IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Sri Lanka: భారత్, శ్రీలంక జట్ల మధ్య టెస్టు క్రికెట్ అనగానే ఇరుజట్ల మధ్య సాగే హోరాహోరీ పోరు గుర్తొస్తుంది. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు లంకపై టెస్టుల్లో పరుగుల వర్షం కురిపించారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన టెస్టు చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు మాత్రం టీమిండియా మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరిట ఉంది. 1993 నుంచి 1997 మధ్య శ్రీలంకపై 11 టెస్టులు (13 ఇన్నింగ్స్‌లు) ఆడిన సిద్ధూ 71.92 సగటుతో 935 పరుగులు చేశారు. ఇందులో 4 శతకాలు, 3 అర్ధశతకాలతో పాటు ఏకంగా 18 సిక్సర్లు ఉన్నాయి. టెస్టుల్లో సిక్సర్లు కొట్టడం అరుదైన ఆ రోజుల్లోనే సిద్ధూ ఈ ఘనత సాధించగా, ఆ తర్వాత వచ్చిన సెహ్వాగ్, రోహిత్ వంటి హిట్టర్లు కూడా ఈ రికార్డును అందుకోలేకపోవడం విశేషం.
ఈ జాబితాలో లంక అల్ రౌండర్ ఎంజెలో మాథ్యూస్ 17 టెస్టుల్లో 16 సిక్సర్లతో రెండో స్థానంలో నిలవగా, వీరేంద్ర సెహ్వాగ్ 11 టెస్టుల్లో 15 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక భారత బ్యాటర్ల విషయానికొస్తే సిద్ధూ (18), సెహ్వాగ్ (15) తర్వాతి స్థానాల్లో హార్దిక్ పాండ్యా, సచిన్ టెండూల్కర్ చెరో 10 సిక్సర్లతో కొనసాగుతున్నారు. హార్దిక్ కేవలం 3 టెస్టుల్లోనే 10 సిక్సర్లు బాదడం గమనార్హం. అలాగే ధోనీ, రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ తలో 9 సిక్సర్లు కొట్టగా.. లంక మాజీలు అర్జున రణతుంగ (11), అరవింద డిసిల్వా (10) కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నారు. కాగా, ఆగస్టు 15 నుంచి గాల్ వేదికగా భారత్-శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండగా, శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న భారత బ్యాటర్లు ఈ సిక్సర్ల రికార్డులను తిరగరాస్తారో లేదో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?