ఆగస్టు 15న జీవిత ఖైదీలకు క్షమాభిక్షల ద్వారా విడుదల అవుతారని అందరు అనుకున్నారు.. అయితే, చివరకు వారికి నిరాశే మిగిలింది. రాజ్ భవన్ – ప్రగతి భవన్ మధ్య దూరం పెరగడమే కారణమని తెలుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా 120 మంది ఖైదీల విడుదల జాబితాను తెలంగాణ జైళ్ల శాఖ ఉన్నతాధికారులు హోంశాఖకు పంపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి రెండు సార్లు క్షమాభిక్షలు ప్రసాదించింది. వందలాది మంది జీవిత ఖైదీలు విడుదల కాలేకపోవడం వల్ల 35 సంవత్సరాలుగా జైళ్ల నాలుగు గోడల మధ్య ఖైదీలు నలిగిపోతున్నారు.
అయితే.. ఇప్పుడు క్షమాబీక్షలు దయ దక్షణాలుగా మారాయి. డబ్బు అంగబలం ఉన్న ఖైదీలు ఉంటే వారి కోసం గత ప్రభుత్వాలు ప్రత్యేక జీవోల ద్వారా విడుదల చేశాయి. కిడ్నాప్, అత్యాచారాలు, చిన్నారుల హత్యలు, డబుల్ మర్డర్ హత్య కేసు, బాంబు పేలుళ్ల కేసులు వంటి వాటికి క్షమాభిక్షులు లేకపోవడం గమనార్వం. ఇక, ఒక నేరస్తుడు ఐదు సంవత్సరాల శిక్ష అనుభవిస్తే చాలునని గాంధీ ముళ్ళ కమిషన్లు వెల్లడించాయి. మాగుంట సుబ్బిరామ రెడ్డి హత్య కేసులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న గణేష్ 35 సంవత్సరాలు గా చర్లపల్లి జైలులో మగ్గిపోతున్నాడు.
Read Also: Kejriwal: సుదీర్ఘ ప్రసంగాలు చేస్తే భారతదేశం విశ్వగురువు కాదు.. మోడీకి ఢిల్లీ సీఎం కౌంటర్
ఇక, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సదరు జీవిత ఖైదీకి క్షమాబిక్షను ప్రసాదించారు. ఏదో ఒక కారణంతో ఆ క్షమాభిక్ష నిలిచిపోయింది. కేసీఆర్ క్షమాభిక్ష ప్రసాదించారు. కేంద్ర సీబీఐ పరిధిలోకి వెళ్ళింది.. గణేష్ క్షమా బిక్ష ఏదో ఒక కారణంతో నిలిచిపోతు వచ్చింది. హైకోర్టు నెల రోజుల బెల్ మంజూరు చేసింది.. పరివర్తన చెందిన ఖైదీలుగా అధికారులు గుర్తించారు.
Read Also: Students Protest: స్వాతంత్య్ర దినోత్సవం రోజు కుళ్ళిన ఇడ్లీలు పెట్టారని విద్యార్థుల ఆందోళన
ఆగస్టు 15 జీవిత ఖైదులు విడుదల అవుతారని కొండంత ఆశతో ఎదురు చూశారు. గవర్నర్, హోం శాఖ, జైళ్లశాఖ అధికారులతో గంటలు తరబడి చర్చించారు. క్షమాభిక్ష రాకపోవడంతో చర్లపల్లి, చంచల్ గూడా, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ ప్రధాన జైళ్లల్లో జీవిత ఖైదీలు నిరాశతో కనిపిస్తున్నారు. జీవిత ఖైదీలకు క్షమాభిక్షులు ప్రసాదించి అర్హులైన ఖైదీలను విడుదల చేయాలని రాజకీయ విడుదల కమిటీ కార్యదర్శి బల్ల రవీందర్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్షమాభిక్షలపై కొర్రీలు పెట్టి ఖైదీల జీవితాలతో ఆటలు ఆడొద్దని ఆయన కోరారు.