Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Colombia Earthquake: కొలంబియాలో సోమవారం సంభవించిన 7.4 తీవ్రత గల శక్తివంతమైన భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ప్రకృతి విపత్తులో కనీసం 111 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పలుచోట్ల భవనాలు కూలిపోవడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంపం 12:34 UTCకి, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:34 గంటలకు సంభవించింది. కొలంబియాలోని చోకో డిపార్ట్మెంట్లోని శాన్ జోస్ డెల్ పాల్మార్కు తూర్పున సుమారు 5 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం సుమారు 107 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అధికారులు తెలిపారు.
భూకంపం ప్రభావం పలు నగరాలపై తీవ్రంగా పడింది. పెరీరాలో 18 మంది మరణించినట్లు ఆ నగర మేయర్ తెలిపారు. మనిజాలెస్‌లో ఇద్దరు మృతి చెందినట్లు మేయర్ వెల్లడించారు. ఇక కాలి నగరంలో కనీసం 20 భవనాలు కూలిపోయినట్లు మేయర్ అలెజాండ్రో ఎడర్ తెలిపారు. కొన్ని భవనాల్లో ప్రజలు చిక్కుకుపోవడంతో సహాయక, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భవనాలకు నష్టం జరిగిందా, పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయా అనే విషయాన్ని పరిశీలించాలని, భవనం సురక్షితంగా లేదని అనిపిస్తే వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. భూకంపం తర్వాత సంభవించే ప్రకంపనలపై కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read
- Iran-US Tensions: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. బహ్రెయిన్‌లో అమెరికా రాడార్‌ను ధ్వంసం చేశామన్న IRGC..!
- Pete Hegseth: రక్షణ మంత్రినే మందలించిన సైనికుడికి అరుదైన గౌరవం.. స్వయంగా మెడల్ అందజేత!
- Jensen Huang Third Girlfriend: జెన్సన్ హువాంగ్ మూడో గర్ల్‌ఫ్రెండ్ ఎవరు?.. ఎన్విడియా సీఈఓపై మరో సంచలన ఆరోపణలు!
- Xi Jinping Warns Taiwan: తైవాన్‌కు జిన్‌పింగ్ వార్నింగ్.. స్వాతంత్ర్యానికి అవకాశమే లేదు.. చైనాతో ఏకీకరణ తప్పదు!
చోకో గవర్నర్ నుబియా కరోలినా కార్డోబా-కురి మాట్లాడుతూ.. భూకంపం కారణంగా క్విబ్డోలోని పలు భవనాలు దెబ్బతిన్నాయని, కొందరు గాయపడినట్లు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
విమాన సర్వీసులకు అంతరాయం
భూకంపం కారణంగా కొలంబియాలోని పలు విమానాశ్రయాల్లో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. పెరీరా, మనిజాలెస్, క్విబ్డో, అర్మేనియా, కార్టాగో, బ్యూనవెంచురా విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులు, విమానాల భద్రతను నిర్ధారించే వరకు కొన్ని సర్వీసులను నిలిపివేశారు. నష్టాన్ని అంచనా వేసేందుకు జాతీయ విపత్తు ప్రమాద నిర్వహణ విభాగం స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తోంది. రాజధాని బొగోటాలో మాత్రం ఇప్పటివరకు పెద్దగా నష్టం జరిగినట్లు సమాచారం లేదని నగర మేయర్ కార్లోస్ గలాన్ తెలిపారు. అయితే భూకంప ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
వెనిజులాలోనూ ప్రకంపనలు
కొలంబియాలో సంభవించిన భూకంప ప్రకంపనలు పొరుగున ఉన్న వెనిజులాలోనూ నమోదయ్యాయి. టాచిరా, బార్కిసిమెటో ప్రాంతాల్లో ప్రజలు ప్రకంపనలను అనుభూతి చెందినట్లు తెలిపారు. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ ముప్పు లేదని అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ స్పష్టం చేసింది. అనేక టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులు, ఫాల్ట్ జోన్లకు సమీపంలో ఉన్న కొలంబియా భూకంపాలకు గురయ్యే దేశాల్లో ఒకటి. కొలంబియన్ జియోలాజికల్ సర్వీస్ గణాంకాల ప్రకారం, దేశంలో గతంలో 100కు పైగా విధ్వంసకర భూకంపాలు నమోదయ్యాయి. తాజా భూకంపం నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి..
తాజావార్తలు
-
Telangana El Nino Impact : ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ అలర్ట్.. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.!
-
Indian Railway: RACకి రైల్వే శాఖ గుడ్ బై..దశాబ్దాల నాటి విధానానికి స్వస్తి..?
-
Jensen Huang: ‘ఏదైతే అది అయింది, నాకు అనవసరం’.. జెన్సెన్ హువాంగ్ సంచలన వ్యాఖ్యలు..
-
OM Movie: ధనుష్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. టైటిల్ మార్చేసిన మేకర్స్?
-
Box Office Records: పుష్ప టూ రామాయణ.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి వేగంగా చేరిన 8 సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?