కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. కాసర్‌గోడ్‌లో అంబులెన్స్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులు త్రిసూర్‌లోని ఇరింజలకుడాకు చెందిన శివకుమార్ (54), అతని కుమారులు శరత్ (23), సౌరవ్ (15)గా గుర్తించారు.
కేరళలో తొలి వందే భారత్ రైలు ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు త్రివేండ్రం నుండి కాసరగోడ్ వరకు నడుస్తుంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళలోని కొచ్చిలో నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్‌షో నిర్వహించారు.
కేరళ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఇప్పుడు కాసరగోడ్ వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు. తొలుత ఈ సర్వీసు కన్నూర్‌లో ముగియాల్సి ఉంది. కేంద్ర మంత్రి వి మురళీధరన్ అభ్యర్థన మేరకు సర్వీసు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.