Brij Bhushan Singh: బీజేపీ ఎంపీ, మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ తమపై లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టి ఛార్జిషీట్ దాఖలు చేశారు. నమోదైన ఆరు కేసుల్లోనూ బ్రిజ్ వేధింపులకు పాల్పడినట్టు పేర్కొన్నారు. నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 180 మందిని విచారణ జరిపి ఛార్జిషీట్ తయారు చేశారు. ఢిల్లీ కోర్టు ఇప్పటికే బ్రిజ్ భూషణ్‌కు సమన్లు జారీ చేసింది. కేసును విచారించడానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది. జూలై 18న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.
Read Also: Priyanka Jawalkar: సెల్ఫీ గేమ్ అంటూ రెచ్చిపోయిన తెలుగమ్మాయి.. క్లీవేజ్ షోతో ప్రియాంక ట్రీట్
ఒక మైనర్‌తో సహా ఏడుగురు రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ తమని లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అతణ్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా లాంటి ప్రముఖ రెజ్లర్లు జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలు చేపట్టారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం రోజున ర్యాలీ నిర్వహించేందుకు యత్నించగా పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసిన తర్వాత వారు తమ నిరసనను విరమించారు. జూన్ 15లోగా ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేస్తామని ఠాకూర్ వారికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఇక, ఛార్జిషీట్ గురించి ప్రశ్నించినప్పుడు ఓ జాతీయ మీడియా రిపోర్టర్‌తో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ అనుచితంగా ప్రవర్తించారు.. బ్రిజ్ భూషణ్ సింగ్ ను.. టైమ్స్ నెట్‌వర్క్ రిపోర్టర్ లైంగిక వేధింపులకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలతో సహా అతనిపై నమోదు చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రశ్నలు అడిగారు.. దీంతో, టైమ్స్ నెట్‌వర్క్ కరస్పాండెంట్ తేజ్‌శ్రీతో దురుసుగా ప్రవర్తించాడు బ్రిజ్ భూషణ్. అతను ప్రశ్నలు అడిగినప్పుడు.. రిపోర్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు.. అయితే అతడిని వెనకాలే నడుకుంటూ వెళ్లిన రిపోర్టర్.. మరోసారి ప్రశ్నించగా.. కారులో కూర్చున్న బ్రిజ్ భూషన్ సింగ్.. మరోసారి అనుచితంగా ప్రవర్తించారు.. ఆ చానెల్‌కు సంబంధించిన మైక్‌ను కూడా పగలగొట్టాడు. ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా.. జవాబుదారీతనం లేకుండా ఎంపీ బ్రిజ్ భూషన్ సింగ్ వ్యవహార శైలి ఉందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.