House Collapsed: మీరట్‌లో కూలిన మూడంతస్తుల భవనం, శిథిలాల కింద 8 మంది..!
- మీరట్‌లో పెను ప్రమాదం
- జాకీర్ కాలనీలో కూలిపోయిన 50 ఏళ్ల నాటి మూడంతస్తుల భవనం
- శిథిలాల కింద 8 మందికి పైగా సమాధి అయినట్లు సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని మీరట్‌లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాకీర్ కాలనీలో 50 ఏళ్ల నాటి మూడంతస్తుల భవనం కూలిపోయింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా శిథిలావస్థలో ఉన్న ఓ ఇల్లు కూలిపోయింది. దీంతో.. కుటుంబం మొత్తం శిథిలాల లోపలే చిక్కుకుపోయారు. ఇంట్లో ఉన్న 8 మందికి పైగా సమాధి అయినట్లు సమాచారం. స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
Read Also: NASA: రికార్డు స్థాయిలో భూమి చుట్టూ తిరుగుతున్న వ్యోమగాములు.. ఎంతమంది ఉన్నారంటే..?
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
సమాచారం ప్రకారం.. ఆ ఇల్లు నఫో అనే 50 ఏళ్ల మహిళకు చెందినది. నఫో ఇద్దరు కుమారులు సాజిద్, గోవిందలు తమ భార్యలు, పిల్లలతో కలిసి ఇంట్లో నివసిస్తున్నారు. కుటుంబం మొత్తం శిథిలాల కింద పడిపోయారు. ఈ కుటుంబం పాల వ్యాపారం నిర్వహిస్తూ జీవిస్తున్నారు. కింది అంతస్తులో గేదెలను కూడా కట్టేశారు. ఒక్కసారిగా ఇల్లు కూలిపోవడంతో గేదెలు కూడా శిథిలాల కింద పడి పోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో జేసీబీ లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Read Also: Indore: బ్యాంక్ ఉద్యోగి భార్యపై ఆర్మీ సైనికుడు అత్యాచారం.. తర్వాత ప్రైవేట్ పార్ట్‌లో..!
ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా.. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సహాయక బృందాలు అక్కడికక్కడే సహాయక చర్యల్లో నిమగ్నమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..