ప్రేమ సంబంధాలలో ఇద్దరి(ప్రియుడు, ప్రియురాలు)పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. అంగీకారంతో శారీరక సంబంధానికి సంబంధించిన అత్యాచారం కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇద్దరి అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత అత్యాచారం కేసు నమోదు చేయరాదని పేర్కొంది. ఇలాంటి కేసులపై ఎస్సీ ఆందోళన వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ ఛైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కో-ఛైర్మన్గా దామోదర రాజనర్సింహను నియమించారు. అంతేకాకుండా.. ఈ కమిటీలో నలుగురు సభ్యులను కూడా నియామించారు.
అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.. కాగా.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసిన వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు రాత్రి 9:30 గంటలలోపు తీర్పు వెలువడే అవకావం ఉంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని.. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ల పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ తెలిపారు.
MLC Kavitha: ఇవాళ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్ట్ తీర్పు ఇవ్వనుంది. సీబీఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై జడ్జి కావేరి బవేజా తీర్పు వెలువరించనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు రౌస్ అవెన్యూ కోర్ట్ జడ్జి కావేరి బవెజా తీర్పు ఇవ్వనున్నారు. కాగా.. తన చిన్న కొడుకు పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించింది. గత గురువారం నాడు కోర్టులో వాదనలు ముగిశాయి. కవిత మధ్యంతర బెయిల్ పై స్పెషల్ కోర్ట్ తీర్పు రిజర్వ్ చేసింది.
Azharuddin: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీ చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ స్థానాన్ని కేటాయించింది.