NASA: రికార్డు స్థాయిలో భూమి చుట్టూ తిరుగుతున్న వ్యోమగాములు.. ఎంతమంది ఉన్నారంటే..?
- ఎప్పుడూ లేని విధంగా అంతరిక్షంలో 19 మంది..
- ఇది రికార్డు అని చెబుతున్న నాసా..
- ఐఎస్ఎస్.. టియాంగాంగ్ కేంద్రాల్లో వ్యోమగాములు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NASA: ఎప్పుడూ లేని విధంగా అంతరిక్షంలో ఉంటూ భూమి చుట్టూ తిరుగుతున్న వ్యోమగాముల సంఖ్య పెరిగింది. ఇది ‘‘మానవత్వానికి కొత్త రికార్డు’’ అని నాసా అభివర్ణించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్)కి మరో ముగ్గురు కొత్త వ్యోమగాములు రావడంతో భూమి చుట్టూ తిరుగుతున్న వ్యోమగాముల సంఖ్య ప్రస్తుతం 19కి చేరింది. స్పేస్ స్టేషన్ ప్రారంభించిన తర్వాత ఇప్పుడు కక్ష్యలో 19 మంది ఉన్నారు, ఇది అంతరిక్షంలో మానవ ఉనికికి కొత్త రికార్డుగా, మానవ అన్వేషణ సరిహద్దుని విస్తరించినందుకు మేము గర్విస్తున్నామని నాసా అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ట్వీట్ చేశారు.
ఈ వారం ప్రారంభంలో ముగ్గురు రష్యన్ సోయుజ్ క్యాప్సూల్‌లో ఐఎస్ఎస్‌కి వెళ్లారు. వీరిలో నాసా వ్యోమగామి డాన్ పెటిల్‌తో పాటు రోస్కోస్మోస్ వ్యోమగాములు అలెక్సీ ఓవ్చినిన్, ఇవాన్ వాగ్నర్ ఉన్నారు. దీంతో ప్రస్తుతం 19 వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నారు. గతేడాది నెలకొల్పబడిన 17 మంది రికార్డుని అధిగమించినట్లు Space.com నివేదించింది. అన్ని సమయాల్లో ఐఎస్ఎస్‌లో కనీసం ఒక వ్యక్తి ఉనికి 2020 నుంచి ఉంటుంది.
Also Read
- America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
- Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
- Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
Read Also: Indore: బ్యాంక్ ఉద్యోగి భార్యపై ఆర్మీ సైనికుడు అత్యాచారం.. తర్వాత ప్రైవేట్ పార్ట్‌లో..!
19 మంది వీరే..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పెటిల్, ఓవ్చినిన్, వాగ్నెర్‌తో పాటు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్, మైఖేల్ బారట్, ట్రేసీ కాల్డ్‌వెల్-డైసన్, మాథ్యూ డొమినిక్, జీనెట్ ఎప్స్, నికోలాయ్ చుబ్, ఒలేగ్ కొనోనెంకో, అలెగ్జాండర్ గ్రెబెంకిన్ ఉన్నారు. చైనా టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో ముగ్గురు వ్యక్తులు షెంజౌ 18 మిషన్‌కి చెందిన లి గ్వాంగ్సు, లి కాంగ్ మరియు యే గ్వాంగ్‌ఫు ఉన్నారు. వారితో పాటు మరో నలుగురు వ్యోమగాములు ఫ్రీ ఫ్లైయింగ్ క్రూ డ్రాగన్‌లో నివసిస్తున్నారు. వీరిలో జారెడ్ ఐజాక్‌మాన్, స్కాట్ పొటీట్, సారా గిల్లిస్ మరియు అన్నా మీనన్ ఉన్నారు.
After Wednesday's launch to the @Space_Station, there are now 19 humans in orbit—a new record for humanity.
We're proud to help expand the boundaries of human exploration. Ad astra! pic.twitter.com/3FvzQlbmNN
— NASA (@NASA) September 13, 2024
తాజావార్తలు
-
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
-
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!