DK Shivakumar: రాబోయే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో దేశాన్ని భవిష్యత్ కోసం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంటుందని కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఆదివారం తెలిపారు. 1924 బెలగావి సదస్సు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సీనియర్ మంత్రులతో సమావేశమైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని నడిపించేందుకు పార్టీ చేపట్టి పోరాట కార్యక్రమాలపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
Read Also: Ponnam Prabhakar: బండి సంజయ్, పురందేశ్వరిపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు..
ఈ సమావేశం డిసెంబర్ 26న మధ్యాహ్నం 03 గంటలకు జరగనుంది. అన్ని రాష్ట్రాల కాంగ్రెనస్ అధ్యక్షులు, సీడబ్ల్యూసీ మెంబర్స్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఆఫీస్ బేరర్లు, 150 మంది ఎంపీలు సమావేశంలో పాల్గొంటారని డీకే శివకుమార్ చెప్పారు. ‘‘డిసెంబర్ 26-27 తేదీల్లో 1924 బెలగావి సదస్సు శతాబ్ధి ఉత్సవాల సన్నాహాలను పరిశీలించడానికి ఆదివారం ముఖ్యమంత్రి సమావేశాన్ని నిర్వహించారు. సువర్ణ సౌధలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పార్టీ శ్రేణులకు అతీతంగా ఆహ్వానాలు అందిస్తాము. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. భద్రతా ఆంక్షల దృష్ట్యా ఈ కార్యక్రమానికి ప్రజలను ఆనుమతించడం లేదు’’ అని ఆయన చెప్పారు. డిసెంబర్ 27న ఖర్గే నేతృత్వంలో మెగా బహిరంగ ర్యాలీ ఉండనుంది.