Jigarthanda Double X : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ మరియు ఎస్. జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’..2014లో వచ్చిన ‘జిగర్తాండ’ అనే సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. సిద్ధార్థ్ మరియు బాబీసింహ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేయడం అలాగే ఆ సినిమాలో రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య లాంటి యాక్టర్స్ నటిస్తున్నారనే సంగతి తెలియడంతో ఈ ప్రాజెక్టుపై మంచి అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందు రిలీజ్ అయిన సాంగ్స్ మరియు ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అలా భారీ అంచనాల నడుమ దీపావళి కానుకగా నవంబర్ 10న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో లారెన్స్, SJ సూర్య తమ నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు.
ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా చూసి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.ముఖ్యంగా సినిమా రిలీజ్ అయిన సమయంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ ట్వీట్ చేస్తూ..” జిగర్ తాండ డబుల్ ఎక్స్ సినిమా చూశాను. కార్తీక్ సుబ్బరాజు నుంచి వచ్చిన మరో అద్భుత చిత్రం ఇది.. అద్భుతంగా నటించడం ఎస్. జె సూర్యకు అలవాటయిపోయింది. ఒక నటుడుగా రాఘవ లారెన్స్ ఎంతగానో మెప్పించారు… సంతోష్ నారాయణ మ్యూజిక్ ఆకట్టుకుంది..సినిమా చివరి 40 నిమిషాలు నా మనసు దోచుకుంటుంది. సినిమా టింకు ఆల్ ద బెస్ట్” అంటూ ట్వీట్ చేశారు. సినీ ప్రముఖులతో పాటు క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.. అలా అందరి నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది.ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. వచ్చే శుక్రవారం అనగా డిసెంబర్ 8 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఇదే విషయాన్ని నెట్ ఫ్లిక్స్ ఆఫీషియల్ గా స్పెషల్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసింది.
Also Read
- Honour Killing: వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని.. దీపావళిలో రోజే కుమార్తె హత్య.
- Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలే లాభాలు.. ధైర్యంతో పెట్టుబడి పెట్టిన వారికి వరించిన ధనలక్ష్మి..
- Qualcomm Layoffs: హైదరాబాద్ సహా భారత్‌లో క్వాల్కామ్ ఉద్యోగులకు బిగ్ షాక్..
- Anthropic CEO: 10 ఏళ్లలో క్యాన్సర్ లేని ప్రపంచం.. ఏఐపై భారీ అంచనాలు..
https://twitter.com/Netflix_INSouth/status/1730429009345839240
తాజావార్తలు
-
Censor Board: టాలీవుడ్ నిర్మాతలకు సెన్సార్ కక్షసాధింపు గండం
-
Honour Killing: వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని.. దీపావళిలో రోజే కుమార్తె హత్య.
-
AA23: బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్.. లోకేష్ ప్రాజెక్ట్ టైటిల్ ఇదేనట!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలే లాభాలు.. ధైర్యంతో పెట్టుబడి పెట్టిన వారికి వరించిన ధనలక్ష్మి..
-
Qualcomm Layoffs: హైదరాబాద్ సహా భారత్‌లో క్వాల్కామ్ ఉద్యోగులకు బిగ్ షాక్..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!