Stock Market Crash: ఈరోజు (సోమవారం) అకస్మాత్తుగా స్టాక్ మార్కెట్‌లో భారీ క్షీణత కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభంలో స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఆ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ రెండింటిలోనూ భారీ పతనం జరిగింది. సెన్సెక్స్ 79,713.14 వద్ద ప్రారంబం అవ్వగా.., 1100 పాయింట్లు పడిపోయి 78,620 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీ కూడా సోమవారం 24,315.75 పాయింట్ల వద్ద ప్రారంభం కాగా.. ఇప్పుడు 370 పాయింట్లు పతనమై 23,930 వద్ద ట్రేడవుతోంది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌లోని టాప్ 30 స్టాక్‌లలో 25 స్టాక్‌లు భారీ క్షీణతతో ట్రేడవుతుండగా, 4 స్టాక్‌లు మాత్రమే పెరుగుదలను చూస్తున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లలో అత్యధికంగా 2.39 శాతం పెరిగింది. సన్ ఫార్మా షేర్లలో అత్యధికంగా 3 శాతం పడిపోయాయి. దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా 2.64 శాతం పడిపోయాయి.
Read Also: Hyderabad Metro: మెట్రోలో సాంకేతిక లోపం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు..
నేడు అన్ని రంగాల్లో భారీ క్షీణత కొనసాగుతోంది. మీడియా రంగంలో 2.66 శాతం, చమురు, గ్యాస్ రంగంలో 2.47 శాతం క్షీణత కనిపించింది. అలాగే ఫైనాన్స్, ఆటో, బ్యాంక్ రంగాలలో కూడా భారీ క్షీణత ఉంది. ఇలా అన్ని రంగాల్లో క్షీణతతో ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. పెద్ద స్టాక్‌ల క్షీణత గురించి చూస్తే.. ఆర్‌ఐఎల్, అడానిన్ పోర్ట్, సన్‌ఫార్మా, టాటా మోటార్స్ వంటి హెవీవెయిట్ స్టాక్‌లు 3 శాతం వరకు నష్టపోయాయి. ఇండియన్ ఆయిల్ షేర్లు 5 శాతం, బజాజ్ ఆటో షేర్లు 4.3 శాతం, హీరోమోటోకార్ప్ షేర్లు 3.8 శాతం చొప్పున పతనమయ్యాయి. హిందుస్థాన్ జింక్ 4 శాతం, హెచ్‌పిసిఎల్ షేర్లు 3.82 శాతం, పివిఆర్ 6 శాతం, చెన్నై పెట్రో కార్ప్ 5.49 శాతం, బ్లూ స్టార్ 5 శాతం భారీ నష్టాలను చవి చూస్తున్నాయి.
Read Also: Wriddhiman Saha Retirement: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన టీమిండియా వికెట్ కీపర్