ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. అభయారణ్యంలో రక్తం చిందింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టలు హతమయ్యారు. వెంకటాపురం మండలం కర్రెగుట్టల సమీపంలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మృతదేహాలతో పాటు ఆయుధాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Kalki 2898AD: ప్రభాస్ ‘కల్కి 2898AD’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
ఏకే 47, ఎల్‌ఎమ్‌జీ1 స్వాధీనం చేసుకున్నారు. ఈ కూంబింగ్‌లో తెలంగాణ గ్రేహౌండ్స్ పాల్గొన్నారు. ములుుగు జిల్లాలోని పూజారి కాంకేర్ ఉసురు సరిహద్దు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. బీజాపూర్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లో కూడా 13 మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఇది కూడా చదవండి: Rohit Sharma: ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ గుడ్బై..?