3D-Printed Post Office: దేశంలోనే తొలి 3డీ పోస్టాఫీసు.. పురోగతికి నిదర్శనమన్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
3D-Printed Post Office: కర్ణాటకలో బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్‌లో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీస్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో దీనిని నిర్మించినట్లు వెల్లడించారు.
Read Also: Commando Suicide: ఏకే-47 రైఫిల్‌తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య.. కారణమేంటంటే?
Also Read
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
- Trump: ఇరాన్‌పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
- IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
1,021 చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మించినట్లు పోస్టల్ శాఖ తెలిపింది. లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టగా.. ఐఐటీ మద్రాస్ సాంకేతికతను అందించింది. సాంప్రదాయ పద్దతిలో ఏనిమిది నెలలు పట్టేది.. కేవలం 45 రోజుల్లోనే పోస్టాఫీస్‌ను నిర్మించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. మద్రాస్ ఐఐటీ సాంకేతిక సహకారంతో ఎల్ & టీ సంస్థ దీన్ని నిర్మించినట్లు మంత్రి తెలిపారు.
Read Also: LiFi: ఎల్ఈడీ బల్బ్‌తో ఇంటర్నెట్… ఇక హ్యాకింగ్ బెడద తప్పినట్టే
బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్‌లోని భారతదేశపు మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కొనియాడారు, ఇది దేశంలోని ఆవిష్కరణలు, పురోగతికి నిదర్శనమని, స్వావలంబన స్ఫూర్తిని ఇది ప్రతిబింబిస్తోందని ప్రధాని అన్నారు. భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్టాఫీసును బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్‌లో చూసి ప్రతి భారతీయుడు గర్వపడతాడని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
The spirit of Aatmanirbhar Bharat!
🇮🇳India’s first 3D printed Post Office.📍Cambridge Layout, Bengaluru pic.twitter.com/57FQFQZZ1b
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 18, 2023
Every Indian would be proud to see India's first 3D printed Post Office at Cambridge Layout, Bengaluru. A testament to our nation's innovation and progress, it also embodies the spirit of a self-reliant India. Compliments to those who have worked hard in ensuring the Post… pic.twitter.com/Y4TrW4nEhZ
— Narendra Modi (@narendramodi) August 18, 2023
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
-
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
-
Trump: ఇరాన్‌పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
-
Bhatti Vikramarka: తెలంగాణలో పెట్టుబడుల జోరు.. ఇన్వెస్ట్ తెలంగాణకు వార్ రూమ్
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..