Health Tips : ఉసిరికాయ తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తరతరాలుగా అందరు నమ్ముతూ వస్తున్నారు. అయితే వాడాల్సిన విధంగా వాడకపోతే ఉసిరికి చెందిన కొన్ని ఆరోగ్య ఫలాలు అందుకో లేరని నిపుణులు అంటున్నారు. చాలా మంది ఉసిరికాయ పచ్చడి, మురబ్బా, మిఠాయిలు తింటారు. కానీ ఈ పద్ధతి సరైనది కాదు అంటున్నారు నిపుణులు. ఉసిరి పూర్తి ప్రయోజనాన్ని పొందాలంటే దాన్ని పచ్చిగానే తినాలి. ఇనుప కత్తితో ఉసిరికాయను కోయడం వల్ల పోషక విలువలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి స్టీల్ కత్తితో మాత్రమే కట్ చేయాలి. లేదా అలాగే పంటితో కొరికి తినడం ఇంకా మంచిది. ఉసిరికాయను ఎక్కువ ముక్కలుగా కొయ్యకూడదు అని చెబుతున్నారు. అదేవిధంగా కాయను కోసిన వెంటనే తినేయాలి. రుచి పెరగాలంటే ఉసిరికాయలు, కొద్దిగా ఉప్పు వేసుకోని తినొచ్చు.
Also Read : Old Monk Tea: గోవాలో ఓల్డ్ మాంక్ టీ.. తాగితే గ’మ్మత్తే’.. వీడియో వైరల్
మీ ఆహారంలో విటమిన్ సి చేర్చడానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా మాత్రలు తీసుకోవాల్సిన పని లేదు. ప్రతి రోజు ఒక ఉసిరికాయ తినడం వల్ల శరీరంలో విటమిన్ సి పుష్కలంగా చేరుతుంది. ఉసిరిలో ఉండే యాంటీ యాక్సిడెంట్‌లు, విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని, జీవక్రియను పెంచుతుంది. వ్యాధులతో పోరాడి సామర్ధ్యాన్ని పెంచుతుంది. జలుబు, దగ్గు నివారించడానికి చలికాలంలో ఉసిరికాయను తినండి. ముఖంపై మచ్చలు, మొటిమలు, తొలిగించడానికి గోరువెచ్చటి నీటిలో ఉసిరి పొడిని కలిపి ముఖానికి అప్లై చేయాలి. అది ఆరిపోయిన తర్వాత కడిగేయాలి. జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే ఎండు ఉసిరికాయను ఇనుము పాత్రలో వేయించి, మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పొడిని హెన్నా పేస్ట్ తో కలిపి జుట్టుకు పట్టించాలి. జుట్టుకు ఆరోగ్యం, అందం కూడా సొంతమవుతుంది.