Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agadha Pre Release Event: ఎంఎస్ రాజు దాదాపు 45 ఏళ్ల సినీ ప్రయాణంలో నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కామాక్షి భాస్కర్ల లీడ్ రోల్ నటిస్తున్న ‘అగధ’ తో మరో సారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ మధ్య వచ్చిన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుక ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకునే సందర్భంగానూ మారింది. ప్రముఖుల రాకతో వేదిక కలకళలాడిపోయింది. ఈ వేడుకలో ‘అరుంధతి’ చిత్ర నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాజుతో తన సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాజు ఎప్పుడూ సినిమా విషయంలో ముందుచూపుతో ఆలోచించే వ్యక్తి అని ప్రశంసించారు. ‘అగధ’ హారర్ సినిమాలలో స్థాయిని దాటి పోతుందని, విజువల్ ప్రజెంటేషన్ అధ్బుతమని పేర్కొన్నారు.
దర్శకుడు బి. గోపాల్ కూడా ఎంఎస్ రాజులో బలమైన కథను ముందుగానే గుర్తించే ప్రత్యేకత ఉందని అన్నారు. ‘అగధ’ గతంలో వచ్చిన ‘దేవి’ కంటే కూడా పెద్ద విజయాన్ని సాధించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక ‘పొలిమెరా’ ఫ్రాంచైజీతో అనుబంధం ఉన్న అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాను మొదటి నుంచే గమనిస్తున్నట్లు తెలిపారు. సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, అది చాలా విభిన్నంగా అనిపించిందని చెప్పారు. కామాక్షి భాస్కర్లకు ఇది కెరీర్ లోనే బెస్ట్ ప్రాజెక్ట్ గా నిలుస్తుందని కొనియాడారు. ఇక కామాక్షి భాస్కర్లకు ‘అగధ’ మరింత కీలకమైన సినిమా కానుంది. తనకు ప్రధాన పాత్ర ఇచ్చినందుకు ఎంఎస్ రాజుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం తన కెరీర్‌కు బలమైన పునాది వేస్తుందని పేర్కొన్నారు.
Also Read
- October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
- Ram Charan : RC 17 ప్రీ లుక్ పోస్టర్.. ఇదెక్కడ రచ్చ అయ్యా?
- Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
- Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
మరోవైపు శ్రవణ్ రెడ్డి కూడా ఎంఎస్ రాజు తనను వెబ్ సిరీస్‌లో గుర్తించి, ఆ తర్వాత ‘డర్టీ హరి’లో అవకాశం ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ‘అగధ’ కూడా ఆయన ఇచ్చిన మరో ముఖ్యమైన అవకాశంగా పేర్కొన్నారు. టీజర్, ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో నిర్మాత కాశీ విశాలాక్షి బాలుసు కూడా సినిమాపై నమ్మకం వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో ఎంఎస్ రాజు చూపించిన అంకితభావం తనకు మరింత విశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ సినిమా సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ సాగుతున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమౌతోంది. దైవిక అంశాలు, మంచి చెడుల మధ్య సంఘర్షణ, అతీంద్రియ నేపథ్యం, విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. అందుకే మామూలు హారర్ కథలకు భిన్నంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నంగా ‘అగధ’ కనిపిస్తోంది.
ఎంఎస్ రాజు రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బాలుసు నిర్మించారు. అజయ్ కేఆర్ సమర్పిస్తుండగా, ఎన్వీఎన్ సుబ్బరాజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు, ట్రైలర్‌కు వచ్చిన స్పందన సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ‘అగధ’ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. ముఖ్యంగా ఎంఎస్ రాజుకు ఇది నిజంగా గ్రాండ్ కమ్‌బ్యాక్‌గా నిలుస్తుందా, లేక ఆయన చెబుతున్న సూపర్ ఓవర్ విజన్ బాక్సాఫీస్ వద్ద కూడా పనిచేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ చిత్రాల నిర్మాతగా పేరొందిన ఎం.ఎస్. రాజు కెరీర్ ప్రారంభంలో వెంకటేష్‌తో ‘శత్రువు’ (1991) విజయశాంతితో ‘పోలీస్ లాకప్’ (1993) వంటి భారీ విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత గ్రాఫిక్స్ వండర్ ‘దేవి’ (1999) చిత్రంతో సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఆయన, ఆపై ఉదయ్ కిరణ్‌తో ‘మనసంతా నువ్వే’ (2001), ‘నీ స్నేహం’ (2002) వంటి క్లాసిక్ మ్యూజికల్ హిట్స్ అందించారు. ముఖ్యంగా మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన ఇండస్ట్రీ హిట్ ‘ఒక్కడు’ (2003), ప్రభాస్ స్టార్‌డమ్‌ను పెంచిన ‘వర్షం’ (2004), ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (2005) చిత్రాలతో ఆయన వరుసగా హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్ సాధించి ‘సంక్రాంతి రాజు’గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా కూడా మారి ‘డర్టీ హరి’ (2020) వంటి బోల్డ్ థ్రిల్లర్‌తో డిజిటల్ పరంగా మంచి విజయాన్ని అందుకున్నారు. ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన ఎం.ఎస్. రాజు గత కొంత కాలంగా డీలా పడ్డారు. అయితే ఇప్పుడు వస్తున్న ‘అగధ’ హిట్ అయితే మాత్రం రాజు గారికి ఇండస్ట్రీలో మళ్ళీ కమ్‌బ్యాక్ వచ్చినట్లే.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!