హర్యానాలో ఓ దొంగ భక్తుడు చేసిన పని అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా బయటపడింది. అయితే, ఓ దొంగ భక్తుడు అందరిలాగే గుడిలోకి వెళ్లాడు. గర్భ గుడిలోకి వెళ్లి మరీ.. దేవుడికి మొక్కాడు. 10 రూపాయలు హనుమంతుడి పాదాల దగ్గర పెట్టాడు.. వేరే భక్తులూ వస్తున్న టైంలో ఆ దొంగ భక్తుడు అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా చదవడం స్టార్ట్ చేశాడు.. సుమారు పది నిమిషాల పాటు ఆ హనుమాన్ చాలీసా చదివాడు. భక్తులు రావడం తగ్గిపోవడంతో పూజారీ కూడా ఆ దొంగ భక్తుడిని నమ్మి అక్కడి నుంచి బయటకు వెళ్లగానే అతడు దొంగతనం చేశాడు.
Read Also: BAN vs AFG: ఆఫ్ఘనిస్తాన్ చేతిలో వైట్ వాష్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న బంగ్లాదేశ్
ఎవరూ లేనిది చూసిన ఆ దొంగ భక్తుడు వెంటనే ఆలయంలోని హుండీని పగుల గొట్టాడు. అందులోని డబ్బును బయటకు తీసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఆంజనేయ స్వామికి రూ. 10 సమర్పించి రూ. 5,000 పట్టుకెళ్లాడు. అయితే, ఈ ఘటన హర్యానాలోని రెవారీ జిల్లాలో జరిగింది. ధరుహెరా పట్టణంలోని హనుమంతుడి ఆలయంలో ఈ దొంగతనం జరిగింది. ఆ దొంగ భక్తుడు చేసిన చోరీ మొత్తం ఆ గుడిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
Read Also: Brij Bhushan Singh: మహిళా రిపోర్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన బ్రిజ్ భూషణ్ సింగ్..
అయితే, చోరీ జరిగిన విషయాన్ని ఆ గుడి పూజారీ పసిగట్టలేకపోయాడు. ప్రతి రోజులాగే.. ఆ రోజు ఈవెనింగ్ గుడికి తాళం వేసి వెళ్లిపోయాడు . మరుసటి రోజు ఉదయం గుడికి వచ్చి తాళం తీసి ఆలయం లోపల చూడగా.. హుండీ పగిలి ఉన్న విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దొంగ భక్తుడి కోసం గాలిస్తున్నారు.