మీరట్‌లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాకీర్ కాలనీలో 50 ఏళ్ల నాటి మూడంతస్తుల భవనం కూలిపోయింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా శిథిలావస్థలో ఉన్న ఓ ఇల్లు కూలిపోయింది. దీంతో.. కుటుంబం మొత్తం శిథిలాల లోపలే చిక్కుకుపోయారు. ఇంట్లో ఉన్న 8 మందికి పైగా సమాధి అయినట్లు సమాచారం.