చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దు..
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులు కలుస్తారని ముందుగా వార్తలు వచ్చాయి.. చంద్రబాబుతో ముగ్గురు కుటుంబ సభ్యులు ములాఖత్ అవుతారని.. నారా భువనేశ్వరితో పాటు లోకేష్, బ్రాహ్మణిల ములాఖత్‌లో చంద్రబాబును కలుస్తారని ముందుగా చెప్పారు.. అయితే, తాజా సమాచారం ప్రకారం.. చంద్రబాబుతో ఈ రోజు కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దు అయ్యింది.. రేపు అనగా మంగళవారం రోజు చంద్రబాబుని ఆయన కుటుంబ సభ్యులు కలుస్తారని తెలుస్తోంది.. అయితే, రాజమండ్రికి చేరుకుంది నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర బస్సు.. బస్సులోనే అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. చంద్రబాబు అరెస్టు తర్వాత జరుగుతున్న పరిణామాలపై నేతలతో చర్చిస్తున్నారు లోకేష్.. ఇక, భువనేశ్వరి, బ్రహ్మిణి రాకపై తమకు సమాచారం లేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతుండగా.. ములాఖత్ అనుమతులు అడిగిన తర్వాత తమకు సమాచారం లేదంటున్నారు జైలు అధికారులు..
చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్ర..!
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్.. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వ కుట్ర ఉందని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అనుమానాలు వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికైన చంద్రబాబు కళ్లు తెరుచుకోవాలని సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వంలోని ఏ ఒక్కరూ చంద్రబాబు అరెస్టును ఖండించకపోవడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు హర్షకుమార్.. ఇప్పటికైనా టీడీపీ, జనసేన పార్టీలు.. ఎన్నికల్లో ఎన్డీఏను వదిలి బయటకు రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ, జనసేన పిలుపు మేరకు చేపట్టిన బంద్ కు సంపూర్ణ మద్దతు తెలియజేశారు మాజీ ఎంపీ హర్షకుమార్.
ఇంట్లో ఉండటం కంటే సెంట్రల్ జైలే చంద్రబాబుకు సేఫ్..! కోర్టులో వాదనలు
చంద్రబాబు ఇంట్లో ఉండటం కంటే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండడమే సేఫ్ అంటూ ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు సీఐడీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులుఏజీ శ్రీరామ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, స్పెషల్ జీపీ వివేకానంద.. సెంట్రల్ జైలులో చంద్రబాబు భద్రత కోసం తీసుకున్న చర్యలకు సంబంధించి అడ్వకేట్ జనరల్ కు లేఖ రాశారు హోం సెక్రటరీ.. ఆ లేఖను కోర్టుకు సమర్పించారు ఏజీ శ్రీరాం.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వాడివేడిగా వాదనలు సాగాయి.. చంద్రబాబును హౌస్ కస్టడీ ఇవ్వాలన్న పిటిషన్లపై లోధ్రా.. పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు పూర్తి ఆరోగ్యంగా.. పూర్తి భద్రత నడుమన ఉన్నారని కోర్టుకు తెలిపారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. ఇంట్లో ఉండటం కంటే సెంట్రల్ జైలులో ఉండటం చంద్రబాబుకు సేఫ్ అన్న ఆయన.. సుప్రీం కోర్టు ఇచ్చిన కేసు తీర్పును చంద్రబాబు కేసుకు ముడి పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. వీఐపీ ముద్దాయికి కల్పించే అన్ని వసతులు జైల్లో కల్పించాం. చంద్రబాబుకు జైల్లో పూర్తిగా సెక్యూరిటీ కల్పించాం.. జైలులో మాత్రమే కాదు.. జైలు పరిసర ప్రాంతాల్లో పోలీసులు సెక్యూరిటీ ఉంది.. 24 గంటలు పోలీసులు డ్యూటీలో ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరం అయుతే వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక, ఆర్థిక నేరాల్లో సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని.. అందుకే చంద్రబాబుకు హౌస్ అరెస్ట్‌కు అనుమతించవద్దని వాదనలు వినిపించారు..
చంద్రబాబుకి భయం అంటే ఏంటి? పతనం అంటే ఏంటో సీఎం జగన్ చూపించారు..!
చంద్రబాబుకి భయం అంటే ఏంటి? పతనం అంటే ఏంటి? అనేది సీఎం వైఎస్ జగన్ చూపించారని వ్యాఖ్యానించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు తప్పు చేయలేదు అని లాయర్లు, టీడీపీ నాయకులు మాట్లాడలేదు.. 24 గంటలు దాటాక కోర్టుకు ప్రవేశ పెట్టారు, గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు అని టెక్నికల్ పాయింట్స్ మాట్లాడారని దుయ్యబట్టారు.. ప్రభుత్వ కార్యక్రమాలకు కోర్టులో స్టే తెస్తే అది సక్రమం, చంద్రబాబును అరెస్ట్ చేస్తే అది అక్రమం అంటూ ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల బిల్లు, ఇంగ్లీష్ మీడియం, ఇళ్ల పట్టాలుపై స్టే తెచ్చారు.. ఇక, తనపై రాజశేఖర్ రెడ్డి 26 ఎంక్వైరీలు వేశారు.. కానీ, ఏమీ చేయలేదు అని చంద్రబాబు అనేక సందర్భాల్లో తెలిపారు.. కానీ, సీఎం జగన్ అధ్వర్యంలో చంద్రబాబు అవినీతి బయట పడిందన్నారు పెద్దిరెడ్డి.
అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని ఊహించలేం
అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని ఊహించలేమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. పర్యావరణ సమతుల్యత ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన వెంటనే కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని, ఇది గత దశాబ్దంలో గణనీయమైన పురోగతిని సాధించిందని ఆయన అన్నారు. సోమవారం అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి అందించిన సందేశంలో, రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ “తెలంగాణకు హరితహారం” అడవులను తిరిగి పెంచడం, రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడంలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని అన్నారు. ఇంకా, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చరల్ ప్రొడ్యూసర్స్ (AIPH/IAHP) హైదరాబాద్‌కు ప్రతిష్టాత్మకమైన “వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ – 2022″ని అందజేసింది, లేకుంటే పట్టణ కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరంలో గ్రీన్ కవర్‌ను మెరుగుపరిచినందుకు. అభివృద్ధి, సాంకేతికత అభివృద్ధి చెందినప్పటికీ పర్యావరణ పరిరక్షణ తెలంగాణకు ప్రాథమిక లక్ష్యం అని చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. తగినంత పర్యావరణ పరిరక్షణ చర్యల కారణంగా వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే ప్రపంచ సవాళ్లను ఆయన గుర్తించి, ప్రస్తుత, భవిష్యత్తు తరాల కోసం గ్రహాన్ని సంరక్షించే భాగస్వామ్య బాధ్యతను నొక్కి చెప్పారు.
తెలంగాణ ఉద్యమం పుట్టింది ఇల్లందు గడ్డపైనే…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. 2014, 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కి ఒకే ఒక్క సీటు వచ్చింది ఈసారి ఒక్క సీటు కూడా ప్రతిపక్షాలకు ఇవ్వొద్దని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం పుట్టింది ఇల్లందు గడ్డపైనేనని ఆయన అన్నారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ గెలుపు ఈ గడ్డపైనే మొదలవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పోరం కనకయ్య ఎమ్మెల్యేగా ఓడిపోయిన పార్టీ గౌరవించింది కానీ పార్టీ మారి ఇప్పటివరకు పార్టీకి రాజీనామా చేయలేదు మీకు నీతి ఉందా అని ఆయన మండిపడ్డారు. మీరు కొంతమంది ఆర్థిక వ్యక్తులతో తిరుగుతున్నారు కానీ కార్యకర్తలు మీతో రారని ఆయన అన్నారు. ఒకేసారి 115 మంది అభ్యర్థులని ప్రకటించిన ఘనత కేసీఆర్ కే దక్కిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 100 సీట్లు గెలిచి కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేస్తామని వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతునిద్దామని వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటు జరిగిన ఈ పదేళ్లలోనే దేశం మొత్తం మీద తెలంగాణను అన్ని రంగాలలో అగ్రగామిగా తీర్చిదిద్దిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు రవిచంద్ర.
గాంధీ కుటుంబం దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కృషి చేస్తుంది
గౌహతిలో నిర్వహించిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబం దేశాన్ని విచ్చిన్నం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తుందని విమర్శించారు. గాంధీ కుటుంబం ‘సర్దార్ ఆఫ్ డూప్లికేట్’ , అసలు కుంభకోణాలు మొదలైందే గాంధీ అనే బిరుదుతోనని కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ఢిల్లీలో G20 సమావేశానికి సభ్యత్వం వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంవత్సరాలు పరిపాలనలో ఉన్నా.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా స్వతంత్ర వేడుకలు జరపలేదన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను ఎంతో ఘనంగా జరిపారని తెలిపారు. ప్రతి ఒక్కరూ మనం భారతీయులమని దేశ రక్షణ మనభాద్యతని అందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు. ఢిల్లీ డిక్లరేషన్ సంపాదించారు. ఇప్పుడు భారత్ విశ్వగురువుగా మారిందని.. మహిళలే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని.. నారీ శక్తి, మహిళా సాధికారతపై ప్రధాని మోడీ ఎక్కువ దృష్టి సారించారని వెల్లడించారు. భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పరివర్తన పరంగా ఈశాన్య రాష్ట్రాలు మారాయని సూచించారు. మరోవైపు ఏ హిందువు కూడా కూలతత్వాన్ని సమర్ధించడని.. తమిళనాడు మంత్రి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని అస్సాం ముఖ్యమంత్రి మండిపడ్డారు.
సౌదీ యువరాజు, ప్రధాని మోడీ మధ్య ద్వైపాక్షిక చర్చలు.. కీలక ఒప్పందాలపై సంతకం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వీటితో పాటు పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరు నేతలు దృష్టి పెట్టారు. అంతేకాకుండా.. ఇండియా, సౌదీ అరేబియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ కౌన్సిల్ తొలి సమావేశం మినిట్స్‌పై ఇరువురు నేతలు సంతకాలు చేశారు. ద్వైపాక్షిక సమావేశంలో పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు కూడా జరిగాయి. 2019 ఫిబ్రవరి తర్వాత సౌదీ యువరాజు భారత్ లో పర్యటించడం ఇది రెండోసారి. జీ20 సదస్సు కోసం ఆయన సెప్టెంబర్ 8న ఢిల్లీకి వచ్చారు. మహ్మద్ బిన్ సల్మాన్ ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఉన్నారు. హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీతో సమావేశానికి ముందు.. సౌదీ అరేబియా యువరాజుకు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధికారికంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బిన్ సల్మాన్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్‌కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను G20 శిఖరాగ్ర సమావేశం నిర్వహించినందుకు భారతదేశాన్ని అభినందించాలనుకుంటున్నానని తెలిపారు. సదస్సులో చేసిన ప్రకటనల వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుందన్నారు. ఇరు దేశాలకు ఉజ్వల భవిష్యత్తును నిర్మించేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామని క్రౌన్ ప్రిన్స్ తెలిపారు.
నాలుగు రోజుల్లో 520 కోట్లు.. షారుఖ్ అంటార్రా బాబూ!
సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా భారతదేశంలో 7 సెప్టెంబర్ 2023న బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.21 కోట్లు వసూలు చేసి అద్భుతమైన స్పందనను అందుకుంది. షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనే నటించిన జవాన్ సినిమా మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్లు దాటగా నాలుగు రోజులకు గాను ఏకంగా 520 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద అన్ని భాషలు కలిపి రూ.75 కోట్ల వరకు వసూలు చేసింది. జవాన్ మొదటి మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచి భారతదేశంలో రూ. 206.06 కోట్లు వసూలు చేసింది.
రక్తమోడే ఫోటో షేర్ చేసిన నటి.. అసలు ఏమైంది?
2006 సంవత్సరంలో ‘ఆడపిల్ల’ సీరియల్‌తో బుల్లితెర నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన సమీరా షరీఫ్.. ఆ తర్వాత అభిషేకం, మూడు మూళ్ళ బంధం, ప్రతిబింబం, భార్యామణి, మంగమ్మ గారి మనవరాలు తదితర సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయింది. ఇక నాగబాబు ‘అదిరింది’ షోతో యాంకర్‌గా కూడా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది. అయితే పెళ్లి తర్వాత కెరీర్ పరంగా కాస్త స్లో అయిన సమీరా తనకు పిల్లలు పుట్టాక వారి ఆలనా పాలన మీదే దృష్టి పెట్టింది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫొటో షేర్ చేసింది. అందులో ఆమె పెదవి పగిలి రక్తం కారుతూ ఉండగా అనే లంజ సుదీర్ఘమైన నాట్ రాసుకొచ్చింది. ప్రతి కథకు ఒక్కొక్కరి అభిప్రాయం ఉంటుంది, ఇది నాది అంటూ మొదలు పెట్టిన ఆమె ఇది ఒక మెమరీలా ఉంటుందని తీసిన ఫోటో, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని అనుకోలేదు. కానీ నేను దీని గురించి మీ ఆలోచనలను తెలుసుకోవాలనుకున్నాను… మీరు ఈ ఫోటోను చూస్తున్నప్పుడు నేను సోదరీమణులు/స్నేహితులు/భర్తతో గట్టిగా గొడవపడినట్లు కనిపిస్తోంది.
రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మాస్ రాజా..
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు.1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ మూవీ భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మురళీశర్మ, రేణు దేశాయ్, గాయత్రీ భార్గవి వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాకు శ్రీకాంత్ వీస్సా డైలాగ్స్ అందిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ మూవీ రిలీజ్ విషయంలో వివాదం నెలకొంది.దీంతో మాస్ రాజా ఫ్యాన్స్ టైగర్ నాగేశ్వరావు రిలీజ్ డేట్ విషయంలో కాస్త సంధిగ్ధం లో వున్నారు.తాజాగా హీరో రవితేజ రిలీజ్ డేట్ పై క్లారిటీ ని ఇచ్చారు. తాను స్వయంగా నిర్మించి విడుదల చేస్తున్న చాంగురే బంగారు రాజా మూవీ ప్రీ రిలీజ్ కి రవితేజ అటెండ్ అయ్యారు. టైగర్ నాగేశ్వర రావు మూవీ ఫస్ట్ ఫిక్స్ అయిన అక్టోబర్ 20 కే థియేటర్స్ కి రానుందనే విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ మూవీ దసరా బరిలో నే ఉందని రవితేజ కన్ఫర్మ్ చేశారు.