India-Ukraine: ఉక్రెయిన్‌కు మద్దతుగా సంతకం చేయని భారత్.. కారణమేంటంటే..!
- ఉక్రెయిన్‌కు మద్దతుగా సంతకం చేసేందుకు భారత్ నిరాకరణ
- స్విట్జర్లాండ్ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకాని రష్యా
- ఇలాగైతే శాంతి చర్చలకు పరిష్కారం దొరకదన్న భారత్
- భారత్‌తో సహా పలు దేశాలు సంతకాలు చేసేందుకు నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్విట్జర్లాండ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో శాంతికి సంబంధించిన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ వెనుకడుగు వేసింది. ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా హాజరు కాకూడదని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో శాంతికి ముందడుగు పడే అవకాశం లేదని.. దీని వలన సమయం వృధా అని భారత్ భావించింది. ఈ నేపథ్యంలో సంతకం చేసేందుకు భారత్ ముందుకు రాలేదు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సహా 50 మందికి పైగా దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు.. ఇందుకోసం ఒక మార్గాన్ని రూపొందించడానికి స్విట్జర్లాండ్‌లో రెండు రోజుల పాటు సదస్సు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి రష్యా మాత్రం హాజరుకాలేదు. స్విస్ ఆల్పైన్ రిసార్ట్ ఆఫ్ స్టాన్స్‌స్టాడ్‌లో రెండు రోజుల చర్చలు జరిగాయి.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
ఈ సమావేశానికి ఇండియా తరపున విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పవన్ కపూర్ ప్రాతినిధ్యం వహించారు. అయితే ఉక్రెయిన్‌లో చర్చల ద్వారా పరిష్కారానికి మార్గాలను అన్వేషించడం భారత్ ఉద్దేశం అని కపూర్ తెలిపారు. అన్ని పక్షాలు చర్చల్లో భాగం కావాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది. మా విధానం స్థిరంగా ఉందని.. సమాధానం లేదా దౌత్యం ద్వారా మాత్రం శాశ్వత శాంతికి మార్గం చూపించొచ్చని భారత్ పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆచరణాత్మక పరిష్కారం చూపించాలని భారత్ అభిప్రాయపడింది.
సమ్మిట్‌లో దేశాధినేతలతో సహా 100కి పైగా దేశాలు మరియు సంస్థల నుంచి ప్రతినిధులు స్విట్జర్లాండ్‌లో సమావేశం అయ్యారు. చైనా కూడా హాజరు కావడం విశేషం. కొన్ని దేశాలు ఉక్రెయిన్ మద్దతుగా సంతాకాలు చేయగా.. భారత్‌తో పాటు ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా దేశాలు శాంతి పత్రంలో సంతకాలను నిలిపివేసినట్లు వార్తా సంస్థ తెలిపింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!