మానవ తప్పిదాలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో బాణాసంచా కర్మాగారాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోతుండగా మరికొంతమంది తీవ్రగాయాలపాలై వైకల్యాన్ని ఎదుర్కోంటున్నారు. తాజాగా గుజరాత్ లో మరో పేలుడు సంభివించింది. బనస్కాంతలోని దీసాలోని ధున్వా రోడ్డులోని బాణసంచా కర్మాగారంలో పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీసాలోని ధున్వా రోడ్డులో దీపక్ ట్రేడర్స్ అనే బాణసంచా కర్మాగారం ఉంది. ఈరోజు బాణసంచా తయారు చేస్తుండగా, పేలుడు పదార్థం అకస్మాత్తుగా పేలి, మంటలు చెలరేగాయి.
Also Read:Sanjay Raut: అద్వానీకి షాజహాన్ పరిస్థితి.. మోడీపై సంజయ్ రౌత్ విమర్శలు..
బాణాసంచా కర్మాగారం కావడంతో క్షణాల్లోనే దట్టంగా మంటలు వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో 17 మంది కార్మికులు మరణించినట్లు సమాచారం. ఆకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక శాఖ బృందం సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.