స్వదేశంలో అఫ్ఘనిస్తాన్ చేతిలో వైట్‌వాష్ అయ్యే ప్రమాదాన్ని బంగ్లాదేశ్ జట్టు తప్పించుకుంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లా టీమ్ 0-2తో వెనుకపడగా.. ఇవాళ (మంగళవారం) జరిగినమూడో వన్డేలో గెలవడంతో ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించి, దీంతో ఘోర పరాభవం ఎదుర్కోకుండా బయట పడింది. దీంతో వన్డే సిరీస్ ను ఆఫ్ఘినస్తాన్ టీమ్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్.. 45.2 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బంగ్లాదేశ్ 23.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గె్ట్ ను ఛేదించింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో బంగ్లా ఘన విజయం సాధించింది. బంగ్లా ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజృంభించడంతో వారి టీమ్ ఈజీగా విజయాన్ని అందుకుంది.
Read Also: Brij Bhushan Singh: మహిళా రిపోర్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన బ్రిజ్ భూషణ్ సింగ్..
తొలుత బౌలింగ్‌లో షోరీఫుల్ ఇస్లాం నాలుగు వికెట్లు తీసుకోగా.. తస్కిన్ అహ్మద్ రెండు, తైజుల్ ఇస్లాం రెండు వికెట్లు తీసుకున్నారు. ఇక షకీబ్ అల్ హసన్, మెహిది హసన్ తలో వికెట్ పడగొట్టి చెలరేగగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో లిటన్ దాస్ హాఫ్ సెంచరీ చేయగా.. షకీబ్ , తౌహిద్ హ్రిదోయ్ రాణించారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో అజ్మతుల్లా ఒక్కడే అర్ధసెంచరీతో రాణించగా.. మిగతా వారంతా ఫెయిల్ అయ్యారు. షాహిది, నజీబుల్లా, ముజీబ్ మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ సిరీస్‌లో జరిగిన తొలి రెండు వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ వరుసగా గెలిచి సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లా పర్యటనలో తదుపరి 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్.. ఈ నెల 14, 16 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.