యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన చాలా మంది సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.. అందులో కొందరు పాపులర్ అయ్యారు. మరికొంతమంది చిన్న సినిమాల్లో చేస్తూ బిజీగా ఉన్నారు.. అలాంటి వారిలో చైతన్య రావ్ కూడా ఒకరు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇటీవల ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ ఓ మాదిరిగా ఆడింది.. ఆ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి రాబోతుంది.
సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కుమారస్వామి. ట్రైలర్‌తో మంచి హైప్ తెచ్చుకున్న ఈ మూవీ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది.. సినిమా వచ్చిన రెండు నెలల తర్వాత సినిమా ఓటీటీలో సందడి చెయ్యబోతుంది..
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మే 18వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. మంచి మిడిల్ క్లాస్ మూవీ చూడాలని ఉందా.. అయితే షరతులు వర్తిస్తాయి సినిమా మే 18వ తేదీన ఆహాలో ప్రీమియర్ కానుందని ఆహా టీమ్ ట్వీట్ ద్వారా ప్రకటించారు.. మిడిల్ క్లాస్ మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి.. వారి మధ్య ఉండే ప్రేమలు గురించి ఈ సినిమాలో చక్కగా చూపించారు.. ఒకసారి ఇక్కడ చూసి ఆనందించండి..