ప్రస్తుత రోజుల్లో బైకు నిత్యావసరంగా మారిపోయింది. దిగువ మధ్యతరగతి ప్రజలు కారు కొనలేకపోయినా ఓ మంచి బైకు ఉండాలని కలలకంటుంటారు. పైసా పైసా కూడబెట్టి బైక్ కొనుగోలు చేస్తుంటారు. ఇది వారికి ఉద్యోగంలో.. వ్యాపారంలో.. ఇతర అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు కూడా మంచి 125cc మోటార్ సైకిల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ శాలరీ నెలకు రూ. 30 వేలు వస్తుందా? అయితే మీరు కొనుగోలు చేసేందుకు 125cc బెస్టు బైకులు అందుబాటులో ఉన్నాయి. మీరు ఫైనాన్స్ ఆప్షన్‌ను ఎంచుకుని, ప్రతి నెలా EMI రూపంలో బైక్ కోసం చెల్లించవచ్చు. ఇవి స్టైలిష్ లుక్, సూపర్ ఫీచర్లతో వస్తున్నాయి. ఆ బైకుల వివరాలు మీకోసం..
Also Read:Naga Vamsi: నాగవంశీ కోపానికి ‘అసలు’ కారణమిదే!
హోండా షైన్
హీరో స్ప్లెండర్ తర్వాత దేశంలో రెండవ అత్యధికంగా అమ్ముడైన బైక్ హోండా షైన్. దీని ఆన్-రోడ్ ధర రూ.96,228 నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది. ఇందులో 123.94 సిసి ఇంజిన్ ఉంది. హోండా షైన్ మైలేజ్ లీటర్‌కు 55 కి.మీ. వరకు ఇస్తుంది. గరిష్ట వేగం గంటకు 90 కి.మీ.
Also Read:Anchor Syamala: పవన్ కల్యాణ్‌పై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు..
టీవీఎస్ రైడర్
125cc బైక్స్ విభాగంలో, TVS మోటార్ కంపెనీకి చెందిన రైడర్ మోడల్ మంచి స్థానాన్ని అందుకుంది. కస్టమర్లచే ఆకర్షించబడుతోంది. TVS రైడర్ ఆన్-రోడ్ ధర రూ. 99,904 నుంచి ప్రారంభమై రూ. 1.22 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 124.8 సిసి ఇంజిన్ ఉంది. రైడర్ 71.94 kmpl మైలేజ్, 99 kmph గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది.
Also Read:Payal Shankar : అణిచివేత ప్రజా పాలన అవుతుందా..?
బజాజ్ ఫ్రీడమ్ 125
దేశంలోనే మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్ బజాజ్ ఫ్రీడమ్ 125 ఆన్-రోడ్ ధర రూ.1.09 లక్షల నుంచి రూ.1.31 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 124.58 సిసి ఇంజిన్ ఉంది. ఈ బైక్ CNGలో 90 kmpl కంటే ఎక్కువ, పెట్రోల్‌లో 65 kmpl కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 93 కి.మీ.
Also Read:Payal Shankar : అణిచివేత ప్రజా పాలన అవుతుందా..?
హీరో సూపర్ స్ప్లెండర్
దేశంలో నంబర్ 1 మోటార్ సైకిల్ హీరో స్ప్లెండర్. 125 సిసి సెగ్మెంట్ ప్రసిద్ధ మోడల్ హీరో సూపర్ స్ప్లెండర్ ఆన్-రోడ్ ధర రూ. 93,581 నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది. ఇందులో 124.7 సిసి ఇంజిన్ ఉంది. సూపర్ స్ప్లెండర్ మైలేజ్ 60 కి.మీ. వరకు ఉంటుంది. గరిష్ట వేగం గంటకు 93 కి.మీ.
Also Read:Gujarat: బాణసంచా కర్మాగారంలో పేలుడు.. 17 మంది మృతి
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125
125 సిసి విభాగంలో సూపర్ స్పోర్టీ బైక్ కావాలనుకునే వారికి, బజాజ్ పల్సర్ NS 125 బెస్ట్ ఆప్షన్. పల్సర్ NS 125 ఆన్-రోడ్ ధర రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.27 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 124.45 సిసి ఇంజిన్ ఉంది. దీని మైలేజ్ 64 kmpl వరకు ఉంటుంది. గరిష్ట వేగం గంటకు 103 కిలోమీటర్లు.