రేపు మధ్యాహ్నం 1. 04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నుంచి ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని డీజీపీ రవిగుప్తా తెలిపారు.
పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లించనున్నారు. ఎస్బీఐ గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు వైపు, బషీర్‌బాగ్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను కింగ్ కోఠి వైపు, ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లించనున్నారు. ఈ క్రమంలో నగరవాసులు, వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇబ్బందులుంటే 9102033626 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
Telangana Elections: తెలంగాణలో జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు
మరోవైపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు చెప్పారు. డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతికుమారి, సీపీ సందీప్ శాండిల్య, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ తదితరులు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం డీజీపీ రవిగుప్తా మాట్లాడుతూ… సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా.. సీఎం ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం నేపథ్యంలో రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి దాదాపు లక్షమంది హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతోండగా.. ఎల్బీ స్టేడియంలో కేవలం ముప్పై వేలమందికి మాత్రమే కూర్చోవడానికి అవకాశం ఉంది. మిగిలిన వారి కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
KCR: మాజీ సీఎం కేసీఆర్ను కలిసిన చింతమడక గ్రామస్తులు.. సీఎం సీఎం అంటూ నినాదాలు