దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజు పులిసి వాసన వస్తున్న ఇడ్లీలు పెట్టారని విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలోని మంథని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహ సముదాయంలోని విద్యార్థులకు ఉదయం పెట్టాల్సిన ఇడ్లీ మధ్యాహ్నం పెట్టారని, ఇడ్లీలు వాసన రావడంతో విద్యార్థుల ఆందోళనకు దిగారు. మంథని అంబేద్కర్ చౌరస్తాలో స్టూడెంట్స్ నిరసన చేశారు.
Read Also: Ram Gopal Varma: వ్యూహం టీజర్ చూడమని వారిని నేనేం అడుక్కోను..
అయితే, విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. హాస్టల్ ను సందర్శించి ఆహార పదార్థాలను పరిశీలించిన తర్వాత హాస్టల్ వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చదువుకునే విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై జిల్లా మంత్రి బాధ్యత వహించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: Indian Flag: బుర్జ్ ఖలీఫాపై భారతీయ జెండా.. వీడియో ఇదిగో
రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి.. జరుగుతుంది మరోకటి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. సంక్షేమ హాస్టల్ లో మంచి పౌష్టిక ఆహారం అందిస్తున్నామని గొప్పలు చెప్పడం కాదు.. వచ్చి ఇక్కడి పరిస్థితిని చూస్తే అర్థం అవుతుంది ఎలాంటి భోజనం విద్యార్థులకు ఈ ప్రభుత్వం అందిస్తుంది అనే విషయం అని శ్రీధర్ బాటు పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక-సంక్షేమ హాస్టల్ స్టూడెంట్స్ కు నాణ్యమైన ఆహారం అందించాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.