పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలలో నటిస్తున్న. ఈ రెండు సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్’ సినిమాను అనౌన్స్ చేసాడు. ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం నిన్న హైదరాబాద్‌లో జరిపిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ వేడుక జరిగింది. అయితే చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ఫస్ట్ లుక్ లేదా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం మరో హంగామా మొదలైంది.
పూజ కార్యక్రమం ముగిసిన గంటల్లోనే ప్రభాస్ ‘స్పిరిట్’ లో కనిపించే లుక్ ఇదే అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడం మొదలైంది. పోలీస్ డ్రెస్ లో షార్ట్ హెయిర్ తో షూటింగ్ లో పాల్గొన్నట్టు ఉన్న ఆ ఫొటో నిజమో కాదో తెలియనప్పటికి, ప్రభాస్ అభిమానులు మాత్రం దీనిని తెగ షేర్ చేస్తున్నారు. ఫోటోలో ప్రభాస్ కొత్త హెయిర్‌స్టైల్, ఇంటెన్స్ లుక్ కనిపించడంతో అభిమానులు కూడా అది నిజమేనని వైరల్ చేశారు. కానీ అసలు ఆ ఫోటో ఫేక్ అని ఎవరో హీరో ఫోటోకు ప్రభాస్ ఫేస్ యాడ్ చేసి రిలీజ్ చేశారని వంగా టీమ్ లో ఒకరు తెలిపారు. ఏదైనా ఉంటె తాము అఫీషియల్ గా చెప్తామని వెల్లడించారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని మాస్ యాక్షన్, ఎమోషన్, అత్యుత్తమ స్టైల్‌తో తెరకెక్కించబోతున్నాడట. ‘అనిమల్’ తర్వాత వంగా నుంచి రాబోయే ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అనిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా కనిపించబోతుంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.