తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు బదిలీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. జస్టిస్ సుధీర్ కుమార్ ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయగా.. జస్టిస్ చిల్లకూర్ సుమలతను కర్ణాటక హైకోర్టుకు ట్రాన్స్ ఫర్ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ టెస్టులు ఆపాలని ఎస్పీలు, కమిషనర్లకు TSLPRB ఆదేశాలు ఇచ్చింది
తెలంగాణలో సింగరేణి ఎన్నికలపై వివాదం కొనసాగుతునే ఉంది. సింగరేణి ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కార్మిక సంఘం ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడంలేదని కేంద్ర కార్మిక శాఖ పిటిషన్ వేసింది.
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీపై ఈనెల 19 వరకు తెలంగాణ హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Singareni Elections: సింగరేణి ఎన్నికలపై విడనున్న సస్పెన్స్ ఇవాల్టితో వీడనుంది. ఇప్పటికే అక్టోబర్ నెలలోనే ఎన్నికలు జరుపాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే.. ఇవాళ ఆర్ఎల్సి అధ్యక్షతన అన్ని కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై తెలంగాణ హైకోర్టు ఇవాళ(మంగళవారం) విచారణ చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారంటూ తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిసన్ గ్రూప్-1 పరీక్ష రద్దుపై హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ స్పందించారు. తెలంగాణ హైకోర్టు తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిది అని ఆయన అన్నారు.
గ్రూప్-1 రద్దుకు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడమే ప్రధాన కారణంగా తెలంగాణ హైకోర్టు చూపింది. నోటిఫికేషన్ లో ఇచ్చిన ప్రతి నిబంధనను తప్పకుండా పాటించాల్సిందిగా టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉచిత, నిర్బంధ, విద్య హక్కు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని పిటీషనర్ వాదనలు వినిపించాడు.
రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై తెలంగాణ హైకోర్టు ఈ నెల 19 వరకు స్టే విధించింది. రంగారెడ్డి జిల్లా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల పదోన్నతులపై ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.