ట్రాఫిక్ కష్టాలు.. కారులోనే వంటకి రెడీ?
కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరులో 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. ఇది చూస్తుంటే బెంగళూరులో ట్రాఫిక్ తారాస్థాయికి చేరుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు. దీనికి అద్దం పట్టే ఘటనలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సిలికాన్ సిటీ బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియజెప్పే రెండు ఘటనలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ ఘటనలో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న ఓ మహిళ అక్కడే కూరగాయలు కూడా ఒలుచుకుంది.
బాలయ్య సౌండ్ సరిపోవట్లేదు… కాస్త బేస్ పెంచండి
సంక్రాంతి బరిలో ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో నిలబడిన బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ పాత్రలాంటి ఫ్యాక్షన్ రోల్ లో కనిపించి ఫ్యాన్స్ ని మెప్పించిన బాలయ్య, ఇప్పుడు దసరాకి తెలంగాణ యాస మాట్లాడుతూ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కి, అక్టోబర్ 19న రిలీజ్ కానున్న భగవంత్ కేసరి సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, వినాయక చవితి స్పెషల్ సాంగ్ తో ‘భగవంత్ కేసరి’ ప్రమోషన్స్ ని మేకర్స్ గ్రాండ్ గా మొదలుపెట్టారు. అయితే టీజర్ లో నెలకొండ భగవంత్ కేసరి… అడవి బిడ్డా అని బాలయ్య డైలాగ్ హైప్ పెంచింది. ఈ హైప్ ని మ్యాచ్ చేసే ప్రమోషనల్ కంటెంట్ అనిల్ రావిపూడి నుంచి ఇంకా బయటకి రాలేదు. ఆ టీజర్ ఇచ్చిన జోష్ ని చిత్ర యూనిట్ కంటిన్యు చెయ్యడంలో కాస్త వెనుకబడ్డారు..
మోడీ వస్తున్నారు.. మహబూబ్ నగర్, నిజామాబాద్ లో పర్యటిస్తారు..
అక్టోబర్ 1న మహబూబ్ నగర్ కు, అక్టోబర్ 3న నిజామాబాద్ కు ప్రధాని మోడీ వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పలు రైల్వే అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో రైల్వేస్టేషన్ ల అభివృద్ది కోసం కేంద్రం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఎయిర్ పోర్టు మాదిరిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ ఏర్పడుతుందని తెలిపారు. నాంపల్లి స్టేషన్ అధినికరణ ప్రారంభం అయిందని అన్నారు. మోడీ ప్రధాని అయ్యాక రైల్వే రంగంలో అత్యాధునిక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. దేశంలో వందలాది రైల్వే స్టేషన్లు అభివృద్ధి జరుగుతున్నాయన్నారు. ఒకే రోజు తొమ్మిది రైళ్ళను ప్రధాని ప్రారంభిస్తున్నారని అన్నారు. రవాణా రంగంలో దేశీయ టెక్నాలజీతో ముందుకు పోతున్నామన్నారు. దేశీయ టెక్నాలిజీతో వందే భారత్ ట్రైన్ లను తయారు చేసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే రెండు వందే భారత్ ట్రైన్ లు నడుస్తున్నాయని, ఇది మూడోది అని తెలిపారు.
రాజకీయాల్లో ఇలాంటి పిరికిపందను ఇంత వరకు చూడలేదు
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టైయ్యాడు. చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబుని అరెస్ట్ చేసి సీఎం జగన్ రెడ్డి భయపడడం సిగ్గుచేటు.. చంద్రబాబుకి దేశ వ్యాప్తంగా వస్తున్న మద్దతు చూసి జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలయింది.. ఆ భయంతోనే ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీని పోలీసులు అడ్డుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో జగన్ లాంటి పిరికిపందను ఇంతవరకు చూడలేదు..
కార్ల ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులతో సామాన్య ప్రజల్ని ఇబ్బందులు పెడతారా? అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
యాదాద్రి కొండపై మరో అద్భుతం.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రూ. 7.70 కోట్లతో డిజైన్
వేల సంవత్సరాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా యాదాద్రి ఆలయాన్ని అత్యంత అద్భుతంగా పునర్నిర్మించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నాటి వైభవాన్ని చెక్కుచెదరకుండా, ఆధునిక పరిజ్ఞానాన్ని మేళవించి యాదాద్రి ఆలయాన్ని ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా నిర్మించారు. యాదాద్రి దేవాలయం ఇప్పటి వరకు ఏ దేవాలయంలా కాకుండా పూర్తిగా నల్లరాతి కృష్ణ శిలలతో నిర్మించబడిన ఏకైక ఆలయం. యాదాద్రి కొండపై ఉన్న ప్రతి కట్టడం ఆధ్యాత్మిక ప్రోత్సాహం కోసం పునరుద్ధరించబడింది. ప్రధాన ఆలయం, ప్రాకారాల నిర్మాణాలు పూర్తి కాగా, మరికొన్ని భవనాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. కొండపై తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన హరిత హోటల్ ను నిర్మిస్తున్నారు.
శాంసన్‌కు అవకాశాలు రావడం లేదనడం సరికాదు.. సమయం ఎవరి కోసం ఆగదు!
ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించినప్పటి నుంచి క్రికెట్ వర్గాల్లో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. 15 మందితో కూడిన ప్రపంచకప్ జట్టులో శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంతో.. సంజూ అభిమానుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫాన్స్ శాంసన్‌పై సానుభూతి వ్యక్తం చేస్తూ.. నెట్టింట పోస్టులు పెడుతున్నారు. తాజాగా దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు, కేరళ పేసర్ ఎస్ శ్రీశాంత్ స్పందించాడు. శాంసన్‌ను ప్రపంచకప్‌కి ఎంపికచేయకపోవడం బహుశా సరైన నిర్ణయమే అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. సంజూకు అవకాశాలు రావడం లేదనడం సరికాదన్నాడు.
సునీల్ గవాస్కర్, హర్షా బోగ్లే, రవిశాస్త్రి సహా ప్రతిఒక్కరూ సంజూ శాంసన్‌ను మంచి ఆటగాడిగా గుర్తించారని శ్రీశాంత్ తెలిపాడు. సంజూ సామర్థ్యంపై ఎలాంటి అనుమానం అవసరం లేదన్నాడు. పిచ్‌కి అనుగుణంగా ఆడాలని ఎవరైనా సూచిస్తే సంజూ వినడని, ఆ వైఖరిని అతడు మార్చుకోవాలని శ్రీశాంత్ సూచించాడు. ‘నాతో సహా ప్రతిఒక్క మళయాళీ సంజూ శాంసన్‌కు అవకాశాలు రావడం లేదని అంటున్నాం. అయితే అలా అనడం ఏమాత్రం సరికాదు. ఐర్లాండ్, శ్రీలంకపై సంజూకు మంచి అవకాశం వచ్చింది’ అని శ్రీశాంత్ అన్నాడు.
అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం.. గ్రూప్ -1 ఇష్యూ పై కిషన్ రెడ్డి సీరియస్
అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని, గ్రూప్ -1 ఇష్యూపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. అప్పులు చేసి నిరుద్యోగులు కోచింగ్ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి సారి గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ అయ్యి, అభ్యర్థులు అగమయ్యారని మండిపడ్డారు. నిన్న హై కోర్టు మళ్ళీ పరీక్ష ను రద్దు చేసిందన్నారు. దీనికి సీఎం కేసిఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేసిఆర్ ప్రభుత్వం నరక కూపంగా మారిందన్నారు. కేసిఆర్ తీరు వల్ల నిరుద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. అభ్యర్థుల జీవితాలతో కేసిఆర్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. పరీక్షలు నిర్వహించలేని స్థితిలో కేసిఆర్ ప్రభుత్వం ఉందన్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్ లలో జరిగే కార్యక్రమంలో మోడీ పాల్గొంటారని తెలిపారు. హైదరబాద్ లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన, ప్రారంభం చేస్తారని అన్నారు. సివిల్ ఏవియేషన్ రిసెర్చ్ సెంటర్ ను మోడీ ప్రారంభిస్తారని అన్నారు. Tspsc వైఫల్యానికి నైతిక బాధ్యత కేసీఆర్ వహించాలని డిమాండ్ చేశారు.
తల్లితో కొడుకు ప్రాంక్.. హార్ట్ టచింగ్ వీడియో వైరల్..
తల్లి, బిడ్డల అనుభందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆ బంధానికి పేరు, సరి తూగె ప్రేమ మరొకటి లేదు.. ఎక్కడ.. ఎంత మందిలో ఉన్నా కూడా తన కొడుకును తల్లి గుర్తు పడుతుంది.. తన పిల్లల విషయంలో చాలా నిస్వార్ధంగా ఉంటుంది. వారి కోసం ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధమవుతుంది.. పిల్లలకు మంచి జీవితం అందించడానికి పొద్దున లేచిన సమయం నుంచి రాత్రి పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటుంది. అందుకే తల్లిని మించిన దైవం మరొకటి ఉండదని కూడా అంటుంటారు.
ఎప్పుడూ పిల్లల తిన్నారా, మంచిగున్నారా, పడుకున్నారా అనేవే తల్లికి ముఖ్యం. అలా ఆలోచించే తల్లి తమ బిడ్డ చదువుల కోసమో లేదా ఉద్యోగం కోసమో విదేశాలకు వెళ్ళినప్పుడు ఎంతగా అల్లాడిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఓ కొడుకు తన తల్లిని సడెన్ గా సర్ప్రైజ్ చెయ్యాలని అనుకున్నాడు.. తల్లి తనను గుర్తుపట్టకుండా కర్చీఫ్ పెట్టుకొని వెళ్లాడు.. ఆ తల్లి చేపలు అమ్ముతుండగా ఆమె వద్దకు వెళ్లి బేరం ఆడాడు. అయితే రెండు నిమిషాల్లోనే ఆ అమ్మ బేరం ఆడేది తన కుమారుడేనని గుర్తించింది. ఆ తర్వాత బాగా ఎమోషనల్ అయ్యి ఆనంద భాష్పాలు కార్చింది… అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
వాహనాల తనిఖీలు ముమ్మరం.. ఆంధ్ర చెక్ పోస్టులో అలర్ట్
టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఛలో రాజమండ్రికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా సంఘీభావ ర్యాలీని విఫలం చేసేందుకు పోలీసు వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రాంతం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఛలో రాజమండ్రి అంటూ పిలుపు నివ్వడంతో పోలీసు వర్గాలు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే అన్ని రోడ్లన్నీ పోలీసులు దిగ్బంధనం చేశారు. తిరువూరు, జంగారెడ్డి గూడెం కూనవరం వెళ్లే రోడ్లపై పోలీసులు భారీ భారీగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అశ్వరావుపేట నుంచి రాజమండ్రి, భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్లే ప్రధానమైన రహదారులపై బారి కెడ్ల ను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఈ మధ్యాహ్నం ర్యాలీ నిర్వహిస్తామని సోషల్ మీడియా లో చంద్రబాబు అభిమానులు ప్రకటన జారీ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
నిజ్జర్ హత్యపై కెనడాకు నిఘా సమాచారం అందించిన అమెరికా..
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తలకు దారి తీసింది. కెనడాలోని సర్రేలో జూన్ నెలలో నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తుల కాల్చి చంపారు. అయితే ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం, భారత్ దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడం ఒక్కసారిగా సమస్య తీవ్రతను పెంచింది. ఇటు భారత్ కూడా కెనడియన్ దౌత్యవేత్తను ఇండియా వదిలి వెళ్లాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే నిజ్జర్ హత్యపై కెనడాకు అమెరికా నిఘా సమాచారం అందించిందనే కథనాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. ఈ సమాచారంతోనే కెనడా, ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని ఆరోపించిందని నివేదించింది. ఈ సమాచారాన్ని ‘ఫైవ్ ఐస్’ దేశాల మధ్య సమాచార మార్పిడి ఉందని కెనడాలోని యూఎస్ అగ్ర దౌత్యవేత్త ధృవీకరించడంతో శనివారం ఈ నివేదిక వచ్చింది. ఈ సమాచారమే జస్టిన్ ట్రూడో భారత్ పై ఆరోపణలు చేయడానికి కారణమైంది.
బెంగళూరులో ఓ వ్యక్తిపై 70సార్లు కత్తిపోట్లు.. మృతి
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత ఎంకే అళగిరి సహాయకుడిపై బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆయన మృతి చెందారు. ఈ దాడి ఘటన సెప్టెంబర్ 5న జరిగింది. దాడి చేసిన అనంతరం బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా.. మృతి చెందాడు. మృతుడు వీకే గురుస్వామి మూర్తిగా(64) గుర్తించారు. అతను తమిళనాడులోని మధురైకి చెందిన గ్యాంగ్‌స్టర్ గా చెబుతున్నారు. ఓ ప్రాపర్టీ విషయంలో బ్రోకర్‌ను కలిసేందుకు బెంగళూరుకు వచ్చిన అతడు ఓ రెస్టారెంట్‌లో కూర్చుని మాట్లాడుతుండగా దుండగులు హత్యకు పాల్పడ్డారు.
మరో 9 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని.. తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
దేశవ్యాప్తంగా మరో 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్రమోడీ 11 రాష్ట్రాలకు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 9 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఈ రాష్ట్రాల్లోని మతపరమైన, పర్యాటక ప్రాంతాలను ఈ రైళ్లు కలుపుతాయి. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రయాణికులు మరింత వేగంగా గమ్యస్థానాలకు చేరేందుకు కొత్తగా ప్రారంభించే వందేభారత్ రైళ్లు సహాయపడనున్నాయి.
యూపీలో 15 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. అనంతరం హత్య
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాలుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కిడ్నాపర్లు అతన్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత బాలుడి పేరెంట్స్ కు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తుండగా.. తమను పట్టుకుంటారనే భయంతో ఆ బాలుడిని చంపి మృతదేహాన్ని అడవిలో పడేశారు.
“ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్” ప్రపంచ వాణిజ్యానికి కీలకం..
దీనిని చరిత్ర గుర్తుంచుకుంటుందని అన్నారు. మన్ కీ బాత్ లో మాట్లాడిన ప్రధాని పురాతన కాలంలో భారత్ వాణిజ్య శక్తిగా ఉన్న సమయంలోని ‘సిల్క్ రూట్’ వాణిజ్య కారిడార్‌ని గుర్తు చేశారు. ఇండియానే ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ని ఇటీవల జరిగిన జీ20 సదస్సులో సూచించిందని ప్రధాని అన్నారు. చంద్రయాన్-3 విజయం తర్వాత జరిగిన జీ20 సదస్సు ప్రతీ భారతీయుడి ఆనందాన్ని రెట్టింపు చేసిందని ఆయన పేర్కొన్నారు.
జీ20లో ఆఫ్రికా యూనియన్ సభ్యదేశంగా చేరడంతో భారతదేశ నాయకత్వాన్ని ప్రపంచం గుర్తించిందని ప్రధాని మోడీ అన్నారు. జీ20కి వేదికైన భారత మండపం సెలబ్రెటీగా మారిందని, ప్రతీ ఒక్కరు అత్యాధునిక కాన్ఫరెన్స్ హాలులో సెల్పీలు తీసుకున్నారని ప్రధాని తెలిపారు. సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటన దినోత్సవం వస్తుందని.. టూరిజంలో కనీస పెట్టుబడితో గరిష్ట ఉపాధిని సృష్టించవచ్చని తెలిపారు.
దెబ్బ అదుర్స్.. 19 మంది ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఆస్తులు స్వాధీనం..
కెనడా, పాకిస్తాన్, యూకే, అమెరికాల్లో ఉంటూ ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడమే కాకుండా, పంజాబ్ రాష్ట్రంలో నేరాలకు పాల్పడుతున్న ఖలిస్తానీ ఉగ్రవాదుల అణిచివేత ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. కెనడా-ఇండియాల మధ్య ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య దౌత్య వివాదానికి కారణమైంది, ఇదే సమయంలో దేశం నుంచి పారిపోయిన ఖలిస్తానీ ఉగ్రవాదులు, వేర్పాటువాదులపై భారత ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది.
ఇప్పటికే యూఎస్ఏలో ఉంటున్న ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ కు సంబంధించి పంజాబ్ లో ఉన్న అతడి ఆస్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత అంటే ఈ రోజు ఎన్ఐఏ యూకే, అమెరికా, కెనడా, దుబాయ్ లో ఉంటున్న 19 మంది ఖలిస్తానీ ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేసింది. భద్రతా సంస్థలు వీరిని ఏళ్ల తరబడి వెంబడిస్తూ ఉన్నాయి. వీరిపై కఠినమైన యూఏపీఏ చట్టం కింద చర్యలు తీసుకుంటోంది.