Today Stock Market Roundup 16-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం తీవ్ర ఊగిసలాటకి గురైంది. ఈ వారంలో మొదటి 3 రోజులు లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిసిన సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభమై స్వల్ప లాభాలతో క్లోజ్ అయ్యాయి. ఎట్టకేలకు వరుసగా ఐదు రోజుల నుంచి వస్తున్న నష్టాలకు బ్రేక్ పడింది. ఎఫ్‌ఎంసీజీ మరియు బ్యాంకింగ్ సెక్టార్లలోని కొన్ని కంపెనీల షేర్లు బాగా రాణించాయి.
Today (28-12-22) Stock Market Roundup: ఈ వారంలో వరుసగా రెండు రోజులు.. సోమవారం.. మంగళవారం.. లాభాల బాటలో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం ఊగిసలాట ధోరణి ప్రదర్శించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ట్రేడింగ్ స్వల్ప నష్టాలతో ప్రారంభమై చివరికి స్వల్ప నష్టాలతో ముగిసింది. ఎర్లీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 60 వేల 714 పాయింట్లకు పడిపోయింది.
Today (19-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఈ వారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం ఉదయం రెండు సూచీలు కూడా ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ కాసేపట్లోనే లాభాల బాట పట్టి చివరికి భారీ ప్రాఫిట్స్‌తో ముగిశాయి. సెన్సెక్స్ 468 పాయింట్లు పెరిగి 61 వేల 806 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 157 పాయింట్లు ప్లస్సయి 18 వేల 426 పాయింట్ల వద్ద ముగిసింది.