అసోం రాజధాని గౌహతిలోని ఓ ఆలయంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారానికి గురైన బాలిక వివరాలు తెలియలేదని శనివారం పోలీసులు తెలిపారు. నవంబర్ 17న రాస్ మహోత్సవం సందర్భంగా దుర్గ గుడి ఆవరణలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పేర్కొన్నారు.
బీరుట్ సబర్బన్ ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడిలో 8 మంది చనిపోయారు.. 59 మంది గాయపడినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఓ అగ్ర సైనికుడు ఉన్నాడు. కాగా.. ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే..
మీరట్‌లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాకీర్ కాలనీలో 50 ఏళ్ల నాటి మూడంతస్తుల భవనం కూలిపోయింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా శిథిలావస్థలో ఉన్న ఓ ఇల్లు కూలిపోయింది. దీంతో.. కుటుంబం మొత్తం శిథిలాల లోపలే చిక్కుకుపోయారు. ఇంట్లో ఉన్న 8 మందికి పైగా సమాధి అయినట్లు సమాచారం.
రష్యాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. వీరిలో నలుగురు జైలు ఉద్యోగులు కూడా ఉన్నారు. రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రాంతంలోని అత్యంత భద్రత కలిగిన ఐకే-19 సురోవికినో శిక్షాస్మృతి కాలనీలో ఈ హింసాకాండ చోటుచేసుకుంది.