ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్, తెలుగు యాంకర్ వింధ్య విశాఖ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. జన్యుపరమైన కారణాలతో కిడ్నీ, లివర్ ఫెల్యూర్‌తో భాదపడుతున్న ఓ కుర్రాడికి తన వంతు సాయం చేశారు. అంతేకాదు ఆ బాలుడికి ఆరోగ్య శ్రీ వర్తించదని, అతడి కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స కోసం అందరూ సాయం చేయాలని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. నిరుపేద బాలుడికి ఆర్థిక సహాయం అందించిన వింధ్య విశాఖను అందరూ ప్రశంసిస్తున్నారు. సిద్దిపేట…
శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అని చెప్పిన స్వామీ వివేకానందా మాటలను నిజం చేశాడు ఆ యువకుడు. తన లక్ష్యం పట్ల అంకితభావం, టార్గెట్ చేధించేందుకు తను చేసిన కృషి నేడు ఆయనను దేశ అత్యున్నత సర్వీసు అయిన ఐఎఫ్ఎస్ అధికారిని చేశాయి. మరణం అంచుల వరకు వెళ్లిన అతడు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్‌లో 112వ ర్యాంకును సాధించారు. అతను మరెవరో కాదు దేవానంద్ టెల్గోట్. ఇతడు మహారాష్ట్రకు చెందిన…
గత ఏడాది డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన 9 ఏళ్ల శ్రీ తేజ, ఐదు నెలల చికిత్స అనంతరం కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ ఘటనలో శ్రీ తేజ తల్లి రేవతి (39) మృతి చెందగా, శ్రీ తేజ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్‌ను చూసేందుకు గుండెల్లో…
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా వేస్తున్న ప్రీమియర్ కోసం అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వెళ్లారు. అదే సమయంలో సినిమా వీక్షించేందుకు వచ్చిన శ్రీ తేజ్ కుటుంబం తొక్కిసలాట బారిన పడింది. ఈ నేపథ్యంలో శ్రీ తేజ్ తల్లి రేవతి ఊపిరాడక మరణించగా శ్రీ తేజ మాత్రం అప్పటినుంచి కోమాలోనే ఉన్నాడు. శ్రీ…
పుష్ప -2 రిలీజ్ రోజు న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు. శ్రీ తేజ్ పరామర్శించి శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా తీశారు అల్లు అర్జున్. అలాగే తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఓదార్చాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ తో పాటు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత FDC ఛైర్మెన్ దిల్ రాజు కూడా…
కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ నీ పరామర్శించేందుకు నేడు అల్లు అర్జున్ కిమ్స్ కి రానున్నారు.ఇప్పటికే పలుమార్లు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వస్తున్నట్లుగా చెప్పి చివరి నిమిషంలో డ్రాప్ అయిన అల్లు అర్జున్ పోలీసుల అనుమతితో కిమ్స్ ఆసుపత్రికి రానున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీ తేజ కొన ఊపిరితో కిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.గత 35 రోజులుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ ఆరోగ్యం ప్రస్తుతం…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీ తేజ కొన ఊపిరితో కిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. శ్రీ తేజ తల్లి రేవతి ఇప్పటికే మరణించడంతో తండ్రి భాస్కర్ శ్రీ తేజని చూసుకుంటున్నారు. గత 35 రోజులుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఇప్పటికే అల్లు అరవింద్…
Allu Arjun: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు మరోమారు పెద్ద షాక్ తగిలింది. తాజాగా రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులను జారీ చేశారు. కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించడానికి వెళ్ళడానికి అల్లు అర్జున్ వెళ్తునందుకు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ హాస్పిటల్ దగ్గరకు రావద్దని, ఎవరూ వచ్చేందుకు అనుమతి ఇవ్వడంలేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల ప్రకారం, హాస్పిటల్‌కు వెళ్ళడం అనుమతించడంలో పెద్ద సమస్య ఉండటం వల్ల,…
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. అనంతరం.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ నేతల బృందం కూడా ఉంది.
Sritej Health Bulletin : డిసెంబర్ 4న పుష్ప 2 (ది రూల్) ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన 13 ఏళ్ల శ్రీతేజ్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడిల్స్‌లో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం సాయంత్రం, ఆసుపత్రి అధికారులు శ్రీతేజ్ ఆరోగ్యం గురించి తాజా బులెటిన్‌ను విడుదల చేశారు. వెంటిలేటర్ సహాయం లేకుండా ఊపిరి పీల్చు కోగులుగుతున్నాడని వైద్యులు వెల్లడించారు. అప్పుడప్పుడు శ్రీతేజ కళ్ళు తెర్వగలుతున్నాడని, కానీ ఐ కాంటాక్ట్…