రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ విభజన సరిగ్గా జరుగలేదని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు.. చారిత్రక వాస్తవాల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమేనంటూ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన కోసం ఆరు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పోరాడారు.. జూన్ 2, 2014న రాష్ట్ర అవతరణ కల సాకారం చేసుకున్నారు అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే, అంతకు ముందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఏపీ, తెలంగాణ విభజనపై వ్యాఖ్యనించారు. యూపీఏ హయాంలో ఈ పార్లమెంట్ లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని.. అయితే ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మాదిరిగా ఏపీ, తెలంగాణ విభజన సరిగ్గా జరుగలేదని ఆయన కోనియాడారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు మూడు రాష్ట్రాల విభజన ఎంతో ప్రణాళికా బద్ధంగా చేశారని మోడీ తెలిపారు. ఆ మూడు రాష్ట్రాల విభజన టైంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయన్నారు. ఏపీ, తెలంగాణ విభజన టైంలో ఎక్కడా సంబరాలు జరుగలేదు అని ప్రధాని మోడీ అన్నారు. స్వార్థ రాజకీయాల కోసమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను హడావుడిగా విభజించారన్నారు. అత్యంత దారుణంగా ఏపీని విభజించారన్నారు. మైకులు ఆపేసి, పెప్పర్ స్ప్రే జల్లి అత్యంత సిగ్గుచేటుగా చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారు.. అయినా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో సెలబ్రేషన్స్ జరుగలేదు.. విభజన అంశంలో ఎలాంటి చర్చ జరపకుండానే ఏపీ, తెలంగాణ విభజన చేసి కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకుందని ప్రధాని మోడీ ఆరోపించారు. ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ చాలా కీలకం.. అలాంటి వ్యవహారాన్ని తూతు మాత్రంగా చేశారన్నారు.
జైలులో చంద్రబాబు హ్యాపీగా లేరు..! అదిమాత్రం అధికారులు కుదరదు అంటున్నారు..
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హ్యాపీగా లేరంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు.. జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు జైల్లో హ్యాపీగా లేరని అన్నారు. చంద్రబాబు గదిలో ఏసీ లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏసీ ఏర్పాటు చేయాల్సిందిగా జైలు అధికారులను అడిగాం.. నిబంధనల ప్రకారం ఏసీ సౌకర్యం కుదరదని అధికారులు అంటున్నారని వివరించారు. ఇక, రిమాండ్‌కు వెళ్లిన ముందు మూడు రోజులు దోమలతో ఇబ్బంది పడ్డారు, తర్వాత దోమతెరలు ఇచ్చారని తెలియజేశారు.. అయితే, తన సౌకర్యాలు కంటే కార్యకర్తలు, ప్రజల గురించి ఎక్కువగా చంద్రబాబు ఆలోచిస్తున్నారని అని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు.
విశాఖలో కొలువుదీరిన భారీ గణపయ్య.. 117 అడుగుల ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు
సాగర నగరం విశాఖలో వినాయక చవితి శోభ సంతరించుకుంది.. దేశంలో ఎన్ని వినాయక పూజలు జరుగుతున్న ఇప్పుడు అందరి చూపు విశాఖ వైపే ఉంది.. కారణం పూర్తి మట్టితో చేసిన 117 అడుగుల భారీ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు.. అద్భుతమైన రూపంతో భక్తులకు దివ్యదర్శనం ఇస్తున్నాడు.. గాజువాక లంకా మైదానంలో ఈసారి అనంత పంచముఖ మహాగణపతి విగ్రహాన్ని తీర్చిదిద్దారు.. తెలంగాణకు చెందిన ప్రసిద్ధ కళాకారుడు కొత్తకొండ నగేష్ పర్యవేక్షణలో పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 26 మంది కళాకారులు ఈ విగ్రహన్ని తయారీ చేశారు.. 117 అడుగుల ఎత్తయిన వినాయక విగ్రహం తయారీ కోసం 120 అడుగుల ఎత్తు, 39 అడుగుల వెడల్పుతో మండపాన్ని రూపొందించారు. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా దీన్ని రూపొందించినట్టు ఉత్సవ నిర్వాహకుడు గణేష్ తెలిపారు. విగ్రహ తయారీ కోసం గడ్డి, చెరువు మట్టి, కోల్‌కతా నుంచి గంగానది మట్టిని ఉపయోగించారు. గణపతి విగ్రహానికి ఆనుకుని 35 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తయిన అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని రూపొందించారు. అనకాపల్లికి చెందిన ఆరిపాక కృష్ణ ఈ విగ్రహాన్ని తయారు చేశారు. మండపంలోకి వెళ్లగానే తొలుత అందరికీ కనిపించే విధంగా సింహాద్రి అప్పన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మండపం వద్ద యాగశాల నిర్మించారు. ఈసారి రికార్డు సాధించడం కోసం లక్ష మంది భక్తులతో వినాయక కోటి నామాల పుస్తకాలు రాయిస్తున్నారు. ఈ పుస్తకాలను కాణిపాకం వినాయక ఆలయానికి అప్పగిస్తామని నిర్వహకులు అంటున్నారు.. ఈ విగ్రహాల తయారీకి 8 టన్నుల మట్టి, 5 టన్నుల వెదురు, 20 టన్నుల ఐరన్ ఉపయోగించినట్టు తెలిపారు.
ములాఖత్‌లో చంద్రబాబుతో భేటీ.. ఆసక్తికరమైన చర్చ..!
ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. ఈ రోజు ములాఖత్ లో నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు మాజీ మంత్రి, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చంద్రబాబును కలిశారు.. సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో మాట్లాడారు.. అయితే, చంద్రబాబుతో భేటీ సందర్భంగా జనసేనతో పొత్తు అంశం ప్రస్తావన వచ్చిందట.. పార్టీ తరఫున సమన్వయ కమిటీ సభ్యుల నియామకం అంశం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేరట యనమల.. అయితే, లోకేష్ ఢిల్లీ నుంచి రాగానే చర్చించి త్వరగానే సభ్యులను నియమిద్దామన్న చంద్రబాబు చెప్పారట.. ఇప్పటికే తెలుగుదేశం – జనసేన శ్రేణులు దేశవిదేశాల్లో కలిసి కార్యక్రమాలు చేస్తున్న తీరు బాబుకు వివరించారు యనమల.. తనను జైల్లో పెట్టి జగన్ పొందుతోంది తాత్కాలిక ఆనందమేనని ఇక వైసీపీ పనైపోయిందన్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారట. మరోవైపు.. భువనేశ్వరి, బ్రాహ్మణిలతో దాదాపు 20 నిమిషాలు విడిగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారట చంద్రబాబు.. ఇదే సమయంలో యనమలతో ప్రత్యేకంగా 10 నిమిషాలు విడిగా సమావేశమయ్యారట.. మొత్తంగా ములాఖత్‌లో చంద్రబాబు.. ముగ్గురూ 40 నిమిషాల పాటు చర్చించారు.. చంద్రబాబును ఎలా ఉన్నారంటూ యనమల అడగగా.. నేను బానే ఉన్నా, క్యాడర్ ని, నేతల్ని ప్రభుత్వం కక్షతో వేధించటమే బాధగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారట.. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తెలుగుదేశం శ్రేణులకు పార్టీ అండగా నిలవాలని యనమలకు సూచించారట.. రాష్ట్రం కోసం, ప్రజల కోసం తాను ఎన్ని ఇబ్బందులైనా తట్టుకోగలనని.. కానీ, ప్రభుత్వ అరాచకాలపై పోరాటం ఆపొద్దని చంద్రబాబు స్పష్టం చేశారట..
బీజేపీతో పొత్తు లేదు.. అన్నాడీఎంకే నేత కీలక వ్యాఖ్యలు
బీజేపీ ఎలాంటి పొత్తు లేదని, ఎన్నికల సమయంలోనే ఎన్నికల పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని ద్రవిడ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పడంతో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య విభేదాలు సోమవారం తారాస్థాయికి చేరుకున్నాయి. ద్రవిడ మహానాయకుడు సీఎన్ అన్నాదురైపై చేసిన విమర్శలకు బీజెపి రాష్ట్ర చీఫ్ కె.అన్నామలైపై ఏఐఏడీఎంకే సీనియర్ నాయకుడు డి.జయకుమార్ విరుచుకుపడ్డారు, దివంగత ముఖ్యమంత్రిని అవమానిస్తే తమ పార్టీ కార్యకర్తలు సహించరని అన్నారు. దివంగత జయలలిత సహా ఏఐఏడీఎంకే నేతలపై అన్నామలై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయగా, బీజేపీ నేతను అదుపులో ఉంచుకోవాలని పార్టీ కోరిందని ఆయన అన్నారు. “అన్నామలై అన్నామలై ఏఐఏడీఎంకేతో పొత్తు కోరుకోవడం లేదు. బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నప్పటికీ.. మా నేతలపై చేస్తున్న ఈ విమర్శలన్నీ మేం సహించాలా.. మేం మిమ్మల్ని ఎందుకు మోయాలి.. బీజేపీ ఇక్కడ అడుగు పెట్టదు.. మీ ఓటు బ్యాంకు తెలుసు.” అని మాజీ మంత్రి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, దాని రాష్ట్ర శాఖ అధ్యక్షుడిపై విరుచుకుపడ్డారు.
ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో భూకంపం.. పరుగులు తీసిన జనం
ఇటలీలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వాల్కనాలజీ ప్రకారం, దాని భూకంప కేంద్రం ఫ్లోరెన్స్‌కు ఈశాన్యమైన మరాడి సమీపంలో ఉందని నివేదించింది. సోమవారం తెల్లవారుజామున ఫ్లోరెన్స్, టుస్కానీలో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని భూగర్భ శాస్త్రవేత్తలు,అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా జరిగిన ఆస్తి నష్టం, గాయాల గురించి తక్షణ నివేదికలు లేవు. ఈ భూకంపం ఉదయం 5.10 గంటలకు సంభవించించింది. తర్వాత మరికొన్ని చిన్నపాటి ప్రకంపనలు వచ్చాయి. ఆందోళన చెందిన నివాసితుల నుంచి తమకు కొన్ని కాల్స్ వచ్చాయని, అయితే ఇప్పటివరకు నష్టం లేదా గాయాల గురించి ఎటువంటి నివేదికలు లేవని ఇటలీ అగ్నిమాపక బృందం తెలిపింది. ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఏజెన్సీ పేర్కొంది. ముఖ్యంగా, 1919 నాటి ముగెల్లో భూకంపం 20వ శతాబ్దంలో ఇటలీని తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఒకటిగా పేర్కొనబడింది.
కోహ్లీ ఎలా నడుస్తాడో చూపించిన ఇషాన్ కిషన్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు
ఆసియా కప్ 2023 ఫైనల్ లో శ్రీలంకను భారత్ చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. శ్రీలంక జట్టు 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 51 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన.. టీమిండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 6.1 ఓవర్లలోనే టార్గెట్ ను చేధించి.. 8వ సారి ఆసియా కప్ టైటిల్ ను ముద్దాడారు. అయితే మ్యాచ్ అనంతరం టైటిల్ ప్రజేంటేషన్ వేళ.. ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కింగ్ కోహ్లీ వాకింగ్ స్టైల్ ను యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఎలా నడుస్తాడో నడిచి చూపించాడు. ఈ వీడియోను చూస్తే.. మీరు నవ్వు ఆపుకోలేరు. ఆ వీడియోలో ఇషాన్ కిషన్ అచ్చం కోహ్లీలానే నడిచాడు. అక్కడే ఉన్న ఇతర క్రికెటర్లు ఇషాన్ కిషన్ నడిచే విధానాన్ని చూసి పడీ పడీ నవ్వారు. అయితే కోహ్లీ మాత్రం “నా నడక అలా ఉండదు” అంటూ ఇషాన్ కిషన్ కు చెప్పగా.. మరోసారి కోహ్లీలా నడిచి చూపించాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ ఏ జెంట్లకు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ఏజెంట్లు మరియు ఉద్యోగుల ప్రయోజనం కోసం గ్రాట్యుటీ పరిమితి మరియు కుటుంబ పెన్షన్‌ల పెంపుతో సహా అనేక సంక్షేమ చర్యలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. సంక్షేమ చర్యలు ఎల్‌ఐసీ నిబంధనలు 2017, గ్రాట్యుటీ పరిమితి పెంపుదల మరియు కుటుంబ పెన్షన్ యొక్క ఏకరీతి రేటుకు సంబంధించిన సవరణలకు సంబంధించినవి అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వివరాల ప్రకారం.. ఎల్‌ఐసీ ఏజెంట్లకు పని పరిస్థితులు మరియు ప్రయోజనాలకు గణనీయమైన మెరుగుదలలు తీసుకురావాలనే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ గ్రాట్యుటీ పరిమితిని రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచింది.. అయితే, ప్రస్తుతం, ఎల్‌ఐసీ ఏజెంట్లు పాత ఏజెన్సీ కింద పూర్తి చేసిన ఏ వ్యాపారంపైనా పునరుద్ధరణ కమీషన్‌కు అర్హులు కాదు. ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ ప్రస్తుతం ఉన్న రూ. 3,000-10,000 నుండి రూ. 25,000-1,50,000కి విస్తరించబడింది, టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఈ పెంపుదల మరణించిన ఏజెంట్ల కుటుంబాలకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొంది కేంద్రం.. ఎల్‌ఐసీ ఉద్యోగులకు సంబంధించి, కుటుంబాల సంక్షేమం కోసం 30 శాతం చొప్పున కుటుంబ పెన్షన్‌ను మంత్రిత్వ శాఖ ఆమోదించింది. 13 లక్షలకు పైగా ఏజెంట్లు మరియు 1 లక్ష మందికి పైగా రెగ్యులర్ ఉద్యోగులు, ఎల్‌ఐసీ వృద్ధిలో మరియు భారతదేశంలో బీమా విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సంక్షేమ చర్యల ద్వారా ప్రయోజనం పొందుతారని పేర్కొంది. కాగా, రూ. 5 కోట్ల ప్రారంభ మూలధనంతో 1956లో స్థాపించబడిన ఎల్‌ఐసీ.. మార్చి 31, 2023 నాటికి రూ. 40.81 లక్షల కోట్ల జీవిత నిధితో రూ. 45.50 లక్షల కోట్ల ఆస్తిని కలిగి ఉంది. గణనీయమైన వృద్ధిని సాధించింది.
లంగావోణిలో ఎంత అందంగా ఉన్నావ్ శ్రీముఖి..అలా నవ్వితే పడిపోతారంతే…
వినాయక చవితి సందర్బంగా ట్రెడిషినల్ గా రెడీ అయ్యింది శ్రీముఖి. లంగా హోణిలో తలుక్కుమంది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.. బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి వరుస టీవీ షోలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకుంటోంది. స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూ తన అభిమానులు, ఆడియెన్స్ ను ఖుషీ చేస్తోంది.. ఇక శ్రీముఖి బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో నెట్టింట కూడా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ఇస్తూనే వస్తోంది. మరీ ముఖ్యంగా ప్రత్యేకమైన రోజు, పండగ వేళల్లో మరింత అందంగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది.. ఎప్పుడూ హాట్ గా రెడీ అయ్యిఘాటు పోజులుస్తున్న శ్రీముఖి కాస్త ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరిని షాక్ కు గురి చేసింది.. తాజాగా పంచుకున్న ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. పట్టుపరికిణీతో పాటు ఆకర్షణీయమైన జ్యూయెల్లరీ ధరించడంతో మరింత అందాన్ని సొంతం చేసుకుంది.. అంతేకాదు తన అభిమానులకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపింది. అటు ఫ్యాన్స్, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు..టీవీ షోలతో బుల్లితెరపై సందడి చేస్తూనే అటు నటిగానూ పలు చిత్రాల్లో అలరిస్తోంది. గతంలో చాలా చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది.. మరో కొత్త సినిమాలో నటిస్తోంది.. దాని గురించి ఇంక ప్రకటించలేదు..
అలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిరూ మూవీ..?
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభం లోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ సినిమాలో నటించాడు. భోళా శంకర్ సినిమా మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ ను అందుకుంది. భోళా శంకర్ సినిమా భారీగా నష్టాలు తెచ్చి పెట్టింది .చిరు కెరీర్‌లో ఆచార్యకు మించిన ఫ్లాప్ మరోటి రాదులే అనుకుంటున్న ఫ్యాన్స్‌కు దానికి మించి ఫ్లాప్‌గా భోళాశంకర్ నిలిచింది. ప్రస్తుతం చిరు ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.. దాని కోసం చిరు బాగా ఆలోచించి బింబిసార దర్శకుడిని రంగంలోకి దింపాడు. బింబిసార తర్వాత దాని సీక్వెల్‌ను తెరకెక్కించాలని ముందుగా ప్లాన్ చేసుకున్న వశిష్ట అనుకోని విధంగా చిరు సినిమా ఆఫర్ అందుకున్నారు.చిరూ బర్త్డే కానుక గా రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను తెగ వైరల్ అవుతుంది.. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. కాగా ఈ సినిమా కథ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందని సమాచారం.. అంతేకాకుండా ఈ సినిమాలో దాదాపు నలుగురు హీరోయిన్‌లు తీసుకోనున్నారట.అందులో అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకంటున్న ఈ సినిమా ఇదే ఏడాది చివరి లో షూటింగ్ మొదలు పెట్టనుందని సమాచారం.యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందించనున్నాడు. దాదాపు మూడు శతాబ్దాల తర్వాత చిరూ, కీరవాణి కాంబోలో సినిమా వస్తుంది. ఇక ఈ సినిమా కంటే ముందుగా చిరు కళ్యాణ్ కృష్ణ కురసాలతో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిపోయినట్లు సమాచారం. చిరు పెద్ద కుమార్తే సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తుంది.మెగాస్టార్ 156 సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
హీరో సుశాంత్, తల్లిపై పోలీసు కేసు.. అసలు ఏమైందంటే?
ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున సోదరి, సినీ హీరో సుశాంత్ తల్లి, సినీ నిర్మాత నాగ సుశీల పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నాగ సుశీల, మరో 12 మందితో కలిసి తనపై దాడి చేశారని చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం. నాగ సుశీల, శ్రీనివాస్‌ల మధ్య కొంతకాలంగా భూవివాదం సాగుతుందని, వీరు గతంలో వ్యాపార భాగస్వామ్యులుగా ఉన్నారని చెబుతున్నారు. నాగసుశీల, శ్రీనివాస్ కొన్నేళ్ల నుంచి వివిధ వ్యాపారాల్లో పార్టనర్స్‌గా ఉండి ఓ సినిమా బ్యానర్ ను కూడా స్థాపించారు. శ్రీ నాగ్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను స్థాపించి వీరు కొన్ని సినిమాలు చేశారు. సుశాంత్ హీరోగా మూడు సినిమాలు చేయగా ఆ సినిమాల్లో ‘కరెంట్’ హిట్ అయినప్పటికీ ఆ తరవాత వచ్చిన అడ్డా, ఆటాడుకుందాం రా కూడా అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసిన క్రమంలో మనస్పర్థలు ఏర్పడి దూరం కూడా పెరిగింది. ప్రస్తుతం చింతలపూడి శ్రీనివాస్ శ్రీజ ప్రకృతి దర్శపీఠం నిర్వాహకుడిగా ఉండగా ఈ నెల 12న నాగసుశీల, ఆమె అనుచరులు దాడికి పాల్పడినట్టుగా కేసు నమోదు చేశారు. నిజానికి 2017 లో తన అనుమతి లేకుండా భూములు అమ్మాడని ఆరోపిస్తూ చింతలపూడి శ్రీనివాస్‌పై నాగ సుశీల పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా తనను లాకప్‌లో పెట్టి తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకునేందుకే తనపై నాగ సుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ అప్పట్లో ఆరోపించారు. ఇక ఇప్పుడు సుశీల మీద కేసు నమోదైన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది తెలియాల్సి ఉంది.