విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో నేడు నాలుగు జట్లు పోటీ పడనున్నాయి. గుజరాత్ జాయింట్స్ వర్సెస్ యూపీ వారియర్స్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అలాగే.. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. WPL టోర్నీలో పాయింట్ల పట్టికలో మొదటి నుంచీ ముంబై జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికీ ఆ జట్టు స్థానం చెక్కుచెదరలేదు. అయితే.. WPL మార్చి 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్ లో ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు జరిగాయి.
Also Read : MLC Elections 2023: ఎమ్మెల్యేలపై ఇంటెలిజెన్స్ నిఘా..! ఎందుకో తెలుసా..?
ముంబై ఇండియన్స్ 6 మ్యాచులు ఆడగా అందులో ఆ జట్టు 5 మ్యాచుల్లో గెలిచింది. దీంతో 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది ముంబై ఇండియన్స్. ఇదిలా ఉంటే.. 6 మ్యాచులు ఆడి 4 గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్.. దీంతో పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. యూపీ వారియర్స్ 6 మ్యాచులు ఆడి 3 మ్యాచుల్లో గెలిచింది. 6 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక, ఆర్సీబీ, గుజరాత్ జెయింట్స్ చివరి రెండు స్థానాల్లో ఉండగా.. ఆర్సీబీ, గుజరాత్ జెయింట్స్ ఇప్పటివరకు మొత్తం ఏడేసి మ్యాచులు ఆడాయి. రెండు జట్లు రెండు చొప్పున మాత్రమే విజయాలు ఖాతాలో వేసుకున్నాయి.
Also Read : Mouni Roy: నీ నడుమే నాగస్వరమా నాగిని.. బుసలు కొట్టించేస్తున్నావ్