TS High Court: తెలంగాణ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు.. తొలిసారి తెలుగులో తీర్పు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ హైకోర్టు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తెలుగులో తొలి తీర్పు వెలువరించడం ద్వారా చరిత్ర సృష్టించింది. సికింద్రాబాద్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు తొలిసారిగా తెలుగులో తీర్పు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు మలయాళంలో తీర్పును ఇవ్వగా.. ఆ తీర్పును అనుసరించి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ నగేష్ భీమపాకలతో కూడిన ధర్మాసనం తొలిసారిగా తెలుగులో 44 పేజీల తీర్పును వెల్లడించింది. స్థానిక భాషల్లో కేరళ తరువాత తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు మాత్రమే.
Read Also: Manipur: మణిపూర్‌లో ఉద్రిక్తత.. బాష్పవాయువును ప్రయోగించిన భద్రత దళాలు
Also Read
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో మొత్తం ఇంగ్లీష్ భాషలోనే తీర్పులను ఇస్తుంటారు. పిటిషన్‌లు దాఖలు చేసినప్పుడు అనుబంధ డ్యాక్యుమెంట్లు, ఆధారాలు స్థానిక భాషలో ఉన్నప్పటికీ వాటిని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లెట్ చేసి కోర్టు రిజిస్ట్రీకి ఇవ్వాలి. సుప్రీం కోర్టు కీలక తీర్పులను ఈ మధ్య స్థానిక భాషల్లోకి ట్రాన్స్‌లెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులు కూడా స్థానిక భాషలో తీర్పులు వెల్లడించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. స్థానిక భాషల ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా కోర్టులు కూడా మాతృభాష వైపు మొగ్గు చూపుతున్నాయి.
Read Also: Himanta Biswa Sarma: కేవలం మీడియా హైప్ కోసమే.. రాహుల్ మణిపూర్ పర్యటనపై అసోం సీఎం ధ్వజం
అయితే.. సికింద్రాబాద్ మచ్చబొల్లారంలో 4 ఎకరాల స్థలం విషయంలో కె. చంద్రారెడ్డి, కె. ముత్యంరెడ్డి మధ్య వివాదం తలెత్తింది. వారి తల్లి పేరు మీద ఉన్న భూమి ఆమె బ్రతికి ఉన్న సమయంలో పంచి ఇవ్వలేదు. ఆమె మరణించిన తర్వాత ఈ భూమి గొడవకు దారితీసింది. తల్లి రాసిన వీలునామా ద్వారా భూమి మొత్తం తనకే వచ్చిందని పెద్ద కుమారుడు చంద్రారెడ్డి పేర్కొనగా.. ఆ వీలునామా చెల్లదని అందులో సగం భూమి తనదే అంటూ ముత్యంరెడ్డి సివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు.
Read Also: Asia Cup 2023: టీమిండియాకు శుభవార్త.. ఆసియా కప్ 2023లో కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా!
విచారించిన సివిల్ కోర్టు తల్లి రాసిన వీలునామాలో సందేహాలున్నాయని చెప్పింది. ఆ వీలునామా చెల్లదని పేర్కొంటూ.. తల్లి ఆస్తి ఇద్దరికీ సమానంగా చెందుతుందని తీర్పుని ఇచ్చింది. కింది కోర్టు తీర్పుపై చంద్రారెడ్డి అతని వారసులు హైకోర్టులో అప్పీలు చేయగా.. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ.. కింది కోర్టు వెలువరించిన తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ చంద్రారెడ్డి పిటిషన్ ను కొట్టివేసింది. ఈ మేరకు తెలుగులో తీర్పును వెలువరించింది.
Read Also: Bihar: బీహార్‌లో అమిత్ షాకు వ్యతిరేకంగా పోస్టర్లు.. ఆర్‌జేడీ పనే అంటున్న బీజేపీ
తెలుగులో తీర్పు వెలువరించటంపై ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టులు ప్రాంతీయ భాషల్లో తీర్పులు వెలువరించేందుకు వీలుగా పార్లమెంటు తప్పనిసరిగా చట్టం చేయాలన్నారు. ప్రాంతీయ భాషల్లో తీర్పులను వెలువరించటం ద్వారా ప్రజలకు న్యాయవ్యవస్థను మరింత చేరువ అవుతుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!