Migraine Pain: మైగ్రేన్ నొప్పి రావడానికి అసలు కారణాలు ఇవే అంటున్నారు నిపుణులు. పురుషులతో పోలిస్తే మైగ్రేన్ సమస్య ఆడవారికి ఎక్కువగా వస్తుందని పని సర్వే లు చెబుతున్నాయి. ఈ తలనొప్పి నాలుగు గంటల నుంచి డెబ్బై రెండు గంటల వరకు ఉంటుంది. అయితే సమస్య బారిన పడడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మైగ్రేన్ సమస్య సర్వసాధారణం అయిపోయింది. మైగ్రేన్ నాడీ సంబంధం ప్రాబ్లం. ఈ నొప్పి తల ఒక వైపు మాత్రమే వస్తుంది. కానీ నొప్పి భరించలేనిగా ఉంటుంది. సమస్య తో బాధపడేవారు వికారం, వాంతులు, కళ్ళు తిరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ సమస్య కారణలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా నిద్రలేమి.. ఈ ఆధునిక కాలంలో నిద్ర లేమి, సమస్యతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని పలు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేసాయి. ఈ నిద్ర లేమి కారణంగా తలనొప్పి మరింత పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. కంటి నిండ నిద్ర లేకపోవడం వల్ల మీరు బలహీనంగా మారడమే కాదు అలసటగా కూడా ఉంటారు. తిన్న ఆహారం తొందరగా అరక్కపోతే మన శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
Also Read : Health Tips : రోజుకు ఒక్క ఉసిరికాయ చాలు.. మీ ఆరోగ్యం భద్రం..!
చివరకు ఇది మైగ్రేన్ సమస్యకు దారి తీస్తుంది. తర్వాతది ఒత్తిడి, ఆందోళన గజి బిజీ లైఫ్‌లో ఆందోళన, ఒత్తిడి సమస్యలు లేని వారంటూ లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు నిపుణులు. అయితే ఈ రెండు సమస్యల వల్ల మైత్రి సమస్య మరింత పెరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. టెన్షన్, పనుల ఒత్తిడి ఎక్కువ అయితే ఖచ్చితంగా తల నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ తలనొప్పి చివరకు మైగ్రేన్ సమస్యకు దారి తీస్తుంది. గ్యాస్ లేదా యాసిడిసీ సమస్యలను ఎదుర్కొనే వారు కూడా మైగ్రేన్ బారిన పడవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ సమస్యలు ఉన్నవారు తలనొప్పి సమయంలో వాంతులు చేసుకుని అవకాశం కూడా ఉందట. ఇలాంటి వాళ్ళు గ్యాస్ ఎక్కువగా ఉండే ఆహారంలో తీసుకోకూడదు అని చెప్తున్నారు.
ముఖ్యంగా వీళ్ళు కడుపును ఖాళీగా మాత్రం ఉంచకూడదు. లేకపోతే గ్యాస్ వచ్చే అవకాశం ఉంది. తరువాతది ఎండ వేడి… మైగ్రేన్ నొప్పి మండుతున్న ఎండలకు కూడా ఎక్కువ అవుతుంది. ఎండకు వెళ్లి తిరిగి ఏసీలో ఉంటే మైగ్రేన్ సమస్య వస్తుంది. ముఖ్యంగా విపరీతమైన వేడి వల్ల కూడా తల నొప్పి, మైగ్రేన్ నొప్పి మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మైగ్రేన్ తగ్గాలంటే తాజా పండ్లు, జున్ను, మామిడి పండ్లు, పుచ్చకాయలు, దోసకాయలు, ఆకుకూరలు, కాఫీ, రెడ్ వైన్ వంటివి తీసుకోండి. ఈ ఫుడ్స్ మైగ్రేన్ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. (గమనిక : ఈ సలహాలు కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించటం ఉత్తమ మార్గం గమనించగలరు.)