది. రుతుపవనాల విరామం కూడా ఈలోపు వర్షాభావ పరిస్థితులకు దోహదపడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎల్ నినో ప్రభావం ఈసారి రుతుపవనాలపై కూడా తీవ్ర ప్రభావం చూపిందని నిపుణులు చెబుతున్నారు.
గ్రేటర్ ప్రజలకు శుభవార్త.. రేపటి నుంచే ఇళ్ల పంపిణీ..
హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం గ్రేటర్ పరిధిలో లక్ష పడక గదుల ఇళ్ల పంపిణీ ప్రక్రియను రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే.. ఈ ప్రక్రియను ఐదు నుంచి ఆరు దశల్లో.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎంపికైన లబ్ధిదారులకు మొదటి విడతగా సెప్టెంబర్ 2న డబుల్ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడుతలో 11 వేల 700 ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. విడతల వారీగా పంపిణీ చేసి అక్టోబర్ వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 70 వేల ఇళ్లు పూర్తి చేసి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మొదటి విడుతలో కుత్బుల్లాపూర్‌లో మంత్రి కేటీఆర్, శేరిలింగంపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కొల్లూరులో హరీశ్ రావు, మేడ్చల్‌లో మల్లారెడ్డి, ఉప్పల్‌లో మేయర్ విజయలక్ష్మి, ప్రతాపసింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మహాశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ పాతబస్తీలో, రాజేంద్రనగర్‌లోని పట్నం మహేందర్ రెడ్డి డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఆగస్టు 15న ప్రకటించిన సీఎం కేసీఆర్.. మరుసటి రోజే సంబంధిత అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. పంపిణీకి సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. మురికివాడల్లో నివసించే పేదల గుడిసెలు తొలగించి వాటి స్థానంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించామని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో 4,500 మంది పేదలకు ఇళ్లు మంజూరు చేశామన్నారు. మరో 70 వేల ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇంటింటి సర్వే నిర్వహించి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తున్నామని మంత్రి తెలిపారు. అనంతరం వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించి వారి పేర్లతో లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు.
‘మన్ కీ బాత్’ కు పోటీగా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం స్టాలిన్
భారత ప్రధాని నరేంద్రమోదీని ప్రజలకు మరింత చేరువ చేసిన కార్యక్రమం మన్ కీ బాత్. దీని ద్వారా మోదీ ప్రతినెల ప్రజలతో కొన్ని విషయాలను పంచుకునే వారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో ధైర్యం చెప్పడం నుంచి, కొత్త పథకాల వివరాలు తెలిపడం వరకు ప్రతిది ఈ కార్యక్రమం ద్వారా మోడీ ప్రజలకు తెలిపేవారు. తమ ప్రభుత్వం సాధించిన ఘనతలు, మన హిస్టరీ ఇలా అన్నింటి గురించి ఆయన ఈ కార్యక్రమంలో ప్రస్తవించేవారు. ఇప్పటి వరకు ఏ ప్రధాని ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించకపోవడంతో ప్రారంభం నుంచే ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. అయితే విపక్షాల కూటమి ఇండియా ఈసారి ఎలాగైనా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రయత్నాలు చేస్తో్ంది. దీనికి సంబంధించి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇక విపక్ష కూటమిలో ముఖ్యనేత అయిన తమిళనాడు సీఎం స్టాలిన్ బీజేపీ సర్కారుపై యుద్ధానికి కొత్త ఆయుధాన్ని రెడీ చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమానికి పోటీగా సరికొత్త ప్రోగ్రామ్ ను తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆయన ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.1 నిమిషం 14 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను ‘చెక్ 1..2..3’ అంటూ ఆయన మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం పోడ్ కాస్ట్ సిరీస్ తరహాలో ఉంటుందని స్టాలిన్ తెలిపారు. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ పేరుతో పాడ్ కాస్ట్ సిరీస్‌ను ప్రారంభించనున్న ఆయన ట్విటర్ వేదిక దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, గత తొమ్మిదేళ్ల బీజేపీ సర్కారు వైఫల్యాలపై జాతిని ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడనున్నారు. ఇక ఈ సందర్భంగా బీజేపీ పై, మోడీపై ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. దేశాన్ని మోడీ సర్కార్ నాశనం చేస్తోందని, దేశంలో విద్వేషాలు రేగేలా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
పుట్టగొడుగుల పెంపకంతో మారిన మహిళ అదృష్టం.. అనతికాలంలోనే కోటీశ్వరురాలైంది
బీహార్‌లో మహిళలు కూడా ఇప్పుడు పురుషులతో సమానంగా అడుగులు వేస్తున్నారు. అది విద్యా రంగమైనా, వ్యవసాయ రంగమైనా. నేడు మహిళలు అన్ని రంగాల్లో పేరు తెచ్చుకుంటున్నారు. కూరగాయల వ్యవసాయం ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్న మహిళ గురించి నేడు తెలుసుకుందాం. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా మహిళా రైతుల గురించి చర్చ జరుగుతోంది. విశేషమేమిటంటే ఈ మహిళా రైతు సేంద్రియ పద్ధతిలో పచ్చికూరగాయలు పండించడం. దీంతో ఆమె వద్ద కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇతర గ్రామాల నుంచి కూడా వస్తుంటారు. ఈ మహిళా రైతు పేరు సంగీత కుమారి. ఆమె పాట్నా జిల్లాలోని అత్మల్‌గోలా బ్లాక్‌లోని ఫూలేర్‌పూర్ గ్రామ నివాసి. ప్రస్తుతం సంగీత కుమారి జీరో టిల్లేజ్ సహాయంతో పుట్టగొడుగులు, బంగాళదుంపలు, ఇతర కూరగాయలను పండిస్తున్నారు. దీంతో పాటు ఇతర మహిళలకు కూడా వ్యవసాయం చేసేందుకు శిక్షణ ఇస్తోంది. ఇంతకుముందు ఇంటి ఖర్చులకు డబ్బు కొరత ఉండేదని సంగీత కుమారి చెప్పారు. ఆ సమయంలో ఆమె దగ్గర వెయ్యి రూపాయలు కూడా లేవు. కానీ ఎప్పుడైతే కూరగాయల సాగు ప్రారంభించిందో అప్పటి నుంచి ఆమె ఆర్థిక పరిస్థితి మారిపోయింది. నేడు సంగీత వ్యవసాయం వల్ల ఏటా రెండు లక్షలకు పైగా సంపాదిస్తోంది. దీంతో ఆమె కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.