AP Crime: డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వాడపల్లి లంక వద్ద గోదావరి ఊబిలో చిక్కుకుని ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. ఆలమూరు మండలం చిలకలపాడు నుంచి వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి గౌతమీ గోదావరి నదిలోనే కాలినడకన నడిచి వెళ్తుండగా.. వాడపల్లి లంక వద్ద దొంగ ఊబిలో కూరుకుపోయి మునిగి మృతి చెందారు. ఆలమూరు మండలం మడికి శివారులోని చిలకలపాడుకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రతి శనివారం దర్శనం చేసుకుని మెక్కులు తీర్చుకోవడం భక్తులకు ఆనవాయితే. ఏడు శనివారాలు వరుసగా దర్శనం చేసుకునే సంప్రదాయం ఈ ఆలయంలో కొనసాగుతుంది.
Read Also: Pavitra : తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం.. త్రినయని సీరియల్ నటి మృతి..
అయితే, వేసవి కావడంతో గోదావరిలో నీరు పెద్ద గా ప్రవాహం లోకపోవడంతో కాలినడకన గోదావరిలో వాడపల్లి గుడికి వెళ్లడం ఈ ప్రాంతం వారు చేస్తుంటారు. ఇది ఈ ప్రాంతం వారికి అలవాటే.. అయితే, మోకాలు లోతు పైగా నీరు అక్కడక్కడ ప్రవహిస్తూ వుంటుంది. ఆలమూరు మండలం బడుగువానిలంక ఇవతలి ఒడ్డు అయితే అవతలి ఒడ్డు వాడపల్లి ఆలయం వుంటుంది. దీనితో అటు రావులపాలెం నుంచి తిరిగి వెళ్ళనక్కర్లలేకుండా దగ్గర మార్గంగా కొందరు కాలినడకన గోదావరి దాటి వెళ్తుంటారు. అలా శనివారం వేకువజామున ముగ్గురు మహిళలు కలిసి వెళుతుండగా గోదావరి మధ్యలో ఊబిలో. ప్రమాదవశాత్తు చిక్కుకుని కిందకు ఒకరి తర్వాత ఒకరు కూరుకుపోయారు. ఒకర్ని రక్షించబోయి ఒకరు ముగ్గురు కూడా ఊబిలోకి కూరుకుపోయి మృతి చెందినట్టు అక్కడ పరిస్థితులు బట్టి తెలుస్తోంది.
Read Also: Indonesia: కారు, బైకులను ఢీకొన్న స్కూల్ బస్సు.. 11 మంది మృతి
వీరు ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడు గ్రామస్తులుగా గుర్తించారు. వీరిలో అనంతలక్ష్మీ అనే మహిళ మృతదేహం ముందుగా లభ్యం అయ్యింది. నిన్న రాత్రి వరకూ వాడపల్లి వెళ్లిన వారు రాకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు వాడపల్లి వెళ్లి నిన్న పొద్దుపోయాక ఆరా తీస్తే అక్కడ తెలిసిన వారు రాలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గొదావరి మార్గంలో వెతగగా గొదావరి ఊబిలో కోరుకుపోయినట్టు స్థానికుల సమాచారంతో నేటి వేకువజామున తెలుసుకుని. ఆత్రేయపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్థానిక మత్స్యకారుల సహకారంతో ఆదివారం ఉదయం మృతదేహాలు వెలికితీసే చర్యలు చేపట్టారు. ఆలమూరు మండలం బడుగువాని లంకకు చెందిన పల్లూరి సత్య అనంతలక్ష్మి( 40) కప్పిరెడ్డి ఏసమ్మ ( 60 ) కర్రీ సునీత (16) లు గా గుర్తించారు. వాడపల్లి లంక సమీపంలో ఘటన జరిగింది. మృతదేహాలు లభ్యమయ్యాయి.