ఫోన్ లేని ప్రపంచాన్ని ప్రస్తుతం మనం ఊహించుకోలేం. మనకి ఎక్కడికి వెళ్లినా, ఏం చేస్తున్నా మొబైల్ ఫోన్ కావాల్సిందే. అది మన జీవితంలో భాగమయిపోయింది. కొంతమంది అయితే తినేటప్పుడు, పడుకునేటప్పుడు ఆఖరికి బాత్రూంకు వెళ్లినప్పుడు కూడా మొబైల్ వదలరు. మరి కొందరైతే ఫోన్ లో ఛార్జింగ్ లేకుండా మొత్తం వాడేసి ఆఖరికి ఫోన్ ఛార్జ్ చేస్తున్న సమయంలో కూడా వాడకుండా ఉండలేక అలాగే చేతిలో పట్టుకొని వాడుతుంటారు, చెవిలో పెట్టుకొని మాట్లాడుతుంటారు. అయితే చాలా సందర్భాల్లో మనం జేబులో ఉన్న ఫోన్లు , ఛార్జింగ్ లో ఉన్న ఫోన్ లు పేలడం చూస్తున్నాం. వాటి వల్ల చాలా మంది గాయాల పాలు అవుతున్నారు కూడా. అందుకే నిపుణులు ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు వాడకూడదని సూచిస్తున్నారు. ఇక ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ కూడా ఇదే విషయంపై తన యూజర్లను హెచ్చరించింది.
Also Read: LiFi: ఎల్ఈడీ బల్బ్‌తో ఇంటర్నెట్… ఇక హ్యాకింగ్ బెడద తప్పినట్టే
యాపిల్ ఫోన్..మొబైల్ ఫోన్లలో దీనికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ప్రతి ఒక్కరి డ్రీమ్ ఫోన్ యాపిల్ యే. జీవితంలో ఒక్కసారైనా దీనిని వాడాలని అందరు అనుకుంటూ ఉంటారు. ఇక యూజర్లను ఆకర్షించే విధంగా యాపిల్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు తన యూజర్లకు కొత్త మోడళ్లను అందిస్తోంది. అయితే తాజాగా యాపిల్ సంస్థ కొన్ని విషయాల్లో తన యూజర్లను హెచ్చరించింది. మొబైల్ ఛార్జింగ్ పెట్టి దాని పక్కనే పడుకోవడం చాలా ప్రమాదకరం అంటూ యాపిల్ వార్నింగ్ ఇచ్చింది. ఇలా చేస్తే ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలగవచ్చని హెచ్చరించింది. ఇక చార్జర్ అడాప్టర్ పై, ఫోన్ పై ఎప్పుడు పడుకోవద్దని దీని వల్ల వాటిపై ఒత్తిడి పడుతుందని తెలిపింది. దుప్పట్లు , దిండ్ల కింద వీటిని ఉంచవద్దని, గాలి, వెలుతురు ఉండే ప్రదేశాల్లో ఉంచాలని సూచించింది.
ఇక మరో ముఖ్యమైన సూచనగా ఐ ఫోన్లకు ఇతర చార్జర్లను ఉపయోగించవద్దని కేవలం కంపెనీ ఫోన్ తో పాటు ఇచ్చిన ఛార్జర్ నే వినియోగించాలని కోరింది. వేరే ఫోన్ ఛార్జర్ ఉపయోగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇక ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు ఉపయోగిస్తే ప్రాణాలు కూడా పోయే పరిస్థితి రావచ్చని యాపిల్ సంస్థ హెచ్చరించింది.