దొంగ భక్తుడు వెంటనే ఆలయంలోని హుండీని పగుల గొట్టాడు. అందులోని డబ్బును బయటకు తీసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఆంజనేయ స్వామికి రూ. 10 సమర్పించి రూ. 5,000 పట్టుకెళ్లాడు. అయితే, ఈ ఘటన హర్యానాలోని రెవారీ జిల్లాలో జరిగింది. ధరుహెరా పట్టణంలోని హనుమంతుడి ఆలయంలో ఈ దొంగతనం జరిగింది. ఆ దొంగ భక్తుడు చేసిన చోరీ మొత్తం ఆ గుడిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.